Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగిసిన ఐటీ తనిఖీలు... నిర్మాత దిల్ రాజుకు కష్టాలు తప్పవా?

ఠాగూర్
శుక్రవారం, 24 జనవరి 2025 (15:47 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన నిర్మాతల దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్‌లతో పాటు.. సినీ దర్శకుడు సుకుమార్, సినీ ఫైనాన్షియర్‌ల గృహాల్లో తనిఖీలు చేశారు. ఈ సోదాలు నాలుగు రోజుల పాటు కొనసాగించి, శుక్రవారం మధ్యాహ్నానికి ముగించారు. ముఖ్యంగా, దిల్ రాజు నివాసంలో సుధీర్ఘంగా తనిఖీలు చేసిన ఐటీ అధికారులు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. నివాసంలో తనిఖీలు ముగిసిన తర్వాత శ్రీనగర్ కాలనీలోని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ కార్యాలయంలో తనిఖీలు చేశారు. ఇందుకోసం నిర్మాత దిల్ రాజును ఐటీ అధికారులు తమ వాహనంలోనే ఆ కార్యాలయాని తీసుకెళ్ళి అక్కడ కూడా సోదాలు చేశారు. 
 
గత రెండేళ్లుగా నిర్మించిన చిత్రాల వ్యయం, ఆదాయాలపై ఆరా తీశారు. సినిమాల నిర్మాణం కోసం పెట్టిన పెట్టుబడికి వచ్చిన ఆదాయానికి భారీ వ్యత్యాసం ఉన్నట్టు అధికారులు గుర్తించారు. అలాగే, వచ్చిన ఆదాయానికి చెల్లించిన పన్నులకు కూడా పెద్దమొత్తంలో వ్యత్యాసం ఉన్నట్టు ఐటీ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖులపై ఈ సోదాలు చేసినట్టు సమాచారం. ముఖ్యంగా, పుష్ప-2 చిత్రానికి సంబంధించిన నిర్మాతల గృహాల్లో కూడా దాదాపు మూడు రోజుల పాటు దాలు నిర్వహించారు. 
 
నిర్మాణ సంస్థలు విడుదల చేసిన పోస్టర్లను బట్టిచూస్తే ఆ చిత్రం రూ.1800 కోట్ల ఆదాయం వచ్చినప్పటికీ పన్నుల చెల్లింపులు తక్కువగా ఉన్నట్లు ఐటీ నిర్ధారించింది. నాలుగు రోజులుగా 18 ప్రదేశాల్లో 55 మంది బృందాలుగా ఏర్పడి సోదాలు నిర్వహించారు. టాలీవుడ్‌లో ఎప్పుడూ లేని విధంగా టాలీవుడ్ ఇండస్ట్రీపై ఐటీ దాడులు చేసింది. 
 
గతంలో భారీ బడ్జెట్ సినిమాలు చేసిన ఆదాయం ఎక్కువగా వచ్చిందని ప్రకటించిన నిర్మాతల ఇళ్లలోనే ఐటీ అధికారులు దాడులు చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఏకకాలంలో పెద్ద బ్యానర్స్‌ ఉన్న నిర్మాతలపై ఐటీ శాఖ దాడులు చేయడం హాట్‌టాపిక్‌గా మారింది. శుక్రవారం మధ్యాహ్నం తరువాత ఐటీ శాఖ అధికారులు దాడులకు సంబంధించి స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. అలాగే ఐటీ సోదాలపై నిర్మాత దిల్‌ రాజు కూడా మీడియాతో మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డొనాల్డ్ ట్రంప్ ఇమ్మిగ్రేషన్ చట్టం.. భారత విద్యార్థులు పార్ట్ టైమ్ ఉద్యోగాలను?

ఆర్డ్నెన్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఐదుగురు మృతి

డోనాల్డ్ ట్రంప్‌కు షాకిచ్చిన అమెరికా కోర్టు!!

అవమానభారం భరించలేక ఇద్దరు పిల్లలను చంపేసి తాను కూడా...

బాలీవుడ్ నటుడు సైఫ్‌కు వారసత్వ ఆస్తులు దక్కేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి అల్లం గురించి తెలుసా? అది తింటే ఏమవుతుంది?

కరకరమనే అప్పడాలు, కాళ్లతో తొక్కి మరీ చేస్తున్నారు (video)

తులసి టీ తాగితే ఈ సమస్యలన్నీ పరార్

శీతాకాలంలో జీడిపప్పును ఎందుకు తినాలి?

కోడికూర (చికెన్‌)లో ఈ భాగాలు తినకూడదు.. ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments