Webdunia - Bharat's app for daily news and videos

Install App

జబర్దస్త్ షోలో కరోనా కలకలం.. వర్షకు కోవిడ్ పాజిటివ్.. వాళ్లంతా..? (video)

Webdunia
మంగళవారం, 20 ఏప్రియల్ 2021 (18:37 IST)
బుల్లితెరకు కూడా కోరానా షాకిచ్చింది. తెలుగు బుల్లితెరపై ఎవర్ గ్రీన్ కామెడీ షో జబర్దస్త్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ షోకు ప్రస్తుతం కోవిడ్ వైరస్ సోకింది. ఎప్పుడూ కామెడీతో మాత్రమే కాకుండా కాంట్రవర్సీతో కూడా అప్పుడప్పుడు వార్తల్లో ఉంటుంది జబర్దస్త్ కామెడీ షో. ఇక ఇప్పుడు కరోనాతో వార్తల్లోకి వచ్చింది ఈ షో. ఇదివరకే ఇందులో కొంతమందికి కరోనా పాజిటివ్ వచ్చింది. 
 
అయితే ఆ విషయం బయటకు రాకుండా చూసుకున్నారు. అప్పట్లో సుడిగాలి సుధీర్‌కు కూడా కరోనా వచ్చిందని వార్తలు వచ్చాయి. షూటింగుకు అనుమతులు వచ్చిన తర్వాత అన్ని జాగ్రత్తలు తీసుకొని జబర్దస్త్ షూట్ చేస్తున్నారు. అయినా కూడా ఈ వైరస్ వాళ్లను వదిలిపెట్టడం లేదు.
 
తాజాగా వర్ష కరోనా బారిన పడింది. కేవలం ఆమెకు మాత్రమే పాజిటివ్ వచ్చిందా.. ఇంకా కొంతమందికి కూడా అలాగే వచ్చిందా అనేది అర్థం కావడం లేదు. కేవలం వర్ష విషయం మాత్రమే బయటికి వచ్చింది. అయితే ఈమెకు రావడంతో పాటు మరి కొందరు కమెడియన్లు కూడా కోవిడ్ బారిన పడ్డట్లు తెలుస్తుంది. ముఖ్యంగా వర్షతో పాటు ఉండే మరో కమెడియన్ ఇమాన్యుయేల్ కూడా వైరస్ బారిన పడినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
వీళ్లు మాత్రమే కాదు అతని టీం లీడర్ కెవ్వు కార్తిక్ కూడా ప్రస్తుతం హోమ్ క్వారంటైన్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. జబర్దస్త్ లో చాలామంది కమెడియన్లు ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నారు. అక్కడ ఒక్కరికి వచ్చినా కూడా అందరికీ ఆ భయం అనేది పోదు. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. కేవలం వర్ష వరకు కరోనా వచ్చి వెళ్ళదు కదా.. ఆమెతో పాటు ఉన్న వాళ్లు కూడా కచ్చితంగా క్వారంటైన్‌కి వెళ్లాల్సిందే.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆప్ మరో కీలక హామీ : ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉచిత వైద్యు

భారత్‌కు పన్నుపోటు తప్పదు : హెచ్చరించిన డోనాల్డ్ ట్రంప్

భారతీయులకు అమెరికా శుభవార్త.. ఆ వీసాలో మార్పులు

పాదగయ క్షేత్రం ప్రసాదంలో పురుగులు.. పవన్ కల్యాణ్ ఇలాకాలో ఇలానా? (video)

Allu Arjun Fans: అల్లు అర్జున్ అభిమానులపై నాలుగు కేసులు - ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments