Webdunia - Bharat's app for daily news and videos

Install App

మలర్ పాత్రను జనం మర్చిపోతారు అని ఎన్నడూ అనుకోలేదు. కానీ భానుమతి దాన్ని తోసేసింది: సాయిపల్లవి

మెడిసన్ పూర్తి చేయాలనే లక్ష్యం కారణంగా పిదా చిత్రంలో నటించడానికి ఆరునెలల సమయం అడిగినప్పుడు దానికి శేఖర్ కమ్ముల అంగీకరించడం నా కెరీర్‌నే మలుపు తిప్పిందని ఫిదా హీరోయిన్ సాయిపల్లవి చెప్పింది. కెరీర్ మొదట్లోనే ఇంతగా అరిచే, అల్లరి చేసే అమ్మాయి పాత్రను చే

Webdunia
బుధవారం, 2 ఆగస్టు 2017 (09:16 IST)
మెడిసన్ పూర్తి చేయాలనే లక్ష్యం కారణంగా పిదా చిత్రంలో నటించడానికి ఆరునెలల సమయం అడిగినప్పుడు దానికి శేఖర్ కమ్ముల అంగీకరించడం నా కెరీర్‌నే మలుపు తిప్పిందని ఫిదా హీరోయిన్  సాయిపల్లవి చెప్పింది. కెరీర్ మొదట్లోనే ఇంతగా అరిచే, అల్లరి చేసే అమ్మాయి పాత్రను చేస్తున్నానే, భానుమతి పాత్రకు న్యాయం చేయగలనా అని కూడా కలవరపడ్డానని దర్శకుడి ప్రోత్సాహం కారణంగా ఆ పాత్రను పోషించడం సులువైందని పల్లవి పేర్కొంది.  

ప్రేమమ్ సినిమాలో మలర్ పాత్రను మించింది ఇక దొరకదనుకున్నాను. ఆ స్థాయి పేరు కూడా భవిష్యత్తులో నేను నటించే సినిమాల్లో లభించదని భావించాను. అందుకే ఫిదా షూటింగులో కూడా అందరూ నన్ను మలర్ అంటూంటే ఏడుపొచ్చింది. మలర్ పాత్ర ముగిసింది కదా. భానుమతి అని పిలవండి అని షూటింగులో అందరికీ చెప్పాను. ఇప్పుడయితే అందరూ నన్ను భాను అనే పిలుస్తున్నారు. చాలా బిగ్ చేంజ్ అన్నమాట. ఒక కేరక్టర్ స్థానంలో మరొక కేరక్టర్ జనం జ్ఞాపకాల్లో చేరడం చాలా బాగుంది.  మొత్తం మీద భానుమతి పాత్ర మలర్‌ని మరిపించింది అని పల్లవి సంతోషం వ్యక్తం చేసింది.
 
ఫిదాలో రైలు ఎక్కుతూ భానుమతి కోపంతో చెప్పిన డైలాగ్ అర్థం ఇప్పటికీ పల్లవికి తెలీదట. చాలా బాడ్ వర్డ్ అని చెప్పారు కాని అర్థం ఎవరూ చెప్పలేదు. తెలుగులో తొలి సినిమాలోనే ఇంత లౌడ్‌గా అరుస్తూ డైలాగు చెప్పితే ఎలా రిసీవ్ చేసుకుంటారో అని భయపడ్డానని కానీ థియేటర్‌కి వెళ్లి కూర్చున్న తర్వాత జనం కేకలు అరుపులు చూశాక భయం పోయిందని సాయిపల్లవి చెప్పింది. 
 
అయితే బాడ్ కోవ్ అనే పదం చెడుపదం అని చెప్పలేం. చాలాకాలంగా జనం దీన్ని పలుకుతుండటంతో అందరికీ అలవాటయిపోయింది. భాషలో కొన్నిపదాలను పాజిటివ్‌గాను, నెగటివ్ గానూ పలుకుతుంటాం కదా. అలాంటిదే ఇది కూడా అని దిల్ రాజు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. దాంతో పల్లవి ఊపిరి పీల్చుకున్నారు. ఆ పదం వద్దులే బద్మాష్ అనే పదం పెట్టండి అని నేను చెప్పాను కాని శేఖర్ కమ్ముల పట్టుబట్టి సెన్సార్ వాళ్లతో నేను మాట్లాడతాను అని చెప్పి ఆ డైలాగ్ యధాతథంగా పెట్టి సినిమాగా చూపిస్తే సింగిల్ కట్ లేకుండా  సెన్సార్  వాళ్లు సినిమాను ఒకే చేసారని దిల్ రాజు తెలిపారు. 
 
అయితే ఫస్ట్ టైమ్ తెలుగు సినిమా,ఫస్ట్ డైలాగే బూతులా అని మా అమ్మ భయపడ్డారు. శుభకార్యం వంటి మంచి పదాలతో షూటింగ్ మొదలుపెట్టవచ్చు కాదా అని ఆమె ఉద్దేశం. కానీ అందరికీ ఆపదం నచ్చేసింది కాబట్టి ఇప్పుడు సమస్య లేదని సాయి పల్లవి చెప్పారు.
 
శేఖర్ కమ్ముల దర్శకత్వ ప్రతిభ కారణంగానే భానుమతి పాత్ర తొలి సీన్ నుంచి జనంలో ముద్రవేసేసింది. బాడ్ కోవ్ తర్వాత మరో సీన్‌లో హీరో లవ్ ప్రపోజ్ చేస్తే అప్పటికే అతడిమీద మండిపడిపోతున్న భానుమతి తన కాలి చెప్పును ఫొటో తీసి వాట్సాప్‌లో పంపిస్తుంది. తొలి రోజు సినిమా చూస్తున్నప్పుడు సాయి పల్లవి జనం ఎలా రిసీవ్ చేసుకుంటారోనని భయపడిపోయిందట. పక్కనే ఉన్న తన చెల్లెలు చేయి పట్టుకుని సాయిరాం సాయిరాం అంటూ అనుకుండి పోయిందట. కానీ జనం ఆమె చెప్పు పింపించిన దృశ్యం రాగానే కేకలు, అరుపులు, పేపర్లు విసరటం చేస్తూ దాన్ని ఆమోదించడంతో సాయి పల్లవికి భయం పోయి ఆనందంతో ఏడుపు వచ్చేసిందట.

తర్వాత నా ప్రతి డైలాగుకూ ప్రేక్షకులు చప్పట్లు కొడుతున్నారు.  నా డైలాగులకు కొడుతున్నారా మరొక దానికా అనిపించింది. వపన్ కల్యాణ్ గారి డైలాగులు కదా అందుకు చప్పట్లు కొడుతున్నారా అనికూడా అనిపించింది. కానీ జనం చూపించిన ఆ రెస్పాన్స్ చూసి జీవితంలోనే ఎన్నడూ లేనంత సంతోషం కలిగింది. ఫస్ట్ డే ఫస్ట్ షో నాకు చాలా షాకింగ్. ఏడుపు కూడా వచ్చింది అని పల్లవి చెప్పారు.
 
అంతకుమించి నా చెల్లెలు నాకు పెద్ద క్రిటిక్. నేను ఏం చేసినా ఒక పట్టాన ఒప్పుకోదు. ఏం చేసినా నాట్ అప్ టు మై ఎక్స్‌పెక్టేషన్స్ అనేది. పూజ అలా ఎందుకు పబ్లిక్‌లో చెబుతుంది అని అమ్మకు బాధ. కాని ఫిదా చూస్తూ ఆరోజు పూజ చప్పట్లు కొడుతోంది. ఏడుస్తోంది. పల్లవీ నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు ఊహించలేదు అనేసింది. అది నాకు చాలా పెద్ద కాంప్లిమెంట్. తర్వాత కోయంబత్తూరు వెళ్లినప్పుడు నా స్నేహితులందరినీ తీసుకుని పూజ ఫిదా సినిమా చూసింది. వాళ్లు చప్పట్లు కొట్టకపోతే మా చెల్లెలు నటించింది చప్పట్లు కొట్టండే అని ఎంకరేజ్ చేసిందట. 
 
ఇదీ ఫిదాను తొలిసారిగా థియేటర్లో చూసినప్పుడు, తర్వాత పల్లవికి కలిగిన స్పందన.
అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీకి తలనొప్పిగా మారిన తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి!

నా భార్య ఓ అద్భుతం - ఎన్ని గంటలు పని చేశామని కాదు.. : ఆనంద్ మహీంద్రా

పదేళ్ల క్రితం పక్కింటి కుర్రోడితో పారిపోయిన కుమార్తె.. యూపీలో పరువు హత్య!!

కక్ష్యకు అత్యంత సమీపానికి చేరుకున్న స్పేడెక్స్ ఉపగ్రహాలు : ఇస్రో

అంబేద్కర్ విగ్రహం సాక్షిగా మహిళపై గ్యాంగ్ రేప్ .. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలి కాలంలో బొంతను పూర్తిగా ముఖాన్ని కప్పేసి పడుకుంటే ఏం జరుగుతుంది?

పరోటా తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోవాల్సినవి

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments