Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

దేవీ
మంగళవారం, 8 జులై 2025 (18:31 IST)
Hero Siddharth
హీరో సిద్ధార్థ్ లేటెస్ట్ మూవీ '3 BHK'. శ్రీ గణేష్ దర్శకత్వం వహించారు. శరత్ కుమార్ , దేవయాని, యోగి బాబు, మీతా రఘునాథ్, చైత్ర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శాంతి టాకీస్ బ్యానర్‌పై అరుణ్ విశ్వ నిర్మించిన చిత్రం జూలై 4న విడుదలై విజయాన్ని అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా హీరో సిద్ధార్థ్ హైదరాబాద్ లో మాట్లాడారు.
 
ఆడియన్స్ నుంచి చాలా అద్భుతమైన రెస్పాన్స్ ఉంది. ఒక క్లాసిక్ సినిమాకి ఉండాల్సిన క్వాలిటీస్ అన్ని ఈ సినిమాకి ఉన్నాయి. ఈ సినిమాలో పార్ట్ కావడం గర్వంగా ఉంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో స్క్రిప్టు చదివిన వెంటనే మా నాన్నగారిని కౌగిలించుకున్నాను అని చెప్పాను. తర్వాత ఇందులో ఉండే ఎలిమెంట్స్ అన్ని రిలేట్ చేసుకునేలాగా ఉంటాయని అన్నాను. ఆ రెండిటిని ఆడియన్స్ ఈరోజు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. ఈ కథ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా చూసిన అందరూ కూడా చాలా అద్భుతంగా ఉందని మెసేజ్లు పెడుతుంటే చాలా ఆనందంగా అనిపించింది. ఈ సినిమాలో ప్రతి కొడుకు థియేటర్ కి వెళ్లి తండ్రిని చూడగలుగుతున్నాడు. ప్రతి తండ్రి కొడుకుని చూడగలుగుతున్నాడు. ఒక కామన్ మ్యాన్ కథ చెప్పడం నాకు. గెలుపు మన దగ్గరికి వచ్చేటప్పుడు ఆ సంతృప్తి వేరు. అలాంటి ఆనందాన్ని డైరెక్టర్ శ్రీ గణేష్ ఈ సినిమాలో చూపించాడు. 
 
ఈ సినిమాలో ప్రభు క్యారెక్టర్ లాగే నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను.  ప్రభు పాత్ర చాలా విషయాలు నాకు చాలా విషయాలు నేర్పింది.  ఓడిపోవడం పర్మినెంట్ కాదని డైరెక్టర్ ఈ సినిమాతో చాలా అద్భుతంగా చూపించాడు. అరుణ్ విశ్వా చాలా మంచి కంటెంట్ ని సపోర్ట్ చేసే ప్రొడ్యూసర్. వారితో మరిన్ని సినిమాలు చేయాలని ఉంది. శ్రీ గణేష్ రైటింగ్ అద్భుతంగా ఉంటుంది. డైరెక్టర్ గా చాలా క్లియర్ విజన్ తో ఉంటాడు. ఈ సినిమాకి రెండో రోజు నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి చాలా అద్భుతమైన రెస్పాన్స్ ఉంది.  మేము ఏపీ తెలంగాణలో థియేటర్స్ విజిట్ చేయబోతున్నాం. ఫస్ట్ వీక్ తర్వాత ఇంత క్రౌడ్ చూడడం బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఈ సినిమాని రిలీజ్ చేసిన మైత్రి మూవీ మేకర్స్ కి చాలా థాంక్స్. ఈ సినిమాకు పని చేసిన ప్రతి టెక్నీషియన్ ఆర్టిస్ట్ కి నేను రుణపడి ఉన్నాను. 
 
శరత్ కుమార్ గారు దేవయాని గారు ఈ సినిమా చేయకపోతే ఇంత అందంగా వచ్చేది కాదు. ప్రతి ఇంట్లో ఉండే తల్లిదండ్రులని వాళ్ళు మా కళ్ళ ముందుకు తీసుకువచ్చారు. మితా చెల్లెలు క్యారెక్టర్ కి ప్రాణం పోసింది. చైత్ర నాలుగు సీన్స్ చేసి బెస్ట్ పెర్ఫార్మర్ అవార్డు తీసుకుంది. అమృత్ రామ్నాథ్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. ఈ ఆల్బమ్ మెమొరబుల్ గా ఉండిపోతుంది. ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్ ని ఎప్పటికీ మర్చిపోలేను. ఈ సినిమాకి ఎంత మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’అన్నారు
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డయల్ బిఫోర్ యు డిగ్ అని కోరుతున్న థింక్ గ్యాస్

ఒక్క రాత్రికి రూ. 10 వేలు ఇస్తా, నాతో పడుకుంటావా?: కామాంధుడికి దేహశుద్ధి (video)

IIT Bombay: హాస్టల్ బాత్రూమ్‌లో కెమెరాలు ఫిక్స్ చేసి చిక్కిన ఓల్డ్ స్టూడెంట్.. చివరికి?

కోడలు గర్భిణి.. అయినా చంపేశాడు... గొడ్డలి, కత్తితో దాడి చేసి..?

Nara Lokesh: ఆస్ట్రేలియాకు నారా లోకేష్.. దీపావళి బహుమతిని అలా తెస్తారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments