Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిజం చెప్పాలంటే ప్రస్తుతానికి ఆ స్థానమే ఖాళీగా వుంది- దర్శకుడు అనిల్ రావిపూడి

Webdunia
బుధవారం, 25 మే 2022 (17:31 IST)
Anil Ravipudi
''తెలుగు ప్రేక్షకులు హాయిగా నవ్వుకోవడానికి ఒక లైబ్రరీ లాంటి సిరిస్ వుండాలని ఎఫ్ 2 ఫ్రాంచైజ్ ని చేశాం. ఎఫ్ 2 బిగ్ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఎఫ్ 2లో భార్యభర్తల ఫస్ట్రేషన్ వుంటే ఎఫ్ 3లో మనీ ఫస్ట్రేషన్. ఎఫ్ 3 అందరికీ కనెక్ట్ అయ్యే కథ. ఎఫ్2కి మించిన వినోదాన్ని ఎఫ్3లో చూస్తారు. ఇది ఫ్యామిలీ అంతా కలసి చూడాల్సిన సినిమా. అందుకే టికెట్ ధర అందరికీ అందుబాటులో వుండే విధంగా ప్రభుత్వం నిర్ణయించిన ధరకే టికెట్ రేట్లు ఉండేలా మా నిర్మాత దిల్ రాజుగారు నిర్ణయం తీసుకున్నారు. ఎఫ్ 3కి ఖచ్చితంగా రిపీట్ ఆడియన్స్ వస్తారు'' అన్నారు బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి.
 
ఇంతమంది ఆర్టిస్ట్ లు వుండగా వెంకటేష్ గారి పాత్రని రేచీకటిగా వరుణ్ తేజ్ పాత్రని నత్తిగా డిజైన్ చేయడానికి కారణం ?
ఎఫ్ 2 నుండి ఎఫ్ 3కి వచ్చేసరికి అంచనాలు ఖచ్చితంగా ఎక్కువగా వుంటాయి. ఫన్ డోస్ పెంచడానికి ఎలిమెంట్స్ ఎక్కువ వుంటే ఇంకా ఎక్కువ చేయగలం. మామూలు పాత్రతో చేసేకంటే ఇలాంటి పాత్రలతో ఎక్కువ ఫన్ చేయొచ్చనిపించి ఈ క్యారెక్టరైజేషన్స్ యాడ్ చేశాం. ఐతే అవే క్యారెక్టరైజేషన్స్ ప్రధానంగా సినిమా వుండదు. నైట్ సీన్స్ వచ్చినపుడు ఆ ఫన్ వాడుకుంటాం, వరుణ్ నత్తి మీరు ట్రైలర్ లో చూసే వుంటారు. అది కేవలం ట్రైలర్ మాత్రమే. సినిమా దాదాపు ముఫ్ఫై చోట్ల ఆ మేనరిజం వచ్చింది. ప్రతిసారి కొత్తగా వుంటుంది. ఇది నిజంగా చాలెజింగ్ అనిపించింది. మాట అడ్డుపడినప్పుడల్లా కొత్త మ్యానరిజం చేయాలి. అనుకున్నపుడు ఈజీగా అనిపించింది కానీ ప్రాక్టికల్ గా ప్రతిసారి కొత్త మ్యానరిజం అంటే సీన్ కంటే ఎలాంటి మ్యానరిజం ఇవ్వాలనే ఒత్తిడి ఎక్కువ వుండేది.
 
కరోనా పాండమిక్ చుట్టూ విషాదాల మధ్య ఇలాంటి ఫన్ ఎలా రాయగలిగారు ?
స్క్రిప్ట్ అంతా పూర్తయిన తర్వాత కరోనా సెకండ్ వేవ్ వచ్చింది. అందరికీ నష్టం జరిగింది.  తెలియకుండానే అందరిలోనూ నిరాశ. ఐతే షూటింగ్ అయిన సీన్స్ ని మళ్ళీ చూసుకుంటూ కాసేపు నవ్వుకుంటూ ఇప్పుడున్న మెంటల్ కండీషన్ కి ఇలాంటి ఫన్ సినిమా ఉపయోగపడుతుందని భావించాం.
 
ట్రైలర్ లో హీరోయిన్స్ ని అత్యాశగా చూపించారు.. వారి నుండే ఫన్ వస్తుందా ?
హీరోయిన్స్ అనే కాదు ఇందులో ప్రతి పాత్ర అత్యాశ గానే వుంటుంది. డబ్బు ఎలా త్వరగా సంపాయించాలనే ఆశతోనే  వుంటారు. వారి ప్రయత్నాల్లో జరిగే ఫన్ ఇందులో వుంటుంది. ఎంత ఫన్ వుంటుందో అంత మంచి కంటెంట్ వుంటుంది. ఎఫ్ 2లో ఇచ్చిన ముగింపు అందరికీ నచ్చింది. ఇందులో డబ్బు గురించి చెప్పే ఫైనల్ కంటెంట్ కూడా అందరికీ నచ్చుతుంది.
 
ఎఫ్ 3లో మీ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయా ?
ఎఫ్ 2తో పోల్చుకుంటే తక్కువే. ఎఫ్ 3 అంతా డబ్బు చుట్టూ తిరిగే కంటెంట్. ట్రైలర్ లో కనిపించిన బంగారం షాపు సీన్ అందరి లైఫ్ లో ఉండేదే. ఐతే దాన్ని కొంచెం ఫన్ గా చేశాం.
 
దాదాపు అందరూ తెలిసిన నటులనే పెట్టారు. బడ్జెట్ అనుమతించిందా ?
ఇందులో వుండే నటులు ఆ పాత్రలకు వారే కరెక్ట్ అనిపించింది. సునీల్ గారు అంటే నాకు ప్రత్యేక అభిమానం. పదేళ్ళ తర్వాత ఆయన హిలేరియస్ రోల్ చేస్తున్నారు. మళ్ళీ వింటేజ్ సునీల్ ని చూస్తాం. అలీ గారిది కూడా అద్భుతమైన పాత్ర. టెర్రిఫిక్ గా చేశారు.  
 
ఇంత మంది అరిస్ట్ లతో పని చేయడం ఎలా అనిపించింది ?
చాలా కష్టపడ్డాం. కార్వాన్ లన్నీ చూస్తే మినీ మియాపూర్ బస్ డిపోలా వుండేది. ఒక సీన్ లో 70షాట్లు వుంటే ముఫ్ఫై నుండి మొదలుపెట్టెవాడిని. ఎవరు ముందు వస్తే వాళ్ళ షాట్ తీసుకుంటూ వెళ్ళడమే. అన్నపూర్ణ గారు, వై విజయ గారు కొంచెం త్వరగా వస్తారు. వాళ్ళ షాట్స్ ముందే తీసేవాళ్ళం. కరోనా సమయంలో వాళ్ళపై ఎక్కువ కేర్ తీసుకున్నాం. వెంకటేష్ గారు ఇంకా కేరింగ్ వుంటారు. మా టీంలో ఆయన్ని కరోనా టచ్ చేయలేదు.
 
పూజా హెగ్డే తో పాట చేయాలనే ఆలోచన మొదటి నుండి ఉందా ?
పాండమిక్ సెకండ్ వేవ్ తర్వాత పూజా యాడ్ అయింది. ముగ్గురు హీరోయిన్స్ తో 'ఊ హ ఆహా ఆహా' పాటని తీశాం, తర్వాత వచ్చే సెలబ్రేషన్స్ పాట కొంచెం స్పెషల్ గా వుండాలని  ఒక స్టార్ హీరోయిన్ గెస్ట్ గా వస్తే బావుంటుదని భావించాం. కథలోనే పూజ హెగ్డే గా వస్తుంది తను.
 
నత్తి క్యారెక్టర్ కి ప్రేరణ ఉందా ?
ఆహా నా పెళ్ళాంట సినిమాలో బ్రహ్మానందం గారు చేసిన పాత్ర నా ఫేవరేట్. నత్తిని ఒక హీరో పాత్రకి యాడ్ చేయడం కొత్తగా అనిపిస్తుంది.
 
కామెడీ సినిమాలు ఎక్కువగా చేస్తున్నారు.. ఈవీవీ , జంధ్యాల గారి స్థానాన్ని భర్తీ చేయాలనా ?
నిజం చెప్పాలంటే ప్రస్తుతానికి ఆ స్థానమే ఖాళీగా వుంది.  కానీ నేను మాస్ సినిమాలు చేయలానే వచ్చాను. అయితే కామెడీ ఉంటేనే నా సినిమా ఫుల్ ఫిల్ అవుతుంది. పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్ .. ఈ మూడు సినిమాల్లో ఎంత మాస్ వుందో అంత కామెడీ  వర్క్ అవుట్ అయ్యింది. ఇంకా లార్జ్ స్కేల్ ఆడియన్స్ కి రీచ్ కావాలని ఎఫ్ 2 ని ఒక స్ట్రాటజీ ప్రకారం చేశాను. ఎఫ్ 2 ఓవర్సిస్ లో 2 మిలియన్ కొట్టింది. ఎక్కడ ఖాళీ వుందో చూస్తూ సినిమాలు చేయాలి. ఎఫ్ 2తో ఒక కామెడీ బ్రాండ్ వచ్చేసింది. దాన్ని సరిచూసుకోవడానికి సరిలేరు నీకెవ్వరు లో ట్రైన్ ఎపిసోడ్ పెట్టుకున్నాం. సరిలేరు నీకెవ్వరు ఫల్ యాక్షన్ మాస్ సినిమా. ఇప్పుడు ఎఫ్ 3తో మళ్ళీ ఫ్యామిలీ సినిమా చేశాం. తర్వాత చేయబోయే బాలయ్యగారి సినిమా మాస్. సినిమాకి సినిమాకి డిఫరెన్స్ చూపించుకుంటూ వెళితే ఫస్ట్ మనం బోర్ కొట్టం. మార్కెట్ లో ఎలాంటి సినిమాలు కోరుకుంటున్నారనేదాని చెక్ చేసుకున్నట్లయితే ఫ్లాప్ అవ్వాకుండా బయటపడవచ్చు. అది తర్వాత ఎంత హిట్ అవుతుందనేది ఆడియన్స్ నిర్ణయిస్తారు.
 
కామెడీ సినిమా తీయడం కష్టం. కామెడీ పండకపొతే అపహాస్యం పాలవ్వాల్సి వస్తుంది. మీరు ఈ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, ?
 
కంప్లీట్ కామెడీ సినిమా తీస్తే ఈ సమస్య వుంటుంది. నేను చేసిన సినిమాల్లో వినోదం ప్రధానంగా వుంటుంది తప్పితే సినిమా అంతా కామెడీ పెట్టను. ఎఫ్ 2లో కామెడీ బిట్స్ అండ్ పీసస్  గా వెళుతుంటుంది. చివర్లో ఒక బలమైన కంటెంట్ వుంటుంది. ఒక సోల్ వుంటుంది. అది కనెక్ట్ కాకపొతే సినిమా ఆ స్థాయికి వెళ్ళదు. సరిలేరు నీకివ్వరు లో కూడా ఆర్మీ నేపధ్యం ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యింది. ఎమోషనల్ కనెక్షన్ ఉంటేనే సినిమాలు గొప్ప విజయాన్ని సాధిస్తాయి. ఎఫ్ 3లో కూడా ఎంత కామెడీ వుంటుందో అంత కంటెంట్ వుంటుంది.
 
టికెట్ల రేట్లు తగ్గించడం ఎఫ్ 3కి ఎంత కలిసొస్తుంది ?
హైదరాబద్ లో కొన్ని ప్రీమియం మల్టీప్లెక్స్ లో తప్ప మిగతా అన్ని చోట్ల టికెట్ ధరలు అందరికీ అందుబాటులోకే తెచ్చాం. ఇది ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఫ్యామిలీ అంతా కలసి వెళ్ళడానికి వీలుగా వుంటే ఒకటి రెండుసార్లు చూస్తారు. నిజానికి ఎఫ్ 3కి కూడా ఎక్కువ బడ్జెట్ అయ్యింది. అయితే టికెట్ ధర ఆడియన్స్ కి కంఫర్ట్ గా వుండటం ముఖ్యం. ఇది ఫ్యామిలీ అంతా కలసి చూడాల్సిన సినిమా. అందుకే టికెట్ ధర అందరికీ అందుబాటులో వుండే విధంగా ప్రభుత్వం నిర్ణయించిన ధరకే టికెట్ రేట్లు ఉండేలా మా నిర్మాత దిల్ రాజుగారు నిర్ణయం తీసుకున్నారు.
 
బేసిగ్గా  హీరోలు ఇమేజ్ ని వదిలిపెట్టి ఇలాంటి పాత్రలు చేయడానికి ఇష్టపడరు.. మీరు చెప్పినపుడు ఎలా ఫీలయ్యారు?
కొన్ని సినిమాలు చేయడానికి  ఇమేజ్ దాటి రావాలి. బాలీవుడ్ లో అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్ లాంటి హీరోలు స్టార్ డమ్ పక్కన పెట్టి ఎంటర్ టైనర్లు చేస్తుంటారు. లక్కీగా వెంకటేష్ గారు నాకు దొరికారు.  ఆయన బోర్డర్ దాటి కూడా కొన్ని సీన్లు చేసేస్తారు. కామెడీ సినిమా చేసేటప్పుడు అలానే వుండాలి. ఈ పాత్రలు చెప్పినపుడు వెంకటేష్, వరుణ్ తేజ్ చాలా ఎక్సయిట్ అయ్యారు. వెంకటేష్ గారి రేచీకటి ట్రాక్ చాలా బావుంటుంది.
 
దేవిశ్రీ ప్రసాద్ గారి తో మళ్ళీ పనిచేయడం ఎలా అనిపించింది ?
దేవిశ్రీ ప్రసాద్ గారితో ఇది నా మూడో సినిమా. మంచి ఆల్బమ్ ఇచ్చారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా వండర్ ఫుల్ గా వచ్చింది.
 
రిటైర్మెంట్ స్టేజ్ లో అన్నపూర్ణ, వై విజయ గారికి మంచి పాత్రలు పడ్డాయి కదా ?
అవును. చాలా బాగా చేశారు. చాలా క్రమశిక్షణ గల నటులు. ఇంత క్రమశిక్షణ గల నటులని నేను చూడలేదు. చెప్పిన టైంకి  సెట్స్ లో వుంటారు. బహుశా ఆ జనరేషన్ అంతా అంతే.
 
బాలయ్యగారి సినిమా ఎప్పుడు .. ఎలా వుండబోతుంది ?
సెప్టెంబర్- అక్టోబర్ లో సెట్స్ పైకి వెళ్తాం. షైన్ స్క్రీన్స్ బ్యానర్ నిర్మాణం. బాలకృష్ణ గారు ఎంత పవర్ ఫుల్ గా ఉంటారో ఆ పవర్ కి తగ్గట్టే  సినిమా వుంటుంది. ఫన్ వుంటుంది కానీ అంత బిగ్గర్ గా వుండదు. మేము ఇద్దరం కలసి కొత్త మార్క్ లోకి వస్తాం.
 
మీకు ఇష్టమైన హీరో ?
అందరు హీరోలూ ఇష్టం. రాజేంద్ర ప్రసాద్ గారు ఇంకా కొంచెం ఎక్కువ ఇష్టం.
 
రాజేంద్ర ప్రసాద్ గారితో చేసిన గాలి సంపత్ రిజల్ట్ నిరాశ పరిచిందా ?
నా స్నేహితుడు సాయి, రాజేంద్ర ప్రసాద్ కోసం నిలబడి చేసిన సినిమా అది. ఫలితం మాట పక్కన పెడితే నా స్నేహితుల కోసం చేసిన సినిమా అనే తృప్తి వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో కొత్త టెక్స్‌టైల్ పాలసీ.. రూ.10 వేల కోట్ల పెట్టుబడులు

అది యేడాది క్రితం పోస్టు.. ఈ కేసులో అంత తొందరెందుకో : ఆర్జీవీ ప్రశ్న

16 యేళ్లలోపు పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాల్సిందే...

ఢిల్లీలో పవన్ కళ్యాణ్ 'తుఫాన్' - నేడు ప్రధాని మోడీతో భేటీ!!

EVM లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, మీరు గెలిస్తే ట్యాంపరింగ్ కాదా అంటూ ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments