Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్కినేని ఇంట డిసెంబరులో పెళ్లి బాజాలు.. చైతూ వెడ్స్ సమంత.. అఖిల్ వెడ్స్ శ్రియా భూపాల్!

అక్కినేని ఇంట పెళ్ళి భాజాలు మోగనున్నాయి. ఏ మాయ చేసావె హీరోహీరోయిన్లు నిజజీవితంలో భార్యాభర్తలు కానున్నారు. డిసెంబరులోనే అక్కినేని వారసులు పెళ్ళి కొడుకులు కానున్నారు. అక్కినేని నాగార్జున తనయులు ఇద్దరికి

Webdunia
ఆదివారం, 3 జులై 2016 (09:46 IST)
అక్కినేని ఇంట పెళ్ళి భాజాలు మోగనున్నాయి. ఏ మాయ చేసావె హీరోహీరోయిన్లు నిజజీవితంలో భార్యాభర్తలు కానున్నారు. డిసెంబరులోనే అక్కినేని వారసులు పెళ్ళి కొడుకులు కానున్నారు. అక్కినేని నాగార్జున తనయులు ఇద్దరికి డిసెంబరులోనే వివాహం కానుంది. నాగార్జున పెద్ద కుమారుడు నాగచైతన్య, సమంత.. రెండో కుమారుడు అఖిల్‌, ఆయన చిరకాల స్నేహితురాలు డిజైనర్‌ శ్రియా భూపాల్‌ జోడీలకు పెళ్లి కానుంది. 
 
నాగచైతన్య, చెన్నైకి చెందిన సమంత 2010లో వచ్చిన ‘ఏ మాయ చేసావె’ చిత్రంలో కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఆపై ఈ హిట్ పెయిర్ ఆటోనగర్‌ సూర్య, మనం చిత్రాల్లోనూ కలిసి నటించారు. ఏ మాయ చేసావె సినిమా నుంచే ప్రేమలో పడిన వీరిద్దరూ.. ఇప్పుడిప్పుడే తమ ప్రేమాయణం గురించి ఓపెన్‌గా చెప్పేశారు. 
 
దీనిపై మీడియాలో, సోషల్‌ మీడియాలో హాట్ హాట్‌గా చర్చ సాగింది. ఇద్దరూ కలిసి ఒక థియేటర్‌లో సినిమా చూశారంటూ నెట్‌లో ఫొటోలు కూడా హల్‌చల్‌ చేశాయి. కానీ సమంత, నాగచైతన్యల నుంచి అక్కినేని ఫ్యామిలీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. 
 
మెడలో ‘ఎన్‌’ అనే అక్షరం ఉన్న లాకెట్‌ ధరించిన సమంత ఫొటోలు కూడా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. ఆ అక్షరం తన జీవితంలో ఎంతో ముఖ్యమైందని సమంత చెప్పడం గమనార్హం. ఇంకేముంది.. అక్కినేని వారసులు ఇష్టమైన అమ్మాయిలనే పెళ్లాడనున్నారన్నమాట.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments