నేను హీరోగా చేయాల్సింది కానీ ర‌వితేజ చేశాడు - శ్రీారామ్‌

Webdunia
బుధవారం, 16 ఫిబ్రవరి 2022 (10:07 IST)
Shriram
తెలుగు అబ్బాయి. శ్రీ‌కాంత్‌. కానీ సినిమాప‌రంగా శ్రీ‌రామ్ అని మార్చేశారు. చిత్తూరుకు చెందిన ఈ శ్రీ‌రామ్ త‌మిళం, తెలుగు సినిమాల్లో న‌టించాడు. రోజాపూలు సినిమా ఆయ‌న హీరోగా న‌టించిన సినిమా స‌క్సెస్ అయింది. ఆ త‌ర్వాత ప‌లు సినిమాలు చేశాడు.  అమ్మా నాన్న ఓ త‌మిళ అమ్మాయి సినిమాకు ఆయ‌నే హీరో. పూరీ జ‌గ‌న్నాథ్ కూడా క‌థ‌రీత్యా బాక్సింగ్ కూడా నేర్పిస్తాన్నాడు. కానీ దుర‌దృష్ట‌వ‌శాత్తూ అంత‌కుముందు ఓ సినిమాలో న‌టించ‌డంతో ఆయ‌న‌కు ఫైర్ యాక్సిడెంట్ అయింది. దాంతో ఆరు నెల‌లు రెస్ట్ తీసుకోవాల్సి వ‌చ్చింది. చేతులు, వీపు అంతా కాలిపోయింది. కొన్ని చోట్ల చ‌ర్మం కూడా ఊడిపోయింది. అయినా ఆరు నెల‌లు ఆగుతాన‌ని పూరీ అన్నాడ‌ట‌. కానీ ఆగినా త‌న‌కు బాక్సింగ్ చేసే ఎన‌ర్జీ లేద‌ని వ‌దులుకున్నాడు శ్రీ‌రామ్‌.
 
ఈ విష‌యాన్ని ఇటీవ‌లే టీవీ ఇంట‌ర్వ్యూలో చెప్పాడు. ఆడ‌పాద‌డ‌పా చిన్న సినిమాలు కూడా చేస్తున్న శ్రీ‌రామ్‌కు మ‌రో అవ‌కాశం వ‌చ్చిన‌ట్లే వ‌చ్చి చేజారిపోయింది. సేమ్‌. ర‌వితేజ హీరోగా కిక్ సినిమాలో విల‌న్‌గా చేయ‌డానికి అంతా ప్లాన్ సిద్ధ‌మైంది. కానీ ఆ సినిమా కు ముందు సేమ్‌టుసేమ్ మ‌ర‌లా ఓ చిత్ర షూటింగ్‌లో శ్రీారామ్‌కు ప్ర‌మాదం జ‌రిగింది. దాంతో మ‌రోసారి రెస్ట్  తీసుకోవాల్సి వ‌చ్చింది. ఈ విష‌యం తెలిసిన ర‌వితేజ‌, శ్రీ‌రామ్‌కు ధైర్యం చెప్పారు. అయితే విల‌న్‌గా తాను చేయ‌లేన‌ని ఆరోగ్యం స‌హ‌క‌రించ‌డంలేద‌ని చెప్ప‌డంతో, అప్పుడు నువ్వే ఒక పేరును సెల‌క్ట్ చేయ‌మంటే... శ్రీ‌రామ్ ఎంపిక చేసిన న‌టుడు పేరు శ్యామ్‌. అలా కిక్‌లో అత‌ను విల‌న్‌గా చేశాడు. ఇలా ర‌వితేజ చేసే సినిమాల్లో ఒక‌సారి హీరోగా, మ‌రోసారి విల‌న్‌గా చేజార్చుకున్న శ్రీ‌రామ్‌.. విధి ఎవ‌రిని ఎటువైపు తీసుకెళుతుందో తెలియ‌ద‌ని తెలియ‌జేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Amaravati: అమరావతిలో 3300 కి.మీ సైక్లింగ్, వాకింగ్ ట్రాక్ నెట్‌వర్క్‌

నేను, బ్రాహ్మణి ఇంటి పనులను సమానంగా పంచుకుంటాం.. నారా లోకేష్

తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి, పరిసర ప్రాంతాల్లో నెట్‌వర్క్ నాణ్యతను పరీక్షించిన ట్రాయ్

ఫెయిల్ అయితే భారతరత్న అబ్దుల్ కలాంను గుర్తు తెచ్చుకోండి: చాగంటివారి అద్భుత సందేశం (video)

Matrimony Fraud: వరంగల్‌లో ఆన్‌లైన్ మ్యాట్రిమోని మోసం.. వధువు బంగారంతో పరార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments