Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండోసారి తల్లి అయిన గోవా బ్యూటీ...

ఠాగూర్
శనివారం, 28 జూన్ 2025 (08:50 IST)
గోవా బ్యూటీ ఇలియానా రెండోసారి తల్లి అయింది. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తన కుమారుడుకు కియానా రాఫె డోలన్ అనే పేరు పెట్టింది. ఈ నెల 19వ తేదీన మగబిడ్డకు జన్మనిచ్చినట్టు ఇలియానా చెప్పింది. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆమె తన అభిమానులతు ఈ శుభవార్తను పంచుకున్నారు. తన కుటుంబంలోకి వచ్చిన కొత్త సభ్యుడిని పరిచయం చేస్తూ ఆమె పెట్టిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అయింది. 
 
ఇలియానా తన ప్రియుడు మైఖేల్ డోలన్‌ను 2023 మే నెలలో వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. ఈ జంటకు 2023 ఆగస్టులో మొదటి కుమారుడు కోవా ఫీనిక్స్ డోలన్ జన్మించాడు. ఇపుడు దాదాపు రెండేళ్ల తర్వాత వారి కుటుంబంలో మరో చిన్నారి అడుగుపెట్టాడు. అసక్తికరమైన విషయమేమిటంటే ఇలియానా తన రెండో గర్భం విషయాన్ని చాలా గోప్యంగా ఉంచారు. 
 
మొదటి ప్రెగ్నెన్సీ సమయంలో బీబే బంప్ ఫోటోలను తరచుగా పంచుకున్న ఆమె ఈ సారి మాత్రం అలా చేయలేదు. కేవలం గత మే నెలలో బంప్ బడ్డిస్ అనే క్యాప్షన్‌తో తన బీబీ బంప్ ఫోటోను ఒక్కసారి మాత్రమే షేర్ చేసి గర్భవతి అనే విషయాన్ని సూచనప్రాయంగా తెలిపారు. ఆ తర్వాత నేరుగా బిడ్డ పుట్టిన శుభవార్తతోనే అభిమానులను ముందుకు వచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pen Cap in Lung: ఊపిరితిత్తుల్లో పెన్ క్యాప్.. 26 ఏళ్ల తర్వాత తొలగించిన వైద్యులు.. ఎక్కడ?

కర్ణాటకలో పరువు హత్య.. పూజారినే పెళ్లి చేసుకుంటానన్న కుమార్తెను చంపేసిన తండ్రి

Delivery Boy: డెలివరీ పర్సన్‌‌తో సహజీవనం చేసిన మైనర్ బాలిక.. తర్వాత ఏమైందంటే?

Raja Singh: నేను స్వతంత్ర ఎమ్మెల్యే... స్వేచ్ఛగా మాట్లాడగలను.. రాజా సింగ్

తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన హరీష్ రావు - అక్టోబర్ వరకు రిజర్వ్‌లో తీర్పు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

తర్వాతి కథనం