Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫర్హాన్ ఇంటి నుంచి నాన్న లాక్కొచ్చారా? ఏంటిది వాస్తవాలు తెలుసుకోరా?: శ్రద్ధా కపూర్ సీరియస్

బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అయిన శ్రద్ధా కపూర్‌పై వస్తున్న పుకార్లపై ఆమే స్వయంగా స్పందించింది. శ్రద్ధా కపూర్- ఫర్హాన్ అక్తర్ ప్రేమించుకుంటున్నారని.. ఇంకా శ్రద్ధ తన మకాంను ఫర్హాన్ ఇంటికే మార్చేసిందని వార్తల

Webdunia
సోమవారం, 9 జనవరి 2017 (13:58 IST)
బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అయిన శ్రద్ధా కపూర్‌పై వస్తున్న పుకార్లపై ఆమే స్వయంగా స్పందించింది. శ్రద్ధా కపూర్- ఫర్హాన్ అక్తర్ ప్రేమించుకుంటున్నారని.. ఇంకా శ్రద్ధ తన మకాంను ఫర్హాన్ ఇంటికే మార్చేసిందని వార్తలు గుప్పుమన్నాయి. అంతటితో ఆగకుండా శ్రద్ధా కపూర్‌కు ఆ విషయం తెలిసి.. ఆమె తండ్రి శక్తికపూర్‌.. ఆమెను ఫర్హాన్ ఇంటి నుంచి చేయిపట్టుకుని ఇంటికి లాకెళ్లినట్లు వస్తున్న వార్తలపై శ్రద్ధా కపూర్ సీరియస్ అయ్యింది.
 
సాధారణంగా తన సహనటులతో సంబంధాలున్నాయని వచ్చే పుకార్లను ఏమాత్రం పట్టించుకోను. వాటి గురించి పెద్దగా బాధపడను కూడా. అయితే తనతో పాటు ఇలాంటి వార్తల్లో తన కుటుంబాన్ని కూడా తీసుకురావడం కోపం తెప్పిస్తుందని చెప్పుకొచ్చింది. ఈ విషయం తననెంతో బాధపెట్టిందని.. నిజాలేంటో తెలుసుకోకుండానే ఇలాంటి గాసిప్స్ సృష్టించడం బాగోలేదని వార్నింగ్ ఇచ్చింది. వాస్తవాలను తెలుసుకుని వార్తలు రాయాలే తప్ప.. ఊహించుకుని కట్టుకథలు రాయడం సరికాదని శ్రద్ధా కపూర్ అసహనం వ్యక్తం చేసింది.
 
మణిరత్నం దర్శకత్వంలో 2015లో విడుదలైన ‘ఓకే బంగారం’ చిత్రాన్ని ‘ఓకే జాను’ పేరుతో హిందీలో రీమేక్‌ చేశారు. అందులో శ్రద్ధాకపూర్‌ నాయికగా నటిస్తోంది. మద్రాస్‌ టాకీస్‌, ధర్మ ప్రొడక్షన్స సంయుక్తంగా నిర్మించాయి. మణిరత్నం, కరణ్‌ జోహార్‌ నిర్మాతలు. ప్రస్తుతం ఆమెకు మంచి ఆఫర్లు వస్తూనే ఉన్నాయి.

హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిపోతోంది. ఈ క్రమంలో ''ఆషికీ-2''లో ఆదిత్యతో నటించి మంచి కెమిస్ట్రీతో సినిమా హిట్ టాక్‌ను సంపాదించుకుంది. ప్రస్తుతం అదే ఆదిత్యతో ఓకే జాను చిత్రంలో శ్రద్ధా కపూర్ నటిస్తోంది. ఈ సినిమాకు షాద్ అలీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 13వ తేదీ రిలీజ్ కానుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Quetta: బలూచిస్థాన్ రాజధాని క్వైట్టాను ఆధీనంలోకి తీసుకున్న బీఎల్ఏ

Pakistani drones: భారత్‌లోని 26 ప్రాంతాల్లో పాకిస్థాన్ డ్రోన్లు- భారత ఆర్మీ

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

Chardham Yatra: పాకిస్తాన్ దాడుల ముప్పు: చార్‌ధామ్ యాత్రను నిలిపివేసిన భారత సర్కారు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments