Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ్‌చ‌ర‌ణ్ పాన్ మూవీ గేమ్ చేంజర్ కు ఐమ్యాక్స్‌ గ్రీన్ సిగ్నల్

డీవీ
శుక్రవారం, 3 జనవరి 2025 (15:01 IST)
Gamchanger new poster
ఇటీవలే ఐమాక్స్ లో పుష్ప 2 సినిమా ఐమాక్స్ విడుదలకాకపోవడం తెలిసిందే. నిర్మాతకు, థియేటర్ యాజమాన్యానికి పర్సెంటేజీ విషయంలో వ్యత్యాసం రావడంతో సినిమా ప్రదర్శనకు నోచుకోలేదు. అయితే గేమ్ ఛేంజర్ కు ఆ అడ్డంకి లేదు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత ప్రకటనలో తెలియజేశారు. శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందిన గేమ్ చేంజర్’ ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ప్రేక్ష‌కుల‌ను జ‌న‌వ‌రి 10 నుంచి ఈ పొలిటిక‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ అల‌రించ‌నున్న సంగ‌తి తెలిసిందే. 
 
అభిమానులు, ప్రేక్ష‌కులు రామ్ చ‌ర‌ణ్‌ను ఎప్పుడెప్పుడు సిల్వ‌ర్ స్క్రీన్‌పై చూసి ఎంజాయ్ చేద్దామా అని ఎదురుచూస్తున్నారు. సినిమాపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. ఇలాంటి లార్జ‌ర్‌దేన్ లైఫ్ వంటి ఈ సినిమాను లార్జ‌ర్ స్క్రీన్‌లో చూస్తే క‌లిగే అనుభూతే మ‌రో రేంజ్‌లో ఉంటుంద‌న‌టంలో సందేహం లేదు. అందులో భాగంగా ప్రేక్ష‌కుల‌ను ఓ స‌రికొత్త అనుభ‌వాన్ని అందించ‌టానికి ఐమ్యాక్స్‌లో రిలీజ్ చేయ‌నున్నారు మేకర్స్‌. 
 
పొలిటిక‌ల్ యాక్ష‌న్ డ్రామాగా రూపొందిన రామ్ చ‌ర‌ణ్ ‘గేమ్ చేంజ‌ర్‌’ను అత్యాధునిక సాంకేతిక ప‌రిజ్ఞానంతో అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయేలా డైరెక్టర్ శంకర్ తెరకెక్కించారు. శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ పాన్ ఇండియా మూవీ ఆడియెన్స్‌ను సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్‌గా మెప్పింస్తుంద‌న‌టంలో ఎలాంటి సందేహం అక్క‌ర్లేదు. రామ్ చ‌ర‌ణ్ ఇందులో ద్విపాత్రాభిన‌యం చేశారు. కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రంలో అంజ‌లి కీల‌క పాత్ర‌లో న‌టించారు. ఎస్‌.జె.సూర్య‌, ప్ర‌కాష్ రాజ్‌, శ్రీకాంత్ త‌దిత‌రులు ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో అల‌రించ‌నున్నారు. 
 
గేమ్ చేంజ‌ర్ చిత్రాన్ని సిల్వ‌ర్ స్క్రీన్‌పై వీక్షించ‌టానికి అభిమానులు స‌హా అంద‌రూ ఎంతో ఉత్కంఠ‌త‌తో ఎదురుచూస్తున్నారు. వావ్ అనిపించే విజువ‌ల్స్‌, అద్భుత‌మైన యాక్ష‌న్ స‌న్నివేశాలతో ప‌క్కాగా రూపొందిన ఈ చిత్రం మ‌న‌దేశంతో పాటు అంత‌ర్జాతీయంగా ఐమ్యాక్స్ థియేట‌ర్స్‌లో క‌రెక్ట్‌గా సూట్ అవుతాయి. ప్రేక్ష‌కుల‌ను ఓ స‌రికొత్త ప్ర‌పంచంలోకి ఈ సినిమా తీసుకెళుతుంద‌ని అంద‌రూ భావిస్తున్నారు. దీంతో ఎంటైర్ టీమ్ సినిమాను ఐమ్యాక్స్‌లో రిలీజ్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. 
 
ఈ సంద‌ర్భంగా మూవీ మేక‌ర్ శంక‌ర్ మాట్లాడుతూ ‘‘చ‌క్క‌టి క‌థ‌, సాంకేతిక‌త‌తో హ‌ద్దుల‌ను దాటేలా సినిమాను రూపొందిస్తే మ‌నం ఏం చేయ‌గ‌ల‌మ‌నే విష‌యం గేమ్ చేంజ‌ర్ సినిమాతో తెలుస్తుంది. ఐమ్యాక్స్‌లో గేమ్ చేంజ‌ర్ సినిమా ప్ర‌ద‌ర్శితం కానుంద‌ని తెలిసి నాకెంతో ఆనంద‌మేసింది. సినిమాను విజువ‌ల్ వండ‌ర్‌గా, భారీద‌నంతో రూపొందించాం. దాన్ని ప్రేక్ష‌కులు థియేట‌ర్స్‌లో చూసి త‌ప్ప‌కుండా ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు. 
 
రామ్ చ‌ర‌ణ్ మాట్లాడుతూ ‘‘‘గేమ్ చేంజ‌ర్‌’ మూవీ నా హృద‌యానికెంతో ద‌గ్గ‌రైన చిత్రం. శంక‌ర్‌గారితో క‌లిసి ఈ సినిమా కోసం ప‌ని చేయ‌టం మ‌ర‌చిపోలేని అనుభూతినిచ్చింది. ఈ సినిమాను ఇప్పుడు ప్రేక్ష‌కులు ఐమ్యాక్స్‌లో చూసి ఎంజాయ్ చేస్తార‌ని తెలియ‌టంతో నాకు చాలా ఎగ్జ‌యిటింగ్‌గా అనిపిస్తోంది’’ అన్నారు. మ్యూజిక్ సెన్సేష‌న్ ఎస్‌.త‌మ‌న్ సంగీత సార‌థ్యం వ‌హించిన ఈ భారీ యాక్ష‌న్ డ్రామా పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ ప్రేక్ష‌కుల‌కు ఓ మ‌ర‌చిపోలేని అనుభూతినిస్తుంద‌న‌టంలో సందేహం లేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భూ వివాదం పరిష్కరించమని అడిగితే ప్రైవేట్ గదికి తీసుకెళ్లి మహిళపై అనుచితంగా పోలీసు అధికారి

Madhavi Latha: మాధవి లత వేస్ట్ క్యాండిడేట్.. జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్

రైలు పట్టాలపై కూర్చొని పబ్ జీ ఆడిన ముగ్గురు మృతి.. ఎక్కడంటే?

చాలా చాలా చిన్న కారణం, తనకు విషెస్ చెప్పలేదని ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ విద్యార్థిని

Amaravati: అమరావతి కోసం ప్రపంచ బ్యాంకు, HUDCO సాయం.. ఏపీ సర్కారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కోడి గుడ్లు, పాలు ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

అతి నిద్రతో అనారోగ్య సమస్యలు, ఏంటవి?

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

తర్వాతి కథనం
Show comments