Webdunia - Bharat's app for daily news and videos

Install App

డాడీని డాన్‌గా చూడాలని వుంది.. చిరంజీవిని డైరెక్ట్ చేయాలి : సౌందర్య

వెండితెరపై తన డాడీని డాన్‌గా చూడాలనివుందనీ, అలాగే, మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేయాలని ఉందని తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె సౌందర్య రజినీకాంత్ అంటోంది. ఆమె ప్రస్తుతం ధనుష్ హీరోగా నటిస్తున్న

Webdunia
గురువారం, 20 జులై 2017 (11:13 IST)
వెండితెరపై తన డాడీని డాన్‌గా చూడాలనివుందనీ, అలాగే, మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేయాలని ఉందని తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె సౌందర్య రజినీకాంత్ అంటోంది. ఆమె ప్రస్తుతం ధనుష్ హీరోగా నటిస్తున్న 'వీపీఐ2' చిత్రానికి దర్శకత్వం వహిస్తోంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన కెరీర్‌లో ఎప్పటికైనా చిరంజీవితో క‌లిసి ఓ సినిమా చేయాల‌నుంద‌ని మనసులోని మాటను వెల్లడించింది. ఒకవేళ ఆ అదృష్ట‌మే వ‌స్తే దేవుడికి కోటిసార్లు కృత‌జ్ఞ‌త‌లు చెబుతానంది. 
 
అంతేకాకుండా ర‌జినీకాంత్‌ను డాన్‌గా చూడాల‌ని ఉంద‌ని, త్వ‌ర‌లో హ్యారీపోట్ట‌ర్ లాంటి సినిమాను తీస్తాన‌ని సౌంద‌ర్య చెప్పుకొచ్చింది. 'కొచ్చ‌డ‌యాన్' సినిమా పెద్ద‌గా విజ‌యం సాధించ‌క‌పోయినా, దేశంలో మొద‌టి మోష‌న్ క్యాప్చ‌ర్ సినిమాను ర‌జ‌నీకాంత్‌ను హీరోగా పెట్టి తీసినందుకు చాలా గ‌ర్వ‌ప‌డుతున్న‌ట్లు ఆమె చెప్పుకొచ్చింది. 
 
ఇకపోతే 'వీఐపీ2' చిత్రం గురించి మాట్లాడుతూ ఈ సినిమాను చాలా క‌ష్ట‌ప‌డి తీశాం. 20 ఏళ్ల త‌ర్వాత కాజోల్ ద‌క్షిణాది సినిమాలో న‌టించారు. వ‌సుంధ‌రా ప‌ర‌మేశ్వ‌ర‌న్ పాత్ర‌కు కాజోల్ త‌ప్ప వేరే ఎవ్వ‌రూ న్యాయం చేయ‌లేర‌ని ఆమెను సంప్ర‌దించాం అని వివ‌రించింది. అలాగే ఈ సినిమాలో అవ‌స‌ర‌మైనచోట అమ్మ సెంటిమెంట్ జోడించినట్టు తెలిపారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

Telangana: పోలీసుల ఎదుట లొంగిపోయిన సీపీఐ మావోయిస్ట్ పార్టీ నేతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments