రాజమౌళితో నా సినిమా వుంటుంది... స్పైడర్ హీరో మహేష్ బాబు

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు స్పైడర్ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ఈనెల 27వ తేదీన రిలీజ్ కానున్న స్పైడర్ మూవీకి సంబంధించి టిక్కెట్ల బుకింగ్స్ ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సిని

Webdunia
మంగళవారం, 26 సెప్టెంబరు 2017 (09:21 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు స్పైడర్ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ఈనెల 27వ తేదీన రిలీజ్ కానున్న స్పైడర్ మూవీకి సంబంధించి టిక్కెట్ల బుకింగ్స్ ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సినిమా బాహుబలి కలెక్షన్లను బ్రేక్ చేస్తుందని టాక్ వస్తోంది. 
 
ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా తాజా ఇంటర్వ్యూలో మహేష్ మాట్లాడాడు. ''స్పైడర్'' సినిమాను మురుగదాస్ అద్భుతంగా తెరకెక్కించారని మహేశ్ బాబు చెప్పుకొచ్చాడు. మురుగదాస్ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం చేయడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపాడు. 
 
అలాగే బాహుబలి మేకర్ రాజమౌళితో సినిమా చేయనున్నట్లు వస్తున్న వార్తలపై కూడా మహేష్ బాబు స్పందించారు. రాజమౌళితో కలిసి తాను సినిమా చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిపాడు. ప్రస్తుతం ఆయనకి కమిట్ మెంట్స్ వున్నాయని... తనకు కూడా కొన్ని కాల్షీట్స్ వుండటంతో కొంత టైమ్ తీసుకున్నాక ఈ సినిమాను కలిసి చేస్తామని చెప్పుకొచ్చాడు.
 
ఇకపోతే.. రాజమౌళి- మహేష్ బాబు కాంబోలో తెరకెక్కనున్న సినిమా 2018లో ప్రారంభమై 2019లో రిలీజ్ అవుతుందని.. అంతకుముందు కొరటాలతో భరత్ అనే నేను, మహేష్ 25 (త్రివిక్రమ్‌తో) సినిమాలను ప్రిన్స్ పూర్తి చేస్తాడని తెలుస్తోంది. ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, నాని వంటి హీరోలతో కలిసి పనిచేసిన రాజమౌళి త్వరలో తొలిసారిగా మహేష్ బాబుతో కలిసి పనిచేయనున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుతపులి.. కోళ్లపై దాడి.. ఉద్యోగులు, విద్యార్థుల్లో భయం భయం

కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని 45 రోజుల్లో పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్

జగన్‌కు టీడీపీ ఎమ్మెల్సీ సవాల్... నిరూపిస్తే పదవికి రాజీనామా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

తర్వాతి కథనం
Show comments