Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ ఇష్యూ: రాజకీయ నాయకుల్ని, వైద్యుల్ని ఎందుకు టార్గెట్ చేయరు?: ప్రియాంకా చోప్రా

భారత్-పాకిస్థాన్‌ల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. యూరీ ఘటన, సర్జికల్ స్ట్రైక్స్‌కు తర్వాత పాకిస్థాన్ అంటేనే ఎవరికీ పడట్లేదు. ఉరీ ఘటన అనంతరం భారత్-పాక్ సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మహార

Webdunia
ఆదివారం, 16 అక్టోబరు 2016 (16:36 IST)
భారత్-పాకిస్థాన్‌ల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. యూరీ ఘటన, సర్జికల్ స్ట్రైక్స్‌కు తర్వాత పాకిస్థాన్ అంటేనే ఎవరికీ పడట్లేదు. ఉరీ ఘటన అనంతరం భారత్-పాక్ సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.

ఈ నేపథ్యంలో మహారాష్ట్ర నవ నిర్మాణ సేన భారత్‌లో ఉంటున్న పాక్‌ నటీనటులను దేశం వదిలి వెళ్లిపోవాల్సిందిగా హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీనిపై భిన్నాభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి.
 
పాక్ నటులు దేశం విడిచిపోవాలనే అంశంపై తాజాగా గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా స్పందించారు. ప్రస్తుతం 'క్వాంటికో సీజన్‌-2' సిరీస్‌ షూటింగ్‌ నిమిత్తం న్యూయార్క్‌లో ఉన్న ప్రియాంక తన అభిప్రాయాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. పాక్ విషయంలో భారత ప్రభుత్వం తీసుకునే నిర్ణయం సబబేనని చెప్పింది.

తనకు దేశభక్తి ఉందని చెప్పింది. కానీ ఈ వ్యవహారంలో కేవలం నటీనటులను ఎందుకు టార్గెట్ చేయాలని ప్రశ్నించింది. దేశంలో ఏం జరుగుతుందో అంతా తెలుసు. కానీ రాజకీయంగా ఎలాంటి ఘటనలు జరిగినా లక్ష్యం చేసేది నటీనటులు, కళాకారులనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని అడిగింది. 
 
వ్యాపారవేత్తలని, రాజకీయ నాయకులని, వైద్యులని ఎందుకు వేలెత్తి చూపరు? భారత్‌ తీసుకున్న నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటాను. కానీ ఈ విషయంలో పాక్‌ నటీనటులు ఎవరికీ ఎలాంటి హానీ కలిగించలేదు. అలాంటప్పుడు వారికి వ్యతిరేకంగా ఉండలేం కూడా అంటూ ప్రియాంక  చోప్రా వ్యాఖ్యానించారు. ఒకరు చేసిన పనికి వారినే శిక్షించాలి కానీ, వారి స్థానంలో కళాకారులని శిక్షించాలనుకోవడం తప్పు అని ప్రియాంక చోప్రా వ్యాఖ్యానించింది. 
 
జాతిపిత మహాత్మా గాంధీ సిద్ధాంతాలను పాటిస్తున్నామని.. అహింసకు కట్టుబడి ఉంటామని ప్రియాంక చోప్రా తెలిపింది. సైనికులకు, వారి కుటుంబాలకు భద్రత కల్పించడంపై మనం శ్రద్ధ వహించాలి. నిర్వర్తించాల్సిన బాధ్యత గురించి మరిచిపోయి అనవసరమైన వాటిపై ఎక్కువగా చర్చిస్తుంటామని అభిప్రాయాలను తెలిపింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియురాలు కానిస్టేబుల్‌ను హత్య చేసి ఠాణాలో లొగిపోయిన ఏఎస్ఐ

సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌కు కోటి రూపాయల నజరానా

ఏపీ లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు - స్వాగతించిన బీజేపీ

అక్రమ సంబంధాన్ని ప్రియుడి భార్యకు చెప్పాడనీ విలేఖరి హత్యకు మహిళ కుట్ర!!

అట్టహాసంగా మహాకాళి అమ్మవారి బోనాలు ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments