Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి, అల్లు అర‌వింద్ మ‌ధ్య విభేదాల మాట నిజ‌మేనా!

Webdunia
మంగళవారం, 11 అక్టోబరు 2022 (08:20 IST)
Chiranjeevi, Allu Aravind
మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర‌వింద్ బావ బావ‌మ‌రులు. ఇది అంద‌రికీ తెలిసిందే. అర‌వింద్ ర‌క్ష‌ణ‌గా చిరంజీవి వున్నార‌నేది అంద‌రికీ తెలిసిందే. కానీ ఆమ‌ధ్య ఇద్ద‌రి మ‌ధ్య ఏదో తేడా వుంద‌ని సోష‌ల్ మీడియాలో వార్త వ‌చ్చేసింది. ఈ విష‌యాన్ని మ‌రింత క్లారిటీ  నాకోసం కాదు. జ‌నాల‌కోసం ఇవ్వాలంటూ అలీతో స‌ర‌దాగా కార్య‌క్ర‌మంలో అల్లుఅర‌వింద్‌ను అలీ అడిగాడు. ఏమిటి అలీ! ప్ర‌శ్న‌లు అడిగేట‌ప్పుడు ఏమి అడుగుతావ‌ని చెప్పానుగ‌దా. ఏవోవో అడుగుతున్నావ్‌. అంటూ.. కాంట్ర‌వ‌ర్సీ కాద‌న్నావ్ అని అర‌వింద్ అన‌డంతో.. ఇది క్లారిటీకోసం అంటూ చెప్ప‌డంతో.. అర‌వింద్ త‌న‌దైన శైలిలో చెప్పారు.
 
మొన్న‌నే మా నాన్న‌గారైన అల్లు రామ‌లింగ‌య్య‌గారి వంద సంవ‌త్స‌రాల జ‌యంతి సంద‌ర్భంగా మేమంతా క‌లిసి వ‌చ్చాం క‌దా. ప్ర‌తి పండుగ‌గ‌కు, కుటుంబంలో ఏదో సంద‌ర్భంలో అలా క‌లుస్తూనే వుంటాం. ఇందులో ఎటువంటి కాంట్ర‌వ‌ర్సీ లేదు. మా బావ చిరంజీవి. బావ బావ‌మ‌రుద‌ల మ‌ధ్య స‌హ‌జంగా ఏవో వుంటాయ‌ని ప్ర‌జ‌లు భావించ‌వ‌చ్చు. అలాంటిది ఏమీలేదు అంటూ వివ‌రించారు.
 
ప‌నిలోప‌నిగా బాల ఎలాప‌రిచ‌యం అయ్యారు అన్న ప్ర‌శ్న‌కు, గోపీచంద్ అనే నిర్మాత‌ను క‌ల‌వ‌డానికి వెళ్ళిన‌ప్పుడు లోప‌ల‌నుంచి ఓ వ్య‌క్తి వ‌చ్చాడు. ఈయ‌న అల్లు అర‌వింద్ గారంటూ అత‌నికి నిర్మాత ప‌రిచ‌యం చేశారు. త‌ను షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఆయ‌నే చిరంజీవి. ఆ త‌ర్వాత మా  ఇంటిపైన మా బంధువు స‌త్య‌నారాయ‌ణ వుండేవాడు. ఆయ‌న కోసం చిరంజీవి వ‌చ్చారు. కాలింగ్ బెల్ కొట్టి స‌త్య‌నారాయ‌ణ‌గారు వున్నానా అని అడిగితే, మా అమ్మ డోర్ తీసి పైన వున్నాడ‌ని చెప్పింది. అలా మా అమ్మ చిరంజీవిని చూడ‌డం. అల్లుడు చేసుకోవాల‌ని ఆలోచ‌న ఆమెకు క‌ల‌గ‌డం.. ఆ త‌ర్వాత నాన్న‌గారు ఓ షూటింగ్‌లో చిరంజీవి గురించి ఎంక్వ‌యిరీ చేయ‌డం అలా అలా జ‌రిగిపోయాయి అంటూ వివ‌రించారు. మొద‌ట షేక్ హ్యాండ్ ఇచ్చిన చేయి అలా కంటెన్యూగా మా ఇంటివాడిని చేసిదంటూ హాస్యోక్తిగా అన్నారు.

సంబంధిత వార్తలు

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments