Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసక్తికరంగా ధనుష్ నేనే వస్తున్నా ట్రైలర్ (video)

Webdunia
శుక్రవారం, 16 సెప్టెంబరు 2022 (06:54 IST)
nene vastunna poster
తమిళ్ స్టార్‌ హీరో ధనుష్‌ నటించిన లేటెస్ట్‌ మూవీ 'నానే వరువెన్'. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ మూవీకి సెల్వ రాఘవన్‌ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే 'నానే వరువెన్' నుంచి రిలీజైన పోస్టర్లు, పాటలు సినిమాపై మంచి అంచనాలను నెలకొల్పాయి. తాజాగా ఈ చిత్రం టీజర్ ను రిలీజ్ చేసింది చిత్రబృందం.
 
రిలీజ్ చేసిన టీజర్ లో ధనుష్ డ్యూయల్ రోల్ లో కనిపిస్తున్నారు.ట్రైలర్ మొదటి నుండి ఆద్యంతం వరకు ఆసక్తికరంగా ఉంది.క్లాస్ రోల్ లోను, అలానే రస్టిక్ లుక్ లోను ధనుష్ ను ఈ టీజర్ లో చూడొచ్చు.యువన్ శంకర్ రాజా అందించిన బాక్గ్రౌండ్ స్కోర్ థ్రిల్లింగ్ గా ఉంది.“కాదల్ కొండేన్”, “పుదుపేట్టై”, “మయక్కం ఎన్న” తర్వాత ధనుష్ మరియు సెల్వరాఘవన్ కలయికలో వస్తున్న నాల్గవ చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమాను తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై అల్లుఅర‌వింద్ విడుద‌ల చేస్తున్నారు.
 
ఈ చిత్రంలో ధనుష్ తో పాటు యోగి బాబు, ఇందుజా రవిచంద్రన్ మరియు ఎల్లి అవ్రామ్ కూడా ఈ చిత్రంలో నటించారు. కలై పులి ఎస్ థాను తను నిర్మిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.
 
నటీనటులు:
ధనుష్, ఎల్లి అవ్రామ్, ఇందుజా రవిచంద్రన్, యోగిబాబు
 
టెక్నికల్ టీమ్:
కథ: సెల్వరాఘవన్, ధనుష్ 
దర్శకుడు: సెల్వ రాఘవన్ 
నిర్మాత: కలై పులి ఎస్ థాను
సినిమాటోగ్రఫీ: ఓం ప్రకాష్ 
సంగీతం: యువన్ శంకర్ రాజా 
ఎడిటింగ్: భువన్ శ్రీనివాసన్
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీమ, నెల్లూరు, అనంతపై బాబు కన్ను- టీడీపీ సభ్యత్వ డ్రైవ్‌లోనూ అదే ఊపు..

క్షమించరాని తప్పు చేసావు అన్నయ్యా...? ఆత్మాభిమానం ఉండొచ్చు.. ఆత్మహత్య?

బీజేపీ పట్ల పవన్ కల్యాణ్ మెతక వైఖరి ఎందుకు?

ముంబై నటి కాదంబరి జెత్వాని కేసు.. విచారణ ఏమైంది?

2,200 ఎకరాల్లో కేవలం 20 మంది పోలీసులే.. నాదెండ్ల మనోహర్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments