కమర్ ఫిల్మ్ ప్యాక్టరీ లో పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలనుంది

Webdunia
శనివారం, 25 మార్చి 2023 (15:22 IST)
kamar and his wife
అంతర్జాతీయ స్థాయికి తగ్గకుండా మంచి నిర్మాణ విలువలతో ప్రేక్షకులను అలరించాలనే సదుద్దేశంతో హైదరాబాద్ లో కమర్ ఫిల్మ్ ఫ్యాక్టరి విజయవంతంగా ప్రారంభం అయింది. ఈ మధ్యకాలంలో  సినిమాలు వివిధ భాషల్లో డబ్బింగ్ అవుతూ మంచి విజయాలను అందుకుంటున్నాయి. ఈ తరుణంలో థియేటర్ల దగ్గర సినిమాలు విడుదలైనప్పటికీ ఓటిటి ప్రాధాన్యత బాగా పెరిగింది. ఇండియన్ యంగ్ బిజినెస్ కమర్ సినిమా రంగంలోకి అడుగు పెట్టాడు. తాను ఇండియా లెవెల్ లో ఓటీటి కంటెంట్ ను ప్రజెంట్ చేయడమే లక్ష్యంగా కమర్ ఫిలిం ఫ్యాక్టరీ అనే నిర్మాణ సంస్థను స్థాపించి, దాని ద్వారా సినిమాలను నిర్మిస్తున్నారు. ప్రేక్షకులకు వినోదాన్ని అలరిస్తూనే సినిమాలో నటించే నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఉపాధి కల్పించాలని ఒక గొప్ప ఉద్దేశంతో తన వ్యాపారాన్ని భారతదేశం మొత్తం విస్తరిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో బాక్స్ క్రికెట్ లీగ్ ప్రొప్రైటర్, కమ్మర్ ఫిలిం ఫ్యాక్టరీ అధినేత కమర్ మాట్లాడుతూ... ప్రేక్షకుల కోసం అంతర్జాతీయ విలువలతో మంచి సినిమా కంటెంట్లను ప్రోత్సహించడానికి ఈ సంస్థను స్థాపించడం జరిగింది. ఈ సంస్థ నిర్మాణంలో జరిగే సినిమాలను ఓటిటి ద్వారా ప్రజల్లోకి తీసుకొస్తున్నందుకు ఎంతగానో సంతోషిస్తున్నట్లు చెప్పారు. కన్నడ, తెలుగు, తమిళ్, హిందీ, మళియాలంలో సినిమాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. 
 
ఇంకా మాట్లాడుతూ తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా తీయాలని తన కోరికను బయటపెట్టారు. ఫ్యాషన్ టీవీ ఇండియా, బాక్స్ క్రికెట్ లీగ్, ఫిల్మ్ ఫేయిర్ లాంటిసంస్థలను దిగ్విజయంగా నడుపుతూ.. ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నా కమర్ ఫిలమ్ ఫ్యాక్టరీ ద్వారా ఎంతో మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. త్వరలోనే సినిమా నిర్మాణ పనులు కూడా ప్రారంభం చేస్తున్నట్లు అందుకోసం వర్థమాన ఫిల్మ్ మేకర్స్ తో సంభాషిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహం.. పృథ్వీరాజ్ వర్సెస్ శుభలేఖ సుధాకర్

ఎన్డీఏతో చేతులు కలపనున్న టీవీకే విజయ్.. తమిళ రాష్ట్రంలోనూ డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుందా?

నారా లోకేష్‌తో పెట్టుకోవద్దు.. జగన్ విమాన ప్రయాణాల ఖర్చు రూ.222 కోట్లు.. గణాంకాల వెల్లడి

బీమా సొమ్ము కోసం అన్నను చంపిన తమ్ముడు

శోభనం రోజు భయంతో పారిపోయిన వరుడు... ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments