అడవి శేష్ నటన నచ్చుతుందిః మాళవిక సతీషన్

Webdunia
శనివారం, 8 అక్టోబరు 2022 (16:47 IST)
Malavika Satheeshan
విశ్వంత్ దుడ్డుంపూడి, మాళవిక సతీషన్ ప్రధాన పాత్రలలో సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో తెరకెక్కిన  రోమ్-కామ్ ''బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్' (BFH). స్వస్తిక సినిమా, ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై వేణు మాధవ్ పెద్ది, కె నిరంజన్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ఈ నెల 14న చిత్రం విడుదల కానున్న నేపధ్యంలో హీరోయిన్ మాళవిక సతీషన్ చిత్ర విశేషాలని తెలియ‌జేశారు.
 
- సినిమా టైటిల్ చూసి ఇది బోల్డ్ ఫిలిం అనుకుంటారు. కానీ ఇది చాలా క్లీన్ మూవీ. యూ/ఎ మూవీ. నటనకు చాలా ఆస్కారం వుండే సినిమా ఇది. ఎమోషన్, కామెడీ ఇలా అన్ని కోణాలు చూపించే అవకాశం దొరికింది. చాలా వైవిధ్యమైన కాన్సెప్ట్ వుంటుంది.
 
- నా రియల్ లైఫ్ కి దగ్గరగా వుండే పాత్ర ఇది. బేసిగ్గా సినిమాలల్లో అమ్మాయి వెనుక అబ్బాయి తిరుగుతాడు. కానీ ఇందులో అమ్మాయే అబ్బాయి వెనుక తిరుగుతుంది.  కథలో మంచి ఎమోషనల్ జర్నీ వుంటుంది. కాన్సెప్ట్ చాలా డిఫరెంట్ గా వుంటుంది. ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుందనే నమ్మకం వుంది. థియేటర్ ఎక్స్ పీరియన్స్ వున్న సినిమా ఇది. కోవిడ్ కారణంగా ఆలస్యమైనప్పటికీ ముందు అనుకున్నట్లే  థియేటర్లోనే విడుదల చేస్తున్నాం.
 
- నా కవర్ వీడియో సాంగ్ చూసి డైరెక్టర్ సంతోష్ గారు ఆడిషన్స్ కి పిలిచారు. ఆడిషన్స్ ఇచ్చాను. ఆ పాత్రకు నేను సరిపోతానని ఫైనల్ చేశారు. ఆయనతోనే మరో సినిమా కూడా చేస్తున్నాం.  
 
- చూసి చూడంగానే సినిమా తర్వాత గ్యాప్ రావడానికి కారణం, నా చదువు ఇప్పుడే పుర్తయింది. చదువు కారణంగా సినిమాల్లో కొంచెం నెమ్మదిగా వున్నా. ఇప్పుడు మూడు సినిమాలు చూస్తున్నా. శివ నాగేశ్వర్ రావు దర్శకత్వంలో దొచేవారెవరురా,  అలాగే సూపర్ గుడ్ ఫిలిమ్స్ లో మరో సినిమా చేస్తున్నా.
 
- పాత్రల విషయంలో నాకు ఒక విష్ లిస్టు వుంది. డిఫెన్స్ ఆఫీసర్ గా చేయాలని వుంది. అలాగే మంచి స్పోర్ట్ సినిమా, బయోపిక్ చేయాలని వుంది. అలాగే రాజమౌళి గారి సినిమాలో చేయాలని వుంది. అడవి శేష్ నటన నచ్చుతుంది. అలాగే నాగశౌర్య, అఖిల్ ఇష్టం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మీరు కూడా దేవుళ్లే అంటూ చెప్పిన సత్యసాయి జయంతి ఉత్సవాలకు ప్రధానమంత్రి మోడి

హిడ్మా తల్లితో భోజనం చేసిన ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి.. వారం రోజుల్లో హిడ్మా హతం

బెట్టింగ్స్ యాప్స్ యాడ్స్ ప్రమోషన్ - 4 ఖాతాల్లో రూ.20 కోట్లు ... ఇమ్మడి రవి నేపథ్యమిదీ...

అమెరికా 15 సంవత్సరాలు టెక్కీగా పనిచేశాడు.. క్యాబ్ డ్రైవర్‌గా మారిపోయాడు..

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా హతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments