Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లు అర్జున్‌కు మెగాస్టార్ ట్యాగ్..? ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన ఆహా ఓటీటీ

Webdunia
గురువారం, 31 డిశెంబరు 2020 (16:11 IST)
ఆహా ఓటీటీలో అల్లు అర్జున్‌కు సంబంధిచిన ప్రోమో ఒకటి రిలీజ్‌ అయ్యింది. ప్రోమో అంతబాగానే ఉందిగాని పోస్ట్ చేసే ముందు మెగాస్టార్ అల్లు అర్జున్‌ అంటూ తగిలించారు. తెలుగు ఓటీటీ 'ఆహా'లో సామ్‌ జామ్‌ ప్రోగ్రామ్‌ ఎంత హిట్టో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

హీరోయిన్‌ సమంత వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షోలో పలువురు ప్రముఖులు పాల్గొంటున్నారు. అలాంటి షోలో మెగాస్టార్ చిరంజీవి అనేందుకు బదులు మెగాస్టార్ అల్లు అర్జున్ అని ప్రోమోలో పడటం చర్చకు దారితీసింది. ఇంకా దీనిపై చిరు ఫ్యాన్స్ మండిపడ్డారు. స్టైలిష్ స్టార్‌కు మెగాస్టార్ తగిలించడం ఏంటని ప్రశ్నించారు. 
 
ఈ మధ్యే మెగాస్టార్‌ చిరంజీవి సామ్‌తో కలిసి సందడి చేయగా తాజాగా అల్లు అర్జున్‌ షోలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేసిన ఆహా పూర్తి ఎపిసోడ్‌ డిసెంబర్‌ 21న వీక్షించవచ్చని తెలిపింది. అయితే ప్రోమోలో అల్లు అర్జున్‌కు ముందు "మెగాస్టార్‌" అని రాసుకొచ్చారు. ఇది చూసి చిర్రెత్తిపోయిన చిరు ఫ్యాన్స్‌ 'ఆహా'పై తీవ్రంగా మండిపడుతున్నారు. మా చిరంజీవి బిరుదును అందుకునే అర్హత ఏ హీరోకు లేదని ఫైర్‌ అవుతున్నారు. దీంతో మెగాస్టార్‌ ఫ్యాన్స్‌కు సారీ చెబుతూ ఆహా ఓటీటీ అధికారికంగా ట్వీట్‌ చేసింది. మెగాస్టార్‌ అభిమానులకు ఆహా ఓటీటీ బహిరంగ క్షమాపణ చెప్పింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భార్యతో విడాకులు ఇప్పించండి.. ఒమర్ : కూర్చొని మాట్లాడుకోండి.. సుప్రీం

3 నుంచి 5వేల సంవత్సరం మధ్యలో చంద్రుడు బూడిదవుతాడట, భయపెడుతున్న భవిష్యవాణి

మామిడి చెట్లకు వైభవంగా వివాహం.. జీలకర్ర, బెల్లం, మంగళసూత్రంతో.. ఎక్కడ?

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్‌‌గా బీఆర్ గవాయ్

75వ పుట్టినరోజు.. ఫ్యామిలీతో విదేశాలకు ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం
Show comments