Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకు బైక్ న‌డ‌ప‌టం రాదు నడిపేవారంటే ఇష్టం : రానా ద‌గ్గుబాటి

Webdunia
బుధవారం, 12 ఏప్రియల్ 2023 (19:47 IST)
Sreesinha, Rana Daggubati, Kavya
శ్రీసింహా కోడూరి, కావ్యా క‌ళ్యాణ్ రామ్ హీరో హీరోయిన్లుగా వారాహి చ‌ల‌న‌చిత్రం, క్రిషి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యార్స్‌పై ఫ‌ణిదీప్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌జినీ కొర్ర‌పాటి, రాకేష్ రెడ్డి గ‌డ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు నిర్మిస్తోన్న చిత్రం ‘ఉస్తాద్’. ఈ సినిమా టీజర్‌ను బుధ‌వారం రానా ద‌గ్గుబాటి రిలీజ్ చేశారు.
 
రానా ద‌గ్గుబాటి మాట్లాడుతూ ‘‘శ్రీసింహ సహా ఈ టీమ్‌లో దాదాపు అంద‌రితో నాకు అనుబంధం ఉంది. రాకేష్ నాతో నెంబ‌ర్ వ‌న్ యారి చేశాడు. హిమాంక్ నా టాలెంట్ ఏజెన్సీ న‌డిపాడు. ఇక సింహ అయితే బాహుబ‌లి సమ‌యంలో ఐదేళ్ల పాటు నాతో ట్రావెల్ చేశాడు. టీజ‌ర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది.అంద‌రూ మంచి సినిమా చేసుంటార‌ని అనుకుంటున్నాను. నాకు బైక్ న‌డ‌ప‌టం రాదు. అయితే ఎవ‌రైతే బాగా వెహిక‌ల్ న‌డుపుతుంటారో వారిని బాగా ఇష్ట‌ప‌డుతుంటాను. డైరెక్ట‌ర్ ఫ‌ణిదీప్‌ను రీసెంట్‌గానే క‌లిశాను. ప‌వ‌న్ క‌ళ్యాణ్ టైటిల్ లాంటిదే ఓ మోట‌ర్ బైక్‌కి పెట్టాశాడంటే అత‌ని గ‌ట్స్ వేరే లెవ‌ల్ అని అర్థ‌మ‌వుతుంది. ఎంటైర్ టీమ్‌కు అభినంద‌నలు’’ అన్నారు.
 
హీరో శ్రీసింహ మాట్లాడుతూ ‘‘మా ఉస్తాద్ మూవీ టీజ‌ర్ రిలీజ్ చేసిన రానాగారికి థాంక్స్‌. కాస్త నెర్వ‌స్‌గా ఉంది. ఈ సినిమా క‌థ విన్నాను. అప్పుడు అందులో హీరోకి బైక్ బాగా న‌డ‌ప‌టం రావాలి. నాకేమో అంతంత మాత్ర‌మే వ‌చ్చు. అందుక‌ని ముందే చెబితే హీరోని ఎక్క‌డ మార్చేస్తారో అని చెప్ప‌కుండా రేపు షూటింగ్ ఉంద‌న‌గా చెప్పాను. త‌న‌కు గుండెల్లో రాయి ప‌డ్డ‌ట్ల‌య్యింది. ఈ సినిమాలో హీరోకి బైక్ ఎలాగైతే ఉస్తాద్ అయ్యిందో నాకు కూడా అలాగే అయ్యింది. ఎందుకంటే షూటింగ్ స‌మ‌యంలో బైక్ రైడింగ్ బాగా నేర్చుకున్నాను. చాలా మంచి జ్జాప‌కాలున్నాయి. టీజ‌ర్ అంద‌రికీ న‌చ్చే ఉంటుంద‌ని భావిస్తున్నాను. అంద‌రికీ థాంక్స్‌’’ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం చంద్రబాబుతో పవన్ భేటీ... రూ.కోటి చెక్కును అందజేసిన డిప్యూటీ సీఎం

విజయవంతంగా బుడమేరు గండ్లు పూడ్చివేత (Video)

సునీత విలియమ్స్ - బచ్ విల్మెర్ పరిస్థితేంటి : వీరు లేకుండానే కదిలిన ఆస్ట్రోనాట్ క్యాప్సుల్

రూ.33 కోట్లు దారి మళ్లించిన స్విగ్గీ మాజీ ఉద్యోగి!

అప్పుగా తీసుకుని తిరిగి చెల్లించకుండా సైలెంట్‌గా సైనెడ్‌తో చంపేసే లేడీ కిల్లర్స్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వాహకులను సత్కరించిన తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ

కలబంద రసం ఉదయం పూట సేవిస్తే ఏమవుతుంది?

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు చిట్కాలు

విడిగా విక్రయించే టీలో కల్తీ యొక్క సూచికలు

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన సూత్రాలు

తర్వాతి కథనం
Show comments