Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ‌మౌళి ఆర్ఆర్ఆర్ గురించి షాకింగ్ న్యూస్..!

Webdunia
మంగళవారం, 12 నవంబరు 2019 (20:58 IST)
దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ మ‌ల్టీస్టార‌ర్ ఆర్ఆర్ఆర్. బాహుబ‌లి త‌ర్వాత రాజ‌మౌళి చేస్తోన్న సినిమా కావ‌డంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. దీనికితోడు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టిస్తుండ‌డంతో మ‌రింత క్రేజ్ ఏర్ప‌డింది. అలాగే ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్స్‌ అజయ్‌ దేవగణ్‌, ఆలియా భట్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
 
అస‌లు విష‌యానికి వ‌స్తే.. ఈ సినిమా ప్రారంభంలో వచ్చే ఏడాది జూలై 30న విడుదల చేస్తామని చిత్ర యూనిట్‌ ప్రకటించింది. అయితే... షూటింగ్‌లో రామ్‌చరణ్‌ గాయపడటం, అలాగే ఎన్టీఆర్‌ చేతికి గాయమవడం వంటి కారణాలతో షూటింగ్‌ షెడ్యూల్స్‌ ఆలస్యమైయ్యాయి. ఇప్పుడు ఈ ఆలస్యం సినిమా విడుదల విషయంలో కీలకంగా మారింది.
 
 సినిమా పూర్తయిన తర్వాత రాజమౌళి పోస్ట్‌ ప్రొడక్షన్‌కి ఆరు నెలల సమయం తీసుకుంటాడు. అంటే డిసెంబర్‌కి షూటింగ్‌ పూర్తయితే జూలైకి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేది కానీ పరిస్థితి మారడంతో సినిమా విడుదల తేదీని మార్చాలని దర్శక నిర్మాతలు అనుకుంటన్నట్లు వార్తలు వ‌స్తున్నాయి. 
 
వచ్చే ఏడాది దసరా సందర్భంలోనైనా లేకుంటే 2021 సంక్రాంతికి కానీ సినిమాను విడుదల చేస్తే బాగుంటుంద‌ని అనుకుంటున్నార‌ట‌. మ‌రి.. ప్ర‌చారంలో ఉన్న ఈ వార్త‌లు వాస్త‌వ‌మేనా..? కాదా..? అనేది తెలియాల్సివుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుడికి వచ్చిన యువతిపై సామూహిక అఘాయిత్యం.. ఎక్కడ?

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments