Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాహో గురించి ఇంట్ర‌స్టింగ్ న్యూస్..! ఏంటది?

Webdunia
సోమవారం, 17 జూన్ 2019 (15:43 IST)
‘బాహుబలి’ 1, 2 తరువాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెబెల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న, మూడు భాషల్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం ‘సాహో. ఈ మధ్యే విడుదలైన టీజర్ రికార్డు వ్యూస్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ విషయాన్ని చిత్ర నిర్మాతలు ప్రకటించారు. ఈ భారీ చిత్రానికి స్టార్ మ్యూజిక్ కంపోజర్ జిబ్రాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. రన్ రాజా రన్, విశ్వరూపం, జిల్ వంటి చిత్రాలతో మ్యూజిక్‌లో స్పెషల్ ట్రెండ్ సృష్టించాడు జిబ్రాన్. సాహో చాప్టర్ 2కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించింది కూడా జిబ్రానే.
 
రన్ రాజా రన్ వంటి సూపర్ హిట్ చిత్రం చేసినప్పుడు దర్శకుడు సుజిత్‌తో వర్క్ పరంగా జిబ్రాన్‌కు మంచి అనుబంధం ఏర్పడింది. సాహో భారీ ప్రాజెక్ట్ కావడంతో టాలెంటెడ్ జిబ్రాన్‌ని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేసేందుకు ఎంపిక చేసుకున్నామని దర్శక నిర్మాతలు అన్నారు. ఈ చిత్రం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రత్యేకంగా ఉండనుంది. ప్రతీ సీన్‌ని ఎలివేట్ చేసే విధంగా వరల్డ్ క్లాస్ క్వాలిటీ రీ-రికార్డింగ్ అందించనున్నారు జిబ్రాన్. ఇక ఈ సాహో చిత్రం ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగ‌స్ట్ 15 న ప్ర‌పంచ‌వ్యాప్తంగా బిగ్గెస్ట్ ఫిల్మ్ ఆఫ్ ద ఇయ‌ర్‌గా విడుద‌ల కానుంది.
 
యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ-ప్రమోద్ ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్‌తో ఏక కాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైజాగ్: ప్రియుడు తనను కాదని మరో పెళ్లి చేసుకున్నాడని బైకుని తగలబెట్టిన ప్రియురాలు

వివాహితతో సహజీవనం, ఆమె కొడుకు చేతిలో హత్యకు గురైన వ్యక్తి, కారణం ఇదే

దంతెవాడ జిల్లాలో మావోయిస్ట్ రేణుక మృతి.. ఐదు లక్షల రివార్డు

ప్రధానమంత్రి మోడీ ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారీ!

దాహం అంటే నోట్లో మూత్రం పోసి యువతిపై 8 మంది సామూహిక అత్యాచారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments