Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోవా నుంచి వ‌చ్చిన `ఇస్మార్ట్ శంక‌ర్‌` ఏం చేస్తున్నాడు..?

Webdunia
గురువారం, 4 ఏప్రియల్ 2019 (21:51 IST)
ఎన‌ర్జిట‌క్ స్టార్ రామ్‌, డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం `ఇస్మార్ట్ శంక‌ర్‌`. ప్ర‌స్తుతం సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. ఇటీవ‌లే గోవాలో భారీ  షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ పూర్తి చేసింది చిత్ర‌ యూనిట్‌. బుధ‌వారం నుండి హైద‌రాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో గ్రాండ్ స్కేల్‌లో ఓ పాట‌ను చిత్రీక‌రిస్తున్నారు. `దిమాక్ ఖ‌రాబ్‌..` అంటూ తెలంగాణ యాస‌లో సాగే ఈ పాట‌కు శేఖ‌ర్ మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీ అందిస్తున్నారు. 
 
టాలీవుడ్‌లో వ‌న్ ఆఫ్ ది బెస్ట్ డ్యాన‌ర్స్‌గా పేరున్న హీరో రామ్ మ‌రోసారి అదిరిపోయే స్టెప్పుల‌తో మెప్పించ‌నున్నాడు. కాస‌ర్ల శ్యామ్ రాసిన ఈ పాట‌ను కీర్త‌న శ‌ర్మ‌, సాకేత్ పాడారు. మ‌ణిశ‌ర్మ సంగీత సార‌థ్యం అందిస్తున్నారు. రామ్ స‌ర‌స‌న నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేశ్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి క‌నెక్ట్స్ బ్యాన‌ర్స్‌పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి కౌర్ నిర్మాత‌లు మారి రూపొందిస్తున్న ఈ సినిమాను వేస‌విలో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

karnataka heart attacks, 32 ఏళ్ల యోగా టీచర్ గుండెపోటుతో మృతి

మాజీ మంత్రి రోజా జైలుకెళ్లడం ఖాయం : శాఫ్ చైర్మన్ రవి నాయుడు

కళ్లు కనిపించట్లేదా.. చెత్తను ఎత్తుతున్న మహిళపై కారును పోనిచ్చాడు.. టైర్ల కింద? (video)

బంగ్లాదేశ్‌లో కుప్పకూలిపోయిన యుద్ధ విమానం - 19 మంది నిర్మాతలు

Vijayashanthi: గుడ్ మార్నింగ్‌లు వద్దు.. జై తెలంగాణ అని పలకరించుకోవాలి.. విజయశాంతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments