Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరులో "గ్యాంగ్స్ ఆఫ్ గుంటూర్ టాకీస్" ఇంట్రడక్షన్ ఈవెంట్

Webdunia
శనివారం, 25 జులై 2015 (18:20 IST)
నేషనల్ అవార్డ్ గ్రహీత ప్రవీణ్ సత్తారు తాజాగా రూపొందిస్తున్న "గుంటూర్ టాకీస్"లోని గ్యాంగ్స్‌ను.. విజయవాడ - గుంటూరు సమీపంలో గల "హాయ్ ల్యాండ్"లో ఆగస్టు 2వ తేదీన, ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా అత్యంత ఘనంగా నిర్వహించే పబ్లిక్ ఈవెంట్‌లో ఇంట్రడ్యూస్ చేయనున్నారు. సిద్ధు, రేష్మిగౌతం, శ్రద్ధదాస్, నరేష్ విజయ్ కృష్ణ, మహేష్ మంజ్రేకర్, రాజా రవీంద్ర, స్నిగ్ధ, తాగుబోతు రమేష్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్.కె.స్టూడియోస్ పతాకంపై రాజ్ కుమార్.ఎం నిర్మిస్తున్నారు.
 
 
ఇటీవలే డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం రీ-రికార్డింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రం ప్రోగ్రెస్‌పై నిర్మాత రాజ్ కుమార్.ఎం మాట్లాడుతూ... "ప్రవీణ్ సత్తారు ఎంతో ప్రతిష్టాత్మకంగా, అత్యంత ప్రణాళికబద్ధంగా "గుంటూర్ టాకీస్" చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఆగస్టు 2న విజయవాడ - గుంటూర్ మధ్యవున్న "హాయ్ ల్యాండ్"లో ఐదు వేల స్టూడెంట్స్ సమక్షంలో ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా "గ్యాంగ్స్ ఆఫ్ గుంటూర్ టాకీస్"ను ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. దర్శకుడిగా ప్రవీణ్ సత్తారును మరో మెట్టు ఎక్కించే "గుంటూర్ టాకీస్" నిర్మిస్తున్నందుకు గర్వపడుతున్నాను" అన్నారు. 
 
కాగా, ఈ చిత్రానికి నృత్యాలు: గణేష్ మాస్టర్, సంగీతం: శ్రీచరణ్ పాకాల, చాయాగ్రహణం: రామ్ రెడ్డి, కూర్పు: ధర్మేంద్ర కాకరాల, నిర్మాణం: ఆర్.కె.స్టూడియోస్, నిర్మాత: రాజ్ కుమార్.ఎం, రచన-దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments