Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనిషి భవిష్యత్తు చేతి రేఖల్లోనా? చేసే చేతల్లో నా? చెప్పేదే సారంగపాణి జాతకం

దేవి
సోమవారం, 24 ఫిబ్రవరి 2025 (09:21 IST)
Priyadarshi
ప్రియదర్శి, రూప కొడువాయూర్ జంటగా నటించిన సారంగపాణి జాతకం' సమ్మర్ రిలీజ్ కి సిద్దమైంది. ఇటీవల విడుదలైన టైటిల్ సాంగ్ 'సారంగో సారంగా', 'సంచారి సంచారీ' పాటలు ట్రెండ్ అవుతుండగా, టీజర్ లోని మాటలు, హాస్య సన్నివేశాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. మోహనకృష్ణ ఇంద్రగంటి, శ్రీదేవి మూవీస్ కలయికలో మూడో చిత్రంగా విడుదలవ్వనున్న 'సారంగపాణి జాతకం' గురించి నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ పలు విషయాలు తెలిపారు.
 
'' వేసవి సెలవుల్లో కుటుంబమంతా కలిసి వెళ్ళి చూసే పరిపూర్ణ హాస్యరస చిత్రం మా 'సారంగపాణి జాతకం'. మా దర్శకులు మోహనకృష్ణ ఇంద్రగంటి అద్భుతంగా తీశారు. ఇటీవల విడుదలైన టీజర్ లో ప్రేక్షకులకు మా సారంగపాణి ప్రపంచం ఎలా ఉంటుందో పరిచయం చేసాం. సినిమా చిత్రీకరణ, డబ్బింగ్ కార్యక్రమాలు సైతం పూర్తయ్యి పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నాయి. మనిషి భవిష్యత్తు చేతి రేఖల్లో ఉంటుందా? లేదా చేసే చేతల్లో ఉంటుందా? అనే ప్రశ్నకు జవాబు ఇస్తూనే ఇంటిల్లిపాదిని కడుపుబ్బా నవ్వించే వినోదాత్మక చిత్రమిది. ఆద్యంతం కట్టిపడేస్తూనే, వచ్చే ఎండలకి సాంత్వనలా అందరినీ అలరిస్తుందీ సినిమా'' అని అన్నారు. 
 
ప్రియదర్శి పులికొండ, రూప కొడువాయూర్ జంటగా నటించిన ఈ సినిమాలో నరేష్ విజయకృష్ణ, తనికెళ్ళ భరణి, శ్రీనివాస్ అవసరాల, 'వెన్నెల' కిశోర్, 'వైవా' హర్ష, శివన్నారాయణ, అశోక్ కుమార్, రాజా చెంబోలు, వడ్లమాని శ్రీనివాస్, ప్రదీప్ రుద్ర, రమేష్ రెడ్డి, కల్పలత, రూప లక్ష్మి, హర్షిణి, కె.ఎల్.కె, మణి, 'ఐమ్యాక్స్' వెంకట్ ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి మేకప్ చీఫ్: ఆర్.కె వ్యామజాల, కాస్ట్యూమ్ చీఫ్: ఎన్. మనోజ్ కుమార్, కాస్ట్యూమ్ డిజైనర్స్: రాజేష్ కామర్సు - అశ్విన్, మార్కెటింగ్: టాక్ స్కూప్, పీఆర్వో: పులగం చిన్నారాయణ, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్: కె. రామాంజనేయులు (అంజి బాబు) - పి రషీద్ అహ్మద్ ఖాన్, కో డైరెక్టర్: కోట సురేష్ కుమార్, పాటలు: రామ జోగయ్య శాస్త్రి, స్టంట్స్: వెంకట్ - వెంకటేష్, ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్, ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: పీజీ విందా, సంగీతం: వివేక్ సాగర్, లైన్ ప్రొడ్యూసర్: విద్య శివలెంక, సహ నిర్మాత: చింతా గోపాలకృష్ణా రెడ్డి, నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్, రచన - దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వ్యభిచార గృహం మంచం కింద అడ్డంగా దొరికిన వైకాపా నేత శంకర్ నాయక్!! (Video)

ఇద్దరికి పెళ్లీడు వచ్చాక చూద్దామన్న తండ్రి.. కత్తితో పొడిచిన ప్రియుడు!!

స్పా ముసుగులో గలీజ్ దందా... 13 మంది మహిళలు అరెస్టు!! (Video)

ఎస్ఎల్‌‍బీసీ టన్నెల్ ప్రమాదం.. ఆ 8 మంది ఇంకా సజీవంగా ఉన్నారా?

ఎమ్మెల్యే జగన్‌కు షాకిచ్చిన ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదుషా ఆరోగ్య ప్రయోజనాలు

నెక్స్ట్-జెన్ ఆవిష్కర్తలు NESTలో పెద్ద విజయం, ఆరోగ్య సంరక్షణ పురోగతికి మార్గం సుగమం

నల్ల ద్రాక్ష ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియాలజీ సేవలను బలోపేతం చేయడానికి అత్యాధునిక క్యాథ్ ల్యాబ్ ప్రారంభించిన మణిపాల్ హాస్పిటల్

గవ్వలండోయ్ గవ్వలు బెల్లం గవ్వలు

తర్వాతి కథనం
Show comments