Webdunia - Bharat's app for daily news and videos

Install App

#InttelligentTeaser : పేదోడికి ఫ్లాట్‌ఫాం.. ధర్మాభాయ్.కామ్ అంటున్న సాయి ధరమ్ తేజ్

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం "ఇంటిలిజెంట్". ఈ చిత్రం టీజర్ శనివారం విడుదలైంది. యువరత్న బాలకృష్ణ చేతుల మీదుగా ఈ టీజర్ రిలీజ్ చేశారు.

Webdunia
శనివారం, 27 జనవరి 2018 (17:19 IST)
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం "ఇంటిలిజెంట్". ఈ చిత్రం టీజర్ శనివారం విడుదలైంది. యువరత్న బాలకృష్ణ చేతుల మీదుగా ఈ టీజర్ రిలీజ్ చేశారు. "ఖైదీ నంబర్ 150" చిత్రం తర్వాత వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ ఇంటిలిజెంట్‌ మూవీకి సి. కల్యాణ్ నిర్మాత. 
 
ఇటీవల బాలయ్య ప్రధాన పాత్రలో విడుదలైన 'జై సింహా' చిత్రానికి కూడా కళ్యాణ్ నిర్మాతగా ఉన్నారు. ఈ కనెక్షన్ తోనే 'ఇంటిలిజెంట్' చిత్ర టీజర్ బాలయ్యతో విడుదల చేయించారు. ఇటీవల 'ఇంటిలిజెంట్' చిత్ర ఫస్ట్ లుక్ విడుదల కాగా, ఇందులో సగం మొహాన్ని ఇంటిలిజెంట్ అనే అక్షరాలతో కవర్ చేసేసి.. కాస్త మ్యాట్రిక్స్ తరహా ఫీల్ తెచ్చేందుకు ప్రయత్నించారు. 
 
ఫిబ్రవరి 9న విడుదల కానున్న ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సాయిధరమ్ సరసన లావణ్య త్రిపాఠి కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులోని డైలాగ్స్ అదుర్స్ అనిపిస్తున్నాయి. ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ ధర్మాభాయ్‌ (డాన్)గా నటించినట్టు తెలుస్తోంది. పెదోడికి ఫ్లాట్‌ఫాం ధర్మాభాయ్ డాట్ కాం అంటూ ఎమోషనల్‌గా చెపుతాడు. కాగా, ఈ మూవీ సక్సెస్ అటు సాయి ధరమ్‌కి, ఇటు వినాయక్, లావణ్య త్రిపాఠిలకు ఎంతో అవసరం. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments