Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబా రాందేవ్ కంటే నేనేం ఎక్కువ చూపిస్తున్నానా : సోఫియా హయత్

మాజీ బిగ్ బాస్ కాంటెస్టెంట్, ప్రముఖ మోడల్ సోఫియా హయత్ సన్యాసినిగా మారిన విషయం తెలిసిందే. సోఫియా హయత్ క్రికెటర్ రోహిత్ శర్మకు మాజీ ప్రియురాలు. 2012లో రోహిత్ శర్మ 264 పరుగులు కొట్టినప్పుడు నగ్నంగా ఫోటో

Webdunia
గురువారం, 29 సెప్టెంబరు 2016 (12:01 IST)
మాజీ బిగ్ బాస్ కాంటెస్టెంట్, ప్రముఖ మోడల్ సోఫియా హయత్ సన్యాసినిగా మారిన విషయం తెలిసిందే. సోఫియా హయత్ క్రికెటర్ రోహిత్ శర్మకు మాజీ ప్రియురాలు. 2012లో రోహిత్ శర్మ 264 పరుగులు కొట్టినప్పుడు నగ్నంగా ఫోటో దిగి, దానిని కానుకగా ఇచ్చింది. ఆ తర్వాత 2013లో బిగ్‌బాస్ 7వ సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో పోటీ పడింది. బ్రిటీష్ జాతీయురాలిగా ఓ ప్రముఖ మోడల్‌గా ఎంతో పేరు తెచ్చుకుంది. 
 
ఇప్పుడు జీవితం పైన విరక్తి చెందిందో లేక మరో కారణమో కానీ సన్యాసినిగా మారింది. తన పేరును గియా సోఫియా మదర్‌గా మార్చుకుంది. సన్యాసి రూపంలోని తన చిత్రాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇప్పుడు అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె వయస్సు ప్రస్తుతం 31 ఏళ్లు. సన్యాసినిగా మారిన తన పేరు గియా సోఫియా మదర్‌గా మార్చుకుంది. సన్యాసం స్వీకరించిన తర్వాత లైమ్‌ లైట్‌కు దూరంగా ఉన్న ఈ భామ తాజాగా సోషల్‌ మీడియాలో హాట్‌గా దర్శనమిచ్చింది. 
 
లోయర్‌ బ్యాక్‌ ఫొటోలను ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. దీంతో నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు విసిరారు. సన్యాసిగా మారిన తర్వాతా.. ఇలాంటి చేష్టలేంటని కొందరు తప్పుపట్టారు. వారికి సమాధానమిచ్చే విధంగా మళ్లీ ఓ పిక్చర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టింది. తెల్లటి బాత్‌రోబ్‌లో ధ్యానం చేస్తున్న ఫొటో పోస్ట్ చేసి ఒక ప్రసంగం వినిపించింది. ''దైవత్వ వెలుగుగా మారడానికి మిమ్మల్ని మీరు ఉన్నతంగా తీర్చిదిద్దుకోండి. శరీర ప్రదర్శనను విమర్శించే వారికో విషయం చెప్పాలి.. నేను ఇప్పటికీ బాబా రామ్‌దేవ్‌ కంటే ఎక్కువ దుస్తులే వేసుకున్నా'' అంటూ సందేశం పెట్టింది. ఈ మెసేజ్‌ బాగానే ఉన్నా.. ఓ సన్యాసిని ఇలా కనిపించడం దుమారం రేపుతోంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments