Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుష్క డైలాగ్స్‌ను అద్దం ముందు నిల్చుని చెప్పేదాన్ని : హీరోయిన్ ప్రణవి మానుకొండ

Webdunia
బుధవారం, 26 జులై 2023 (16:27 IST)
Pranavi Manukonda
సంజయ్ రావు, ప్రణవి మానుకొండ జంటగా నటిస్తోన్న చిత్రం ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’. చిన్న సినిమాగా మొదలైన ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్‌టైన్మెంట్ లాంటి పెద్ద సంస్థ రిలీజ్ చేయబోతోంది.  మైక్ మూవీస్ బ్యానర్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి డైరెక్టర్ పూరీ జగన్నాథ్ శిష్యుడు డాక్టర్ ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహించాడు. అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని జూలై 29న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ సందర్భంగా హీరోయిన్ ప్రణవి మానుకొండ మీడియాతో ముచ్చటించారు.
 
నాకు చిన్నప్పటి నుంచి నటించడం అంటే చాలా ఇష్టం. అనుష్క నటించిన అరుంధతి సినిమా డైలాగ్స్‌ను అద్దం ముందు నిల్చుని చెప్పేదాన్ని. యాక్టింగ్ అంటే మమ్మీకి కూడా ఇష్టమే. వాళ్లు నన్ను చాలా ప్రోత్సహించారు. చిన్నప్పటి నుంచే ఆడిషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. రొటీన్ లవ్ స్టోరీ, ఉయ్యాల జంపాలతో మంచి గుర్తింపు వచ్చింది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా మంచి ఆఫర్లు వచ్చాయి. సీరియల్స్‌లోనూ లీడ్‌గా చేశాను. కానీ నాకు సినిమాలంటే ఇష్టం. అందుకే ఇటు వైపు వచ్చాను. కళ్యాణ్ రామ్ గారి అమిగోస్‌లోనూ నటించాను. నేను చేసిన రీల్స్ నుంచి మైక్ టీవీ నుంచి ఆఫర్ వచ్చింది. ఈ సినిమాకు ఆడిషన్ ఇచ్చాను.
 
టైటిల్ చాలా కొత్తగా అనిపించింది. కథ కూడా కొత్తగానే ఉంటుందనిపించింది. స్క్రిప్ట్ అంతా కూడా నవ్వుతూనే చదివాను. ఎక్కడా బోర్ కొట్టలేదు. ఈ సినిమాలో ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఫన్ రైడ్‌తో పాటు ఎమోషన్స్‌ను బ్యాలెన్స్ చేశారు దర్శకుడు. నేను చేసిన మౌనిక పాత్ర కూడా కొత్తగా ఉంటుంది. రెగ్యులర్ హీరోయిన్ కారెక్టర్‌లా ఉండదు. అన్ని రకాల ఎమోషన్స్ ఇందులో ఉంటాయి. అందుకే ఈ సినిమాను చేశాను. ఇది నా మొదటి చిత్రం కాస్త నెర్వస్‌గా ఉంది.
 
నేను ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ చేస్తున్నాను. ఇన్ స్టాగ్రాంలో రీల్స్ అందరూ చేస్తున్నారు కదా?.. నేను ఎందుకు చేయకూడదని అనుకున్నాను. నేను పోస్ట్ చేయడం ప్రారంభించాక జనాల నుంచి ఎక్కువ సపోర్ట్ వచ్చింది. అక్కడే నాకు రీచ్ ఎక్కువగా వచ్చింది.
 
సీరియల్, సినిమాలకు నటించే విధానంలో తేడా ఉంటుంది. సీరియల్స్‌లో డ్రామా ఎక్కువగా ఉండాలి.. సినిమాల్లో రియలిస్టిక్‌గా ఉండాలి. నాకు ఆ రెండు రకాల అనుభవం ఉంది.
 
స్టార్స్‌తో సినిమాలు చేయడం అంటే నాకు భయంగా ఉంటుంది. ఫస్ట్ టూ టేక్స్‌లోనే సీన్స్ చేస్తాను. అంతకంటే ఎక్కువ తీసుకోను.
 
తెలుగు అమ్మాయిని అవ్వడం ప్లస్‌గానే భావిస్తాను. మనకు ఉండే నేటివిటీ మన వాళ్లకే ఉంటుంది. పక్క భాషల నుంచి వచ్చే వారికి ఉండదు. రెగ్యులర్ కారెక్టర్లు కాకుండా.. నేను చేసే పాత్రలకు ప్రాధాన్యం ఉండాలని భావిస్తాను. కారెక్టర్ డిమాండ్ చేస్తే గ్లామర్ అయినా డీ గ్లామర్‌గానైనా నటిస్తాను. ఇప్పుడు నా ఫోకస్ అంతా కూడా సినిమాల మీదే ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మా సిఫార్సు లేఖలను పరిగణనలోకి తీసుకోండి.. బీఆర్ నాయుడికి హరీశ్ వినతి (Video)

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు, ఎందుకో తెలుసా?

అమెరికా నుంచి భారతీయులను ప్రత్యేక విమానాలలో ఎందుకు తిప్పి పంపుతున్నారు, ట్రంప్ వచ్చాక ఏం జరగనుంది?

నిరూపిస్తే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటాం : చెవిరెడ్డికి బాలినేని సవాల్

బంగాళాఖాతంలో మరింతగా బలపడిన వాయుగుండం.. దిశ మారుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments