Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుకుమార్ రైటింగ్స్ సెల్ఫిష్ నుంచి చైత్ర గా ఇవానా పరిచయం

Webdunia
సోమవారం, 24 ఏప్రియల్ 2023 (11:44 IST)
Ashish Reddy. Ivana
తొలి చిత్రం 'రౌడీ బాయ్స్'తో ఆకట్టుకున్న యంగ్ హీరో ఆశిష్ రెడ్డి, నూతన దర్శకుడు కాశీ విశాల్ దర్శకత్వంలో సుకుమార్ రైటింగ్స్ , ప్రముఖ నిర్మాత దిల్ రాజు, శిరీష్ ల శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తున్న యూత్ ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్ ‘సెల్ఫిష్’ తో వస్తున్నాడు. సెల్ఫిష్ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.
 
ఇందులో ఆశిష్ మాస్ క్యారెక్టర్‌లో నటిస్తున్నాడు. గతంలో విడుదల చేసిన పోస్టర్‌లలో రెక్లెస్ యాటిట్యుడ్ చూపించాడు. ఇప్పుడు ఈ చిత్రంలో కథానాయిక నటిస్తున్నా ఇవానా ను చైత్ర పాత్రలో పరిచయం చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ ఇవానా ఎదో ఆందోళనలో వున్నట్లుగా కనిపించగా.. ఆశిష్ ఆమెని తదేకంగా చూస్తునట్లుగా కనిపించారు.
 
ఐడీ కార్డ్ సూచించినట్లుగా ఇవానా ఇందులో ఫైనాన్సియల్ ఎనలిస్ట్ గా కనిపిస్తుంది. పోస్టర్‌లో ఇవానా సింపుల్‌గా కనిపించింది. ఆశిష్ గిరజాల జుట్టు, గడ్డంతో మోడిష్‌గా కనిపిస్తున్నాడు.
 
రిజర్వడ్ ఫర్ మై లవ్ అనే గూగుల్ సెర్చ్ స్పేష్ కనిపిస్తోంది. ఈ కథ హైదరాబాద్‌లోని పాతబస్తీలో జరుగుతుంది. ఆశిష్ సెల్ఫిష్ ఓల్డ్ సిటీ వ్యక్తిగా కనిపిస్తాడు. అతను జీవితంలోని తీపిని మాత్రమే కోరుకునే వ్యక్తి.  
 
హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి, అశోక్ బండ్రెడ్డి ఈ చిత్రానికి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా, ఎస్ మణికంధన్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి చంద్రబోస్ లిరిక్ రైటర్‌. ప్రవీణ్ పూడి ఎడిటర్, కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నాటక మాజీ డీజీపీ అనుమానాస్పద మృతి - ఇంట్లో విగతజీవుడుగా...

పుష్ప మూవీలోని 'సూసేకీ' పాట హిందీ వెర్షన్‌‍కు కేజ్రీవాల్ దంపతుల నృత్యం (Video)

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి - చెవి కమ్మలు నొక్కేసిన ఆస్పత్రి వార్డు బాయ్ (Video)

తిరుమల ఘాట్ రోడ్డులో దగ్దమైన కారు.. ప్రయాణికులు తప్పిన ప్రాణగండం!! (Video)

కాబోయే భర్త ఎలా ఉండాలంటే.. ఓ యువతి కోరికల చిట్టా .. సోషల్ మీడియాలో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments