Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకు చాలా మంది మంచి అమ్మాయిలు స్నేహితులుగా ఉండేవారు : విజయ్ దేవరకొండ

Webdunia
బుధవారం, 19 జులై 2023 (07:41 IST)
Vijay Deverakonda
సొసైటీలో అన్ని రకాల వ్యక్తిత్వాలు ఉన్న వాళ్లు ఉంటారు. నాకు చాలా మంది మంచి అమ్మాయిలు స్నేహితులుగా ఉండేవారు. వారి గుడ్ ఫ్రెండ్ షిప్ తెలుసు. వైష్ణవి క్యారెక్టర్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. అబ్బాయిలు కూడా లవ్ బ్రేక్ చేసేవాళ్లు ఉంటారు. దర్శకుడు సాయి రాజేశ్ హానెస్ట్ గా అటెంప్ట్ చేశాడు. అతను నాకు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. నేను సపోర్ట్ చేసేందుకు రెడీగా ఉంటాను. అల్లు అరవింద్ గారి వల్ల వాసు గారు, మారుతి, ఎస్కేఎన్ గారు ఇలా వారి దగ్గర నుంచి ఈ టీమ్...ఒకరి సపోర్ట్ తో మరొకరు ఇలా వస్తున్నాం అని విజయ్ దేవరకొండ అన్నారు. 
 
టాలీవుడ్ లేటెస్ట్ బాక్సాఫీస్ సెన్సేషన్ బేబీ సినిమా కల్ట్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటనకు, నిర్మాతగా ఎస్‌కేఎన్ అభిరుచికి, సాయి రాజేష్ దర్శకత్వంపై ముఖ్య అతిథులు విజయ్ దేవరకొండ,  అల్లు అరవింద్, నాగబాబు, మైత్రీ మూవీ మేకర్స్ వై రవి శంకర్ ప్రశంసలు కురిపించారు.
 
విజయ్ దేవరకొండ మాట్లాడుతూ - బేబీ థియేటర్ లో కూర్చున్న వెంటనే ఓ రెండు ప్రేమ మేఘాలిలా పాట వచ్చింది. అప్పుడే ఒక మంచి లవ్ స్టోరి చూపిస్తున్నారనే ఫీల్ లోకి వెళ్లిపోయాను. ఇవాళ ఈ సినిమా గురించి  డిబేట్ చేస్తున్నారు. క్యారెక్టర్స్ గురించి  మాట్లాడుకుంటున్నారు. ఇందులో ఒకరు చెడ్డ, మరొకరు మంచి చెప్పడం ఉద్దేశం కాదు.  మా అందరిలో మంచి కథలు తెరపై చూపించాలనే ప్రయత్నమే ఉంటుంది. ఆనంద్ తనకు తానుగా ప్రాజెక్ట్స్ చేసుకుంటున్నాడు. ఇవాళ తన సక్సెస్ గర్వంగా ఉంది. అలాగే విరాజ్, వైష్ణవికి  మంచి పేరొచ్చింది. బేబీ మీద మీ లవ్ చూపిస్తూనే ఉండాలని కోరుకుంటున్నా. అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments