Webdunia - Bharat's app for daily news and videos

Install App

1998లోనే నాపై రేప్ జరిగింది.. హాలీవుడ్‌లోనే మహిళలకు జీతాలు తక్కువే: ఆష్లే జడ్

ప్రముఖ హాలీవుడ్ నటి, సామాజిక కార్యకర్త ఆష్లే జడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆష్లే అమెరికాలోని ప్రముఖ మ్యూజిక్‌ స్టార్‌ నయోమి జడ్‌ కుమార్తె. గతంలో కూడా ఆష్లే తనను హాలీవుడ్‌ స్టూడియో ఎగ్జిక్యూటివ్‌ ఒకరు లై

Webdunia
మంగళవారం, 31 జనవరి 2017 (13:39 IST)
ప్రముఖ హాలీవుడ్ నటి, సామాజిక కార్యకర్త ఆష్లే జడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆష్లే అమెరికాలోని ప్రముఖ మ్యూజిక్‌ స్టార్‌ నయోమి జడ్‌ కుమార్తె. గతంలో కూడా ఆష్లే తనను హాలీవుడ్‌ స్టూడియో ఎగ్జిక్యూటివ్‌ ఒకరు లైంగికంగా వేధించారని వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పాలసీలను వ్యతిరేకించిన హాలీవుడ్‌ సెలబ్రిటీలలో ఆష్లే కూడా ఒకరు.
 
ఈ నేపథ్యంలో తానూ చిన్నతనంలోనే లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని.. పద్నాలుగేళ్లకే అత్యాచారానికి గురయ్యానని ఆష్లే జడ్ బహిర్గతం చేశారు. బాలికలు, మహిళలపై లైంగిక హింసకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన ప్రపంచ స్థాయి సమావేశాల్లో ఆష్లే మాట్లాడుతూ.. లింగవివక్ష గురించి, మహిళలపై అకృత్యాల గురించి ప్రసంగించిన ఆష్లే తానూ ఆ హింసకు బాధితురాలినేనని చెప్పారు. 1998లోనే తనపై అత్యాచారం జరిగిందని.. తాను ఏడేళ్ల వయస్సులో లైంగిక వేధింపులకు గురయ్యానని తెలిపారు.
 
కానీ తాను అక్రమ రవాణా బారిన పడకపోవడం మాత్రం అద్భుతమంటూ ఆష్లే (48) అక్రమ రవాణా బాధితుల పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై లైంగిక దోపిడి, హింస, లింగ వివక్షకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు. హాలీవుడ్‌లోనూ లింగ వివక్ష చూపుతున్నారని, నటీనటులకు ఇచ్చే పారితోషికంలో చాలా తేడా ఉంటోందన్నారు. పురుషులతో పోలిస్తే సంపాదించాల్సిన దాని కంటే 40శాతం తక్కువ సంపాదిస్తున్నానని ఆష్లే చెప్పారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పదేళ్ల క్రితం పక్కింటి కుర్రోడితో పారిపోయిన కుమార్తె.. యూపీలో పరువు హత్య!!

కక్ష్యకు అత్యంత సమీపానికి చేరుకున్న స్పేడెక్స్ ఉపగ్రహాలు : ఇస్రో

అంబేద్కర్ విగ్రహం సాక్షిగా మహిళపై గ్యాంగ్ రేప్ .. ఎక్కడ?

పాకిస్థాన్‌లో బంగారం పంట... సింధు నదిలో పసిడి నిల్వలు!!

పుస్తకాల పురుగు పవన్ కళ్యాణ్ : రూ.లక్షల విలువ చేసే పుస్తకాలు కొన్న డిప్యూటీ సీఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలి కాలంలో బొంతను పూర్తిగా ముఖాన్ని కప్పేసి పడుకుంటే ఏం జరుగుతుంది?

పరోటా తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోవాల్సినవి

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం