'లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా'లో ఏముంది... సెన్సార్ ప్రాబ్లమ్స్...
శ్రీ వాస్తవ దర్శకత్వంలో కొంక్కనా సేన్ శర్మ, రత్న పటాక్, అహాన కుమ్రా, సుశాంత్ సింగ్, వైభవ్ తాట్ వాడి.. తదితరులు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన బాలీవుడ్ చిత్రం 'లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా'. ఈ చిత్రం షూటిం
శ్రీ వాస్తవ దర్శకత్వంలో కొంక్కనా సేన్ శర్మ, రత్న పటాక్, అహాన కుమ్రా, సుశాంత్ సింగ్, వైభవ్ తాట్ వాడి.. తదితరులు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన బాలీవుడ్ చిత్రం 'లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా'. ఈ చిత్రం షూటింగ్‌తో పాటు.. ఇతర కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని సెన్సార్‌కు వెళ్లింది. అయితే, సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి అనుమతి ఇచ్చేందుకు నిరాకరించారు.
ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ నుంచి వివాదాలకి కేరాఫ్ అడ్రస్‌గా మారడమే ఇందుకు నిదర్శనం. ఇప్పుడు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్‌ని నిరాకరించడంతో మరోసారి హెడ్‌లైన్స్‌లోకి వచ్చింది. దీంతో చిత్ర యూనిట్‌కు మరోమార్గం లేక సెన్సార్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాల్సి వచ్చింది. చిత్రబృందం వాదనలను ఆలకించిన ట్రిబ్యునల్ 'లిప్ స్టిక్ అండర్ మై బుర్ఖా' సినిమాకి 'ఎ' సర్టిఫికెట్ ని జారీ చేయాల్సిందిగా ఆదేశించింది.
మొత్తంమీద సెన్సార్ కమిటీ కొన్ని చిత్రాల విషయంలో అనుసరిస్తున్న వైఖరి ఆయా చిత్రాలకు ఉచిత పబ్లిసిటీ బాగానే లభిస్తోంది. ఈ కోవలో 'లిప్ స్టిక్ అండర్ మై బుర్ఖా' సినిమాకి కూడా ఫ్రీ ప్రచారం జరిగింది. ఈ చిత్రంలో ఘాటు సీన్లతో పాటు.. హాట్ హాట్ సన్నివేశాలు కూడా ఉన్నట్టు సమాచారం.