Webdunia - Bharat's app for daily news and videos

Install App

గౌతమీపుత్ర శాతకర్ణికి పన్ను మినహాయింపా? నా ఫేస్‌బుక్ పేజీకి పబ్లిసిటీ వచ్చింది: ఐవైఆర్

రుద్రమదేవి వంటి సినిమాలకు వినోద పన్ను మినహాయింపు ఇవ్వకుండా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వియ్యంకుడు, నందమూరి హీరో బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు వినోద పన్ను మినహాయింపు ఇవ్వడం సరికాదని ఐవైఆర

IYR Krishnarao
Webdunia
మంగళవారం, 20 జూన్ 2017 (15:56 IST)
రుద్రమదేవి వంటి సినిమాలకు వినోద పన్ను మినహాయింపు ఇవ్వకుండా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వియ్యంకుడు, నందమూరి హీరో బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు వినోద పన్ను మినహాయింపు ఇవ్వడం సరికాదని ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు. చరిత్రను వక్రీకరించిన సినిమాకు ఏ ప్రాతిపదికన మినహాయింపు ఇస్తారని ప్రశ్నించారు. ఇదే అంశాలపై తాను పోస్టులు చేస్తే తనపై విమర్శలు చేస్తున్నారన్నారు. 
 
సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారంటూ కొన్ని రోజుల క్రితం ఇంటూరి రవికిరణ్‌ను అరెస్ట్ చేసినప్పుడు తాను బాధపడ్డానని ఐవైఆర్ చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాలో పోస్టులు చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం సరికాదని ఐవైఆర్ అన్నారు. 
 
తాను అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్‌ ట్రంప్ నుంచి శ్రీ‌కాకుళం వ‌ర‌కు అన్నిటిపైనా పోస్టులు పెట్టానని అన్నారు. ఇలాంటి పోస్టులతోనే నిజానికి ఇప్పుడే తన ఫేస్ బుక్ పేజీకి పబ్లిసిటీ వచ్చిందన్నారు. ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు తాను ఇలా చేస్తున్నాన‌ని అందరూ చెప్తున్నారని.. ఎన్నికల బరిలోకి దిగేందుకు తన వద్ద అర్థబలం కానీ, అంగబలం కానీ లేవన్నారు.
 
బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి ఐవైఆర్ కృష్ణారావును తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్‌లు చేశారని ఆరోపిస్తూ ఐవైఆర్‌పై సర్కారు వేటు వేసింది. ఈ నేపథ్యంలో ఐవైఆర్‌పై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పించారు. అన్నం పెట్టిన చేతికి అన్నం పెట్టిన చేతికి సున్నం పెట్టిన మనిషి ఐవైఆర్ అని బుద్ధా ఫైర్ అయ్యారు. ఐవైఆర్ అహంకారంతో ఇలా మాట్లాడుతున్నారని.. ఏపీ సీఎం చంద్రబాబుకు ఆయన తక్షణం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Namo Bharat: ఏప్రిల్ 24న నమో భారత్ రాపిడ్ రైలు సేవను ప్రారంభించనున్న ప్రధాని

Woman Constable: ఆర్థిక ఇబ్బందులు: ఆత్మహత్యకు పాల్పడిన మహిళా కానిస్టేబుల్

అమరావతిలో అభివృద్ధి పనుల పునఃప్రారంభం: జగన్‌ను తప్పకుండా ఆహ్వానిస్తాం

రోడ్డు ప్రమాదం: వెంటనే స్పందించిన నాదెండ్ల మనోహర్

Hyderabad, పివిఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ హైవే ఫ్లై ఓవర్ నుంచి వేలాడిన తాగుబోతు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

తర్వాతి కథనం
Show comments