Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి సినిమాకు హోంవర్క్ చేస్తున్నా, నాగార్జునతో హలో బ్రదర్ లాంటి సినిమా చేస్తా : అనిల్ రావిపూడి

డీవీ
బుధవారం, 22 జనవరి 2025 (17:46 IST)
Anil Ravipudi
జంధ్యాల గారి సినిమాలు నాకు చాలా ఇష్టం. హైహై నాయక లో ఒక సౌండ్ ఎఫెక్ట్ తో అది వస్తుంది. అందులో బూతు అనే డైలాగ్ సౌండ్ లో వినిపిస్తుంది. అందుకే ఆ సినిమా స్పూర్తిగా తీసుకుని బుల్లిరాజు పాత్రని డిజైన్ చేశాను. ఓటీటీ నేపధ్యంలో ఎప్పటినుంచో సీన్ చేయాలనుకున్నా. అందుకే సంక్రాంతికి వస్తున్నాంలో బులిరాజు పాత్రతో డిజైన్ చేశాను. అది మహిళలకూ బాగా నచ్చింది. ఇందులో బూతు, జబర్ దస్త్ పోలిక అనేవి ఏవీలేవు అని దర్శకుడు అనిల్ రావిపూడి అన్నారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి జర్నీకి జనవరి 23 తో పదేళ్ళు. ఈ సందర్భంగా విలేకరుల సమవేశంలో ముచ్చటించారు.   
 
'ఈ పదేళ్ళు ప్రతి సినిమా ఒక వండర్ ఫుల్ ఎక్సపీరియన్స్. ప్రతి హీరోతో ఒక అద్భుతమైన రిలేషన్. నేను ఏ జోనర్ సినిమా చేసిన ఆడియన్స్ గొప్పగా సపోర్ట్ చేశారు. ప్రతి సినిమాకి ఒకొక్క మెట్టు ఎక్కిస్తూ ఫైనల్ గా ఈ పొంగల్ కి 'సంక్రాంతికి వస్తున్నాం' తో ఓ అద్భుతమైన విజయం ఇచ్చారు. 'సంక్రాంతికి వస్తున్నాం' విక్టరీ నా కెరీర్ లో ఓ హిస్టరీ' బ్లాక్ బస్టర్.
 
- ఈ పదేళ్ళలో చేసిన ప్రతి సినిమా ఒక ఎక్సపీరియన్స్. నేను ఏ జోనర్ సినిమా చేసిన ఆడియన్స్ గొప్పగా సపోర్ట్ చేశారు. ప్రతి సినిమాకి ఒకొక్క మెట్టు ఎక్కిస్తూ ఫైనల్ గా ఈ పొంగల్ కి 'సంక్రాంతికి వస్తున్నాం'తో అద్భుతమైన విజయం ఇచ్చారు. ప్రేక్షకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ క్రెడిట్ అంతా ఆడియన్స్ కే ఇస్తాను. 'సంక్రాంతికి వస్తున్నాం' మామూలు సక్సెస్ కాదు. ఆరు రోజుల్లో వందకోట్ల షేర్, వన్ వీక్ లో 200 కోట్లు క్రాస్ చేయడం అంటే ఓ అద్భుతం. ఇది నా కెరీర్ లో హిస్టరీ. ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ కి ఈ బలం వుందని ఆడియన్స్ చాలా స్ట్రాంగ్ గా స్టేట్మెంట్ ఇచ్చారని అనిపిస్తోంది.
 
-డైరెక్టర్ కావడం నా డ్రీం. అది 'పటాస్' తో తీరిపోయింది. ఇదంతా బోనస్ గా భావిస్తున్నాను. నాకు లైఫ్ ఇచ్చింది ఆడియన్స్. వారికి పైసా వసూల్ ఎంటర్ టైన్మెంట్ ఇవ్వడమే నా టార్గెట్. అదే చేసుకుంటూ వస్తున్నాను.
 
-ఈ పదేళ్ళు ప్రతి సినిమా ఒక వండర్ ఫుల్ ఎక్సపీరియన్స్. ప్రతి హీరోతో ఒక అద్భుతమైన రిలేషన్. కళ్యాణ్ రామ్ గారు లేకపొతే నా కెరియర్ లేదు. ఆయన ప్రొడ్యూస్ చేసి నన్ను డైరెక్టర్ గా నిలబెట్టారు. ఈ పదేళ్ళ క్రెడిట్ ముందు కళ్యాణ్ రామ్ గారికి ఇస్తాను.  తర్వాత సాయి ధరమ్ తేజ్ గారితో సుప్రీం, రవితేజ గారితో రాజా ది గ్రేట్, వెంకటేష్ గారితో ఎఫ్2, సూపర్ స్టార్ మహేష్ గారితో సరిలేరు నీకెవ్వరు, మళ్లీ వెంకీ గారితో ఎఫ్3, బాలకృష్ణ గారితో భగవంత్ కేసరి మళ్లీ వెంకీ గారితో సంక్రాంతికి వస్తున్నాము.. ప్రతి హీరోతో ప్రతి సినిమా ఒక మెమరబుల్ ఎక్స్ పీరియన్స్. నేను సినిమాలు చూస్తూ విజిల్స్ కొట్టిన హీరోలతో కలిసి పనిచేయడం అల్టిమేట్ ఫీలింగ్.  
 
-'సంక్రాంతికి వస్తున్నాం'కు వస్తున్న కాంప్లిమెంట్స్ చూస్తుంటే చాలా ఎమోషనల్ గా ఫీలౌతున్నాను. 'మా అమ్మ ముఫ్ఫై ఏళ్ల తర్వాత సినిమాకి వచ్చింది' అని ఓ ఫ్రెండ్ ఫోటో షేర్ చేస్తూ మెసేజ్ పెట్టాడు. కొంతమంది వీల్ చైర్ లో వచ్చీ మరి సినిమా చూశారు. సినిమాకి దూరమైన ఆడియన్స్ మళ్ళీ థియేటర్ కి రావడం చాలా సంతోషాన్ని ఇచ్చింది.
 
- పదేళ్ళ కెరీర్ లో నా సినిమాని చూస్తూ సపోర్ట్ చేస్తున్న ఆడియన్స్ ప్రేమ. ఈ పదేళ్ళుగా నాకు వచ్చిన ఆస్తి అదే. దీన్ని సినిమా సినిమాకి పెంచుకుంటూ వెళ్తున్నా. సంక్రాంతికి వస్తున్నాం తో నా ఆస్తి విలువేంటో ఆడియన్స్ మళ్ళీ చూపించారు. ఆడియన్స్ ప్రేమ పరంగా నేను మల్టీ మిలీనియర్ ని. 
 
-సినిమాకి జెన్యూన్ గా ఆడియన్స్ ఎంతమంది వెళ్తున్నారనేది బుక్ మై షో చూస్తే అర్ధమైపోతుంది. ఈ సినిమా ఓపెనింగ్స్ నుంచే  రికార్డ్ స్థాయిలో టికెట్స్ సోల్డ్ అవుతున్నాయి. చాలా ఏరియాల్లో రికార్డ్స్ క్రియేట్ అయ్యాయని చెబుతున్నారు. ఈ సినిమా నా కెరీర్ లో ఎయిత్ వండర్
 
దర్శకుడు కాకముందే పటాస్ కు ముందే ఏడాదిన్నర జర్నీ వెనక్కి వెళ్లి చూసుకుంటే స్ఫూర్తిదాయకంగా వుంటుంది. చాలా ఎమోషనల్ జర్నీ. చాలా ఓపికగా ప్రయత్నం చేశాను. నాకున్న లిమిటేషన్ తో చాలా కాంపాక్ట్ బడ్జెట్ తో పటాస్ చేశాం. అది ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అయ్యింది. డెబ్యునే అందరూ మాట్లాడుకునేలా చేసి సినిమా సినిమాకి ఒకొక్కమెట్టు ఎదుగుతూ ప్రతి సినిమాకి ప్రూవ్ చేసుకోవడం నాకే ఒక ఇన్స్పిరేషన్.
 
- ఈవివి గారు ఓ లెజెండ్. ఆయన సినిమాలు చిన్నప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. ఆయనతో పోల్చడం బిగ్గెస్ట్ కాంప్లిమెంట్, బిగ్గెస్ట్ రెస్పాన్స్ బులిటీ.
-చిరంజీవి గారితో చేయబోయే సినిమా గురించి ఇప్పుడే మాట్లాడటం టూ ఎర్లీ అవుతుంది. ఎలాంటి జోనర్ లో చేయాలనే టాక్స్, హోమ్ వర్క్ జరుగుతుంది. వందశాతం అందరూ ఊహించినదానికంటే ఎక్కువగా చిరంజీవి గారిని ప్రజెంట్ చేయాలనే విల్ పవర్ తో వున్నాను.  
 
- నాగార్జునతో వందశాతం చేస్తాను. ఆయనతో హలో బ్రదర్ లాంటి సినిమా చేయాలని వుంది. నేను చూసిన ఫోర్ పిల్లర్స్ తో నాలుగు సినిమాలు చేశాననే రికార్డ్ కూడా నాకు వుంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మావోయిస్టు అగ్రనేత చలపతి ప్రాణాలు తీసిన సెల్ఫీ.. ఎలా?

అమరావతి రాజధాని నిర్మాణం కోసం రూ.11,000 కోట్లు - హడ్కో ఆమోదం

ఓ మహిళతో ఇద్దరు ఆటో డ్రైవర్ల అక్రమ సంబంధం.. హన్మకొండలో లైవ్ మర్డర్ (Video)

ఉప ముఖ్యమంత్రి పదవిపై మంత్రి లోకేశ్ ఏమన్నారు?

టర్కీ హోటల్‌లో ఘోర ప్రమాదం.. 76 మంది మృత్యువాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీవనశైలిలో మార్పులతో గుండెజబ్బులకు దూరం!!

యునిసెఫ్‌తో కలిసి తిరుపతిలో 'ఆరోగ్య యోగ యాత్ర' ఫాగ్సి జాతీయ ప్రచారం

Winter Stroke శీతాకాలంలో బ్రెయిన్ స్ట్రోక్, నివారించే మార్గాలు

ప్రతిరోజూ బాదం తినడం వల్ల కలిగే 8 ఆరోగ్య ప్రయోజనాలు

Golden Milk: గోల్డెన్ మిల్క్ హెల్త్ బెనిఫిట్స్

తర్వాతి కథనం
Show comments