బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

దేవీ
బుధవారం, 20 ఆగస్టు 2025 (16:12 IST)
Tummalapalli Rama Satyanarayana
సినిమా నిర్మాతల్లో మూడు రకాలున్నారనీ, అందులో మూడో నిర్మాతలైన బుల్లి నిర్మాతల గురించి సినీ పెద్దలు ఆలోచించాలని వారి తరఫున రామ సత్యనారాయణ అంటున్నారు. ఆగస్టు 15వ తేదీన ఏకంగా 15 సినిమాలకు శ్రీకారం చుట్టిన ఈయన గిన్నిస్ బుక్ కోసం ప్రయత్నాలు చేశారు. గతంలో పలు సినిమాలను నిర్మించారు. ఆయన ఈ విధంగా తెలియజేస్తున్నారు.
 
పెద్ద సినిమా లు గురించి మాట్లాడటానికి పెద్ద నిర్మాతలు వున్నారు. చిన్న సినిమాలు గురించి మాట్లాడటానికి రైజింగ్ ప్రొడ్యూసర్స్ వున్నారు. ఇక బుల్లి సినిమాలు గురించి మాట్లాడటానికి ఎవరో ఒకరు ముందుకు రావాలి. అసలు ఈ బుల్లి (కోటి రూపాయలు) బడ్జెట్ సినిమాలు గురించి ఏ విధమైన కండిషన్స్ పెట్టవద్దు, ఎవరికి నచ్చిన టెక్నిషియన్స్ తో వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకుని షూటింగ్స్ చేసుకుంటారు,
 
 కాదు అని ఈ బుల్లి నిర్మాతలు ని ఇబ్బంది పెడితే వేరే భాషల్లో షూటింగ్ జరుపుకుంటారు. కన్నడ లో ఫెడరేషన్ రేట్స్ తక్కువ, అక్కడ సిన్సియర్ గా సినిమాలు తీస్తే 10 లక్షలు సబ్సిడీ ఉంది, లేదా మధ్య ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లాంటి చోట్ల షూటింగ్ చేస్తే 25 to 35 % సబ్సిడీ ఉంది. అది కాకుండా ఇప్పుడుపూర్తిగా AI లో, (కాంపెగౌడ్).లాంటి సినిమాలు కూడా వచ్చేశాయి.
 
 పూర్తిగా ANAMATION లో (మహా నరసింహ సూపర్ హిట్ సినిమా) లాంటి సినిమాలు  వస్తున్నాయి. అప్పుడు ఏ టెక్నిషియన్స్ తో పనిలేదు. బుల్లి సినిమాలకి ఉండే వర్కర్స్ రేట్లు సగం రేట్స్ ఉండాలి అని కూడా పెట్టండి. టీవీ యూనిట్స్ కి ఉన్న టైమింగ్ మార్నింగ్ 7 టు నైట్ 9  ఉండాలి. ప్రజెంట్ ఇప్పుడు వాడుకున్న రేట్లున్న అప్లికేబుల్ కావాలి. 
 
మన బుల్లి సినిమాలు బతికితే ప్రతి సం. రం కొత్తగా 100 మంది నిర్మాతలు, దర్శకులు వస్తున్నారు.. యంగ్ టాలెంట్ కీ పని దొరుకుతాది.. కొత్త కొత్త ఐడియా లు దర్శకులు వస్తారు అంటూ ఆయన పేర్కొన్నారు. మరి ఈయన మాట వినేవారున్నారోలేదో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెద్దిరెడ్డి కుటుంబం 32.63 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించుకుంది

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు: ప్రశాంత్ కిషోర్ జన్ సూరజ్ పార్టీపై ఎగ్జిట్స్ పోల్స్ ఏం చెప్తున్నాయ్!

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌ ఓట్ల లెక్కింపు: 34 కీలక కేంద్రాల్లో 60శాతం ఓట్లు.. గెలుపు ఎవరికి?

హైదరాబాద్ ఐటీ కారిడార్లలో మోనో రైలు.. రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు.. పది రౌండ్లలో ఓట్ల లెక్కింపు.. 8 గంటలకు ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

తర్వాతి కథనం
Show comments