Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రెస్ట్ క్యాన్సర్ తో పోరాడి బలంగా,శక్తివంతంగా వున్నా: హంసా నందిని

Webdunia
బుధవారం, 8 మార్చి 2023 (10:11 IST)
Hamsa Nandini
హీరోయిన్  హంసా నందిని మహిళా దినోత్సవం సందర్భంగా బ్రెస్ట్ క్యాన్సర్‌తో తను చేసిన  స్ఫూర్తిదాయకమైన పోరాటాన్ని, ప్రయాణాన్ని పంచుకున్నారు. లాక్డౌన్ తర్వాత తన సినిమా షూటింగ్‌ను తిరిగి ప్రారంభించినసమయంలో జూలై 2020లో తనకు గ్రేడ్ 3 కార్సినోమా ఉన్నట్లు నిర్ధారణ అయిందని చెప్పారు. ఆమె తల్లి కూడా 18 సంవత్సరాల క్రితం రొమ్ము క్యాన్సర్‌తో పోరాడారు, అయితే దురదృష్టవశాత్తు ఓడిపోయారు.
 
 రోగ నిర్ధారణ తర్వాత  భయం, గందరగోళం, ఆందోళన ఆవహించాయని గతాన్ని గుర్తుచేసుకున్నారు హంసానందిని. వరుస స్కాన్లు , పరీక్షల తర్వాత ఆమె ధైర్యంగా శస్త్రచికిత్స చేయించకొని ట్యూమర్ ని తొలగించారు. క్యాన్సర్ వ్యాప్తిని అరికట్టడానికి అవసరమైన 16 సైకిల్స్ కీమోథెరపీని కూడా ధైర్యంగా ఎదుర్కున్నారు. కష్టకాలం ముగిసిందని భావిస్తున్న సమయంలో ఆమెకి  BRCA1 (వంశపారంపర్య రొమ్ము క్యాన్సర్) పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీని అర్ధం.. ఆమె జీవితకాలంలో మరో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం దాదాపు 70% వుందని తెలిసింది. ఈ రిస్క్ ని ఎదుర్కోవడానికి  ఏకైక మార్గమైన ఇంటన్సివ్ ఇన్వాసివ్ ప్రొఫిలాక్టిక్ సర్జరీని  ఆమె గత సంవత్సరం చేయించుకున్నారు.
 
కఠినమైన చికిత్సలు, సవాలుతో కూడిన రోగనిర్ధారణ ఉన్నప్పటికీ, వ్యాధి తన జీవితాన్ని నిర్దేశించకూడదని,.. చిరునవ్వుతో పోరాడుతూ, తిరిగి తెరపైకి రావాలని, ఇతరులకు అవగాహన కల్పించడానికి, స్ఫూర్తిని నింపేలా తన కథను చెప్పాలని హంసా తనకు తానుగా వాగ్దానం చేసుకున్నారు.  
 
ఆమె రోగనిర్ధారణ చేసి ఏడాదిన్నర అయ్యింది. ఆమె తన వాగ్దానాలకు కట్టుబడి ఉంది: ముందస్తు రోగనిర్ధారణ, సమర్థులైన వైద్యులు సహాయక నెట్‌వర్క్, ఆమె కుటుంబ, సానుకూల మనస్తత్వం వలన తిరిగి ఆరోగ్యకరమైన స్థితికి వచ్చానని చెప్పారు హంసానందిని.
 
గతేడాది నవంబర్‌లో సినిమా షూటింగ్ కోసం మళ్లీ సెట్‌లోకి అడుగుపెట్టారు హంసనందిని. ఆమె చేతిలో చాలా ప్రాజెక్ట్స్ వున్నాయి. త్వరలో బిగ్ స్క్రీన్ పైకి రావాలని ఎదురుచూస్తోంది. ట్రీట్‌మెంట్ తర్వాత సెట్స్‌లో తన అనుభవం గురించి అడిగినప్పుడు ఆమె ఇలా చెప్పారు.. "కెమెరా ముందు నేను ఎప్పుడూ లైవ్లీ గా ఫీలౌతాను. సెట్స్‌పైకి రావడం గొప్ప ఉత్సాహాని ఇస్తుంది. నేను ఇంతకు మునుపు కంటే బలంగా, మరింత శక్తివంతంగా వున్నాను’’ అన్నారు.
 
ఈ భయంకరమైన వ్యాధికి వ్యతిరేకంగా హంసా చేసిన సాహసోపేతమైన పోరాటం ఆమెకు అభిమానులు, సహచరులు, సెట్‌లో 'వారియర్ ' & 'ఫైటర్' అనే మారుపేర్లను సంపాదించిపెట్టాయి.
 
సెల్ఫ్ -చెకప్‌లు, రెగ్యులర్ మామోగ్రఫీ,  జన్యు పరీక్షల ద్వారా ముందస్తు రోగ నిర్ధారణ గురించి ఇతరులకు అవగాహన కల్పించడానికి తనను తాను అంకితం చేసుకోవాలని హంసా నందని నిర్ణయించుకున్నారు. బ్రెస్ట్  క్యాన్సర్ మ్యానేజ్ మెంట్,  చికిత్సకు సంబంధించిన అన్ని అంశాల గురించి సమాచారాన్ని దేశం అంతటా ప్రజలకు సులభంగా అందుబాటులో ఉంచడం ఆమె లక్ష్యం. దీని గురించి అడిగినప్పుడు..  "నేను జీవించి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా కీమోథెరపీ సమయంలో, నేను ప్రతి క్షణాన్ని నా చివరిదిగా జీవిస్తానని,  మెరుగైన స్థితి కోసం ప్రయత్నిస్తానని నాకు నేను ప్రామిస్ చేసుకున్నాను. దానికి తగ్గట్టుగానే రొమ్ము క్యాన్సర్‌ బారిన పడి మరణించిన నా తల్లి పేరు మీద 'యామినీ క్యాన్సర్‌ ఫౌండేషన్‌'ని నెలకొల్పుతున్నానని చెప్పడానికి సంతోషిస్తున్నాను.’’ అన్నారు
 
ఈ మహిళా దినోత్సవం సందర్భంగా  హంసానందిని కథ.. సెల్ఫ్ కేర్, ముందస్తు గుర్తింపు, సపోర్ట్  యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది. ఆమె బలం, సంకల్పం అన్ని ప్రతికూల పరిస్థితులలో పోరాడటానికి, జీవితాలను సంపూర్ణంగా జీవించడానికి స్ఫూర్తినిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Devaansh: నారా లోకేష్ కుమారుడు దేవాన్ష్ అదుర్స్.. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం (video)

సినీ ఇండస్ట్రీ ఏపీకి వస్తే బాగుంటుంది.. పవన్ చెప్పారు.. పల్లా శ్రీనివాస్

Hyderabad : కూతుర్ని కిడ్నాప్ చేశాడు.. ఆటో డ్రైవర్‌ను హతమార్చిన దంపతులు

Allu Arjun: రేవతి మరణానికి అల్లు అర్జునే కారణం.. రాళ్లు రువ్విన జాక్ (video)

King cobra : నన్నే పట్టుకుంటావట్రా..చుక్కలు చూపెట్టిన కోబ్రా. పాము కాటు నుంచి పిల్లి ఎస్కేప్ (వీడియోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

తర్వాతి కథనం
Show comments