Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి-2 ఇంత చరిత్ర సృష్టిస్తుందని ఊహించలేదు.. విజయేంద్రప్రసాద్

బాహుబలి-2 చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందనే అంచనా ఉంది కానీ ఇలా చరిత్ర సృష్టిస్తుందని అస్సలు ఊహించలేదని బాహుబలి కథా రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. అయితే రికార్డులున్నవి బద్దలు కొట్టడానికే కాబట్టి బాహుబలి రికార్డును బద్దలు కొట

Webdunia
సోమవారం, 8 మే 2017 (02:59 IST)
బాహుబలి-2 చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందనే అంచనా ఉంది కానీ ఇలా చరిత్ర సృష్టిస్తుందని అస్సలు ఊహించలేదని బాహుబలి కథా రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. అయితే రికార్డులున్నవి బద్దలు కొట్టడానికే కాబట్టి బాహుబలి రికార్డును బద్దలు కొట్టే సినిమా తప్పక రావచ్చని తెలిపారు. ఏది ఏమైనా బాహుబలి తెలుగు సినిమా హద్దులను చెరిపేసింది విజయేంద్ర ప్రసాద్ సంతోషం వ్యక్తం చేశారు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే.. 
 
 
‘బాహుబలి విజయం సాధిస్తుందనే అనుకున్నాను కానీ, చరిత్ర సృష్టిస్తుందని ఊహించలేదు. ప్రస్తుతం బాహుబలి విజయం అందించిన ఆనందంలో ఉన్నాను. రికార్డులున్నవి బద్దలు కొట్టడానికే. ఈ రికార్డు కూడా ఎప్పుడైనా బద్దలు కావచ్చు. బాహుబలి తెలుగు సినిమా హద్దులను చెరిపేసింది’– 
 
కేవలం పది రోజుల్లోనే ప్రపంచం వ్యాప్తంగా వెయ్యి కోట్ల రూపాయలను వసూలు చేసి బాలీవుడ్ దిమ్మ దిరిగేలా చేసిన బాహుబలి-2ని పలు విదేశీ భాషల్లో అనువదిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో ‘బాహుబలి–2’విడుదలైన విషయం తెలిసిందే. మరికొన్ని భాషల్లోకి ఈ చిత్రం అనువాదం అయ్యే అవకాశం ఉందని చిత్రనిర్మాతలు ప్రకటించారు.
 
‘‘బాహుబలి సినిమాను మొదట చైనీస్‌ భాషలోకి అనువదించాలనుకుంటున్నాం. చైనీస్‌ మార్కెట్‌ను అంచనా వేసి, స్క్రీన్స్‌ను నిర్ణయిస్తాం. ఆ తర్వాత జపనీస్, కొరియన్, తైవాన్‌ భాషల్లో అనువదించాలనే ఆలోచన ఉంది. అక్కడ కూడా ప్రేక్షకులు ‘బాహుబలి’ సినిమాను ఆదరిస్తారన్న నమ్మకంతో ఉన్నాం’’అని ‘బాహుబలి’నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ ఓ ప్రకటనలో తెలిపారు.
 
అతి పెద్ద మైలురాయి..
‘భారతీయ సినిమా చరిత్రలో అతి పెద్ద మైలురాయిని అతి పెద్ద చిత్రం సాధించింది’
 – కరణ్‌ జోహార్, ప్రముఖ హిందీ దర్శక నిర్మాత
 
మైలురాయి చేరుకున్నందుకు అభినందనలు
‘భారతీయ సినిమా చరిత్రలోనే తొలిసారి రూ.1,000 కోట్ల మార్కు అందుకున్నందుకు రాజమౌళి, ప్రభాస్, చిత్ర బృందానికి హృదయపూర్వక శుభాకాంక్షలు’– పవన్‌ కల్యాణ్‌
 
ఊహించనిది నిజమైంది..
‘అస్సలు ఊహకే అందనిది నిజమైంది. తెలుగు సినిమా పరిశ్రమను తలెత్తుకునేలా చేసినందుకు రాజమౌళి, అతని బృందానికి అభినందనలు’– మహేశ్‌ బాబు
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

తిరుపతి ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్.. ఎస్పీపై బదిలీవేటు

అవేవీ అవసరం లేకపోయినా కొంటూ, ఆర్భాటాలకు పోయి ఆర్థికంగా కుంగిపోతున్న ప్రజలు

తప్పు జరిగింది.. క్షమించండి.. పోలీసులు - ఫ్యాన్స్‌పై ఆగ్రహం : పవన్ కళ్యాణ్ (Video)

భార్యపై స్నేహితులతో అత్యాచారం చేయిస్తూ ఆనందిస్తున్న సౌదీ భర్త, పోలీసులు దర్యాప్తు

తిరుపతి కలెక్టర్ - ఎస్పీకి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments