నేను ఇంజనీరింగ్ చేశాను. బ్యాక్‌బెంచ్ స్టూడెంట్‌ను. కల్చరర్ సెక్రటరీని కూడా.నేను అన్ని రంగాలలో వుండాలనే రచయిత, గాయకుడు, నిర్మాత, హీరోతోపాటు చిన్నప్పటినుంచీ మిమిక్రీకూడా చేసేవాడిని అని హీరో శివకార్తికేయన్ అన్నారు.
ఆయన హీరోగా నటించిన సినిమా `డాన్.` ఈ చిత్రం సక్సెస్ అయిన సందర్భంగా ఆయన మాట్లాడారు. శివకార్తికేయన్ ప్రొడక్షన్స్‌తో కలిసి లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన 'డాన్' చిత్రం ద్వారా శిబి చక్రవర్తి దర్శకుడిగా పరిచయమయ్యారు. లైకా ప్రొడక్షన్స్ సుభాస్కరన్, శివకార్తికేయన్ ప్రొడక్షన్స్ సమర్పణలో శివకార్తికేయన్ హీరోగా నటించిన "డాన్ష చిత్రం ఈనెల 13న విడుదలై బ్లాక్ బస్టర్ ఓపెనింగ్స్ తో సక్సెస్‌వైపు సాగుతోంది.
కామెడీ గురించి మాట్లాడుతూ, నేను కామెడీ చేస్తున్నానంటే అన్ని భాషలలోని కమేడియన్స్‌ను పరిశీలిస్తాను. తెలుగులో బ్రహ్మానందం సినిమాలు ఎక్కువగా చూస్తుంటాను. ఆయనంటే ఇష్టం. భాష అర్థంకాకపోయినా రియాక్షన్ అర్థం చేసుకుంటాను. అలాగే మీమ్స్‌లోనూ కామెడీ వుంటుంది. థియేటర్‌లో ప్రేక్షకులనుంచి కూడా కామెడీ తీసుకోవచ్చు. ఇది కాలేజీ డాన్ కథ. డ్రింకింగ్, స్మోకింగ్ అనేవి లేకుండా తీసిన సినిమా. కుటుంబంతో కలిసి చూసే సినిమా ఇది అని తెలిపారు.