Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

దేవీ
మంగళవారం, 15 జులై 2025 (18:33 IST)
Genelia
దాదాపు 13 ఏళ్ల తర్వాత సౌత్ సినిమా సినిమా చేస్తున్నా. జూనియర్ కథ మూడేళ్ల క్రితం నా దగ్గరికి వచ్చింది. అయితే చేయాలా వద్దా అనేది ఇంకా డిసైడ్ చేసుకోలేదు. రితేష్‌ ఈ కథ గురించి నాకు చాలా పాజిటివ్ గా చెప్పారు. ఒకసారి విన్న తర్వాత నిర్ణయం తీసుకో అన్నారు. దర్శకుడు ఆ కథ, అందులో నా పాత్రను చెప్పిన విధానం నాకు ఎంతగానో నచ్చాయి అని జెనీలియా అన్నారు.
 
కిరీటి రెడ్డి, శ్రీలీల జంటగా నటిస్తుండగా, జెనీలియా కీలక పాత్ర పోషిస్తున్నారు. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మిస్తున్నారు. రాధా కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూలై 18న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా జెనీలియా పలు విషయాలు తెలియజేశారు.
 
-నేను బిగినింగ్ నుంచి ఎప్పుడూ చేయని కొత్త క్యారెక్టర్స్ చేయాలనే ఉద్దేశంతోనే సినిమాలు చేస్తూ వచ్చాను. ఇందులో నా పాత్ర చాలా స్పెషల్. ఇప్పటి వరకు ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు. అందుకే తప్పకుండా సినిమా చేయాలి అనిపించి చేశాను.  
 
-ఈ సినిమా ఒక అద్భుతమైన ప్యాకేజ్. దేవి శ్రీ ప్రసాద్, సెంథిల్ కుమార్ వీళ్ళ అందరితో పనిచేయడం రీయునియన్ లా అనిపించింది.
 
ట్రైలర్ లో నా క్యారెక్టర్ చాలా సీరియస్ గా ఉంటుందని అనడం కంటే ఒక మంచి బాస్ క్యారెక్టర్. సినిమా ముందుకెళ్తున్న కొద్ది ఆ క్యారెక్టర్ లో చాలా మార్పులు వస్తాయి. అవన్నీ కూడా చాలా కొత్తగా ట్రీట్ చేశారు డైరెక్టర్.
 
- జీవితమన్నప్పుడు అన్ని ఉంటాయి. అయితే ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశాను. బొమ్మరిల్లు హాసిని వెరీ మెమొరబుల్ క్యారెక్టర్. అలాగే హ్యాపీలో మధుమతి, కథ సినిమా. ఇప్పటికీ ఆడియన్స్ నా క్యారెక్టర్స్ పేరుతోనే నన్ను పిలుస్తుంటారు. అది ఒక నటిగా చాలా గొప్ప ఆనందాన్ని ఇస్తుంది.
 
- మంచి క్యారెక్టర్స్ వస్తే నటించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. చిన్న క్యారెక్టర్ అయినా గుర్తుండిపోయే క్యారెక్టర్ చేయడం నాకు ఇష్టం.
 
-ఇండస్ట్రీలోకి రావడం, ఇన్ని పాత్రలు చేయడం, ప్రేక్షకుల నుంచి విశేషమైనటువంటి అభిమానాలు పొందడం ఇదంతా కూడా నాకు ఒక డ్రీమ్ లాగా అనిపిస్తుంది. ఇంతకుమించిన డ్రీమ్ ఏమీ లేదు.  
 
రామ్ చరణ్, ఎన్టీఆర్, బన్నీ నా ఫ్రెండ్స్. చాలా అద్భుతమైన ప్రతిభ ఉన్న హీరోస్. ఇప్పుడు వారిని సూపర్ స్టార్స్ గా చూస్తున్నప్పుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది.
 
రితేష్ తో మజిలీ రీమేక్ చేశాం. అది అద్భుతమైన విజయాన్ని ఇచ్చింది. మరో మంచి లవ్ స్టోరీ కుదిరితే సినిమా చేయాలని ఆలోచన అయితే ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యాభర్తల గొడవ ... ఇద్దరి ప్రాణం తీసింది..

ఉద్యోగాలు, ప్రతిభ పరంగా అసాధారణ రీతిలో వృద్ధి చెందుతున్న 10 నగరాల్లో విశాఖపట్నం నెం. 1, విజయవాడ నెం. 3

నేను వైసిపి నాయకుడినే కానీ నాకు బాలయ్య దేవుడు: వైసిపి నాయకుడు సిద్దారెడ్డి

బెంగుళూరు విద్యార్థినికి లైంగిక వేధింపులు... ఇద్దరు ప్రొఫెసర్లతో సహా ముగ్గురి అరెస్టు

కాలేజీ విద్యార్థిని కాలును కరిచి కండ పీకిని వీధి కుక్కలు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments