Webdunia - Bharat's app for daily news and videos

Install App

గౌతమ్ మీనన్‌తో కబాలి : రోబో 2.0 విలన్ ఆదాయం రజనీకంటే పలురెట్లెక్కువా?

తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ కబాలి సినిమాలో రాధికా ఆప్టేతో లేటు వయసులోనూ ప్రేమాయణాన్ని చక్కగా పండించారు. అందుకేనేమో ప్రస్తుతం గౌతమ్ మీనన్ రజనీకాంత్‌తో సినిమా చేసేందుకు సై అంటున్నారు. ''ఘర్షణ", "ఏ మాయ

Webdunia
శనివారం, 27 ఆగస్టు 2016 (14:59 IST)
తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ కబాలి సినిమాలో రాధికా ఆప్టేతో లేటు వయసులోనూ ప్రేమాయణాన్ని చక్కగా పండించారు. అందుకేనేమో ప్రస్తుతం గౌతమ్ మీనన్ రజనీకాంత్‌తో సినిమా చేసేందుకు సై అంటున్నారు. ''ఘర్షణ", "ఏ మాయ చేశావె" వంటి ప్రత్యక్ష సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన గౌతమ్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం "సాహసం శ్వాసగా సాగిపో'' విడుదలకు సిద్ధమైంది. 
 
గతంలో సూపర్ స్టార్‌‍తో సినిమా చేయాలనుకుంటున్నానని.. పేరు, డబ్బు కోసం కాకుండా.. ట్రైలర్ కూడా రిలీజ్ కాకపోయినా ఆయన సినిమా రిలీజైతే ప్రేక్షకులు థియేటర్లకి వస్తారని కొనియాడారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అల్లుడు ధనుష్‌తో ఓ సినిమా చేస్తున్న గౌతమ్ మీనన్, ఈ సినిమాకు తర్వాత రజనీకాంత్‌కు తగిన స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నారని కోలీవుడ్ టాక్. 
 
ఇదిలా ఉంటే.. రోబో 2.0 సినిమాలో రజనీకి విలన్‌గా నటిస్తున్న అక్షయ్ కుమార్ పారితోషికం ఎంతో తెలుస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే. అక్షయ్ కుమార్ వార్షికాదాయం రజనీకాంత్‌ కంటే అధికమని ఫోర్బ్స్ వెల్లడించింది. ఫోర్బ్స్ జాబితాలో అధికంగా సంపాదించే సినీ నటుల పేర్లను విడుదల చేశారు. ఈ జాబితా ప్రకారం అక్షయ్ కుమార్ వార్షికాదాయం రూ.207 కోట్లు. ఇది రజనీకాంత్ కంటే పలు రెట్లు అధికం. ఈ జాబితాలో సల్మాన్, షారూఖ్, అమితాబ్‌లు కూడా చోటు సంపాదించారు.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments