పవన్ కళ్యాణ్ నుంచి ఏమీ ఆశించలేదు - ది 100 కథ సుకుమార్ కు చెప్పా : ఆర్కే సాగర్

దేవీ
శనివారం, 21 జూన్ 2025 (15:26 IST)
RK Sagar
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను కలవాని నాకు అనిపించిన వెంటనే వెళ్ళి కలిశాను. జనసేన తీర్థం తీసుకున్నా. దానికి నటుడిగా నా కెరీర్ కు ఎటువంటి అడ్డంకి లేదని ఆర్కే సాగర్ స్పష్టం చేశారు. రుతురాగాలు సీరియల్ తో బుల్లితెర మెగాస్టార్ గా మారిన ఆయన్ను మెగాస్టార్ చిరంజీవి అమ్మగారు అంజనాదేవి అభిమానించేవారు. అందుకే కెరీర్ గానూ, జనసేనలోకి వెళ్లేటప్పుడు ఆమె ఆశీర్వాదాలు తీసుకుంటారు సాగర్.
 
తాజాగా ఆయన ది 100  సినిమా లో నటించారు. పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ చిత్రం టీజర్ ను, ఓసారి అంజనాదేవి, నాగబాబు, తెలంగాణ మంత్రులకు చూపించి ఆశీస్సులు పొందారు. నేడు ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. జులై 11న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
 
ఈ సందర్భంగా ఆయన పలు విషయాలు తెలియజేశారు. ఈ సినిమా ఏడాదిముందే రిలీజ్ చేయాలి. కానీ వివిధ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ లో మంచి చిత్రంగా గుర్తింపు తెచ్చుకుంది. నన్ను అందరూ పోలీస్ గా చూడాలని అడుగుతున్నారు. అందుకే ఈ సినిమా చేశాను. సుకుమార్ కూ కథను చెప్పాను. కథ బాగుంది ప్రొసీడ్ అన్నారు. పవన్ కళ్యాణ్ గారూ కూడా టీజర్ చూశారు. ఇలా ప్రముఖుల మన్ననలు పొందాను అని చెప్పారు.
 
100 చిత్ర కథ రొటీన్ కాదు. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. ఇంతకుముందు ఏ సినిమాకూ పోలీకలేదు. ఇది రియల్ పోలీస్ కథ. ఇద్దరు పోలీసు జీవిత చరిత్రను ఆదారంగా చేసుకుని దర్శకుడు అల్లిన కథ మాత్రమే. ప్రతి సన్నివేశం సరికొత్తగా వుంటుందని సాగర్ తెలిపారు. ఈ చిత్రానికి సాంకేతిక వర్గంగా  ఓంకార్ శశిధర్, నారంగ్ మిషా, రమేష్ కరుటూరి పనిచేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దళిత ఐపీఎస్‌పై కులవివక్ష - వేధింపులు తాళలేక ఆత్మహత్య

పెద్ద కొడుకును బజారుకు పంపించి చిన్నకుమారుడు ఎందుటే సీలింగ్ ఫ్యానుకు ఉరేసుకున్న తల్లి

Andhra Pradesh: రూ.1.14 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలకు ఎస్ఐపీబీ ఆమోదం

హెచ్1బీ వీసా ఎఫెక్ట్: ఎన్నారై వరుడి డిమాండ్ తగ్గింది.. అమెరికా సంబంధాలొద్దు: భారతీయులు

వైద్య కాలేజీలను పీపీపీ విధానంలో నిర్మిస్తే తప్పేంటి? హైకోర్టు ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

తర్వాతి కథనం
Show comments