Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోపాల్ బోడేపల్లి ‘హంగర్’కు అంతర్జాతీయ గుర్తింపు

డీవీ
శుక్రవారం, 12 జులై 2024 (18:52 IST)
కొందరు సినిమాని డబ్బుల కోసం తీస్తారు.. ఇంకొందరు అవార్డుల కోసం తీస్తుంటారు.. మరికొందరు ప్యాషన్ ‌కోసం సినిమాలు చేస్తుంటారు. అలా సినిమాల మీద ఇష్టం, ప్యాషన్‌తో చేసే వారికి అవార్డులు, రివార్డులు వస్తుంటాయి. ఈక్రమంలోనే న్యూయార్క్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా చేస్తున్న గోపాల్ బోడేపల్లి తన ప్యాషన్‌తో తీస్తున్న చిత్రాలకు ప్రపంచ వ్యాప్తంగా పేరు వస్తోంది.
 
గోపాల్ బోడేపల్లి నిర్మిస్తూ, దర్శకత్వం వహించిన హంగర్ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు వస్తున్నాయి. ఇంటర్నేషనల్ న్యూయార్క్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో హానరబుల్ మెన్షన్ అవార్డుని గెల్చుకుంది. అంతే కాకుండా ఈ చిత్రం ప్యారిస్, లండన్ ఉత్సవాలతో పాటు మరో 10 అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో అవార్డులను గెల్చుకుంది. 
 
ఇతని డైరెక్షన్‌లో ఇంతకు ముందు వచ్చిన ‘మరణం’ షార్ట్ ఫిల్మ్ కూడా 34 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో అవార్డు గెల్చుకుంది. ఇక ఈ రెండు చిత్రాలు దాదా సాహెబ్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో అఫీషియల్ సెలక్షన్‌కి ఎంపిక అయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments