Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ త‌ర్వాత మంచి ప‌నిచేశా: అభిజిత్

Webdunia
మంగళవారం, 22 డిశెంబరు 2020 (17:46 IST)
బిగ్‌ బాస్‌4 విజేతగా నిలిచిన త‌ర్వాత ఏదైనా మంచిప‌ని చేయాల‌నుకున్నా. అందుకే అంద‌రికీ ప్రాణ‌వాయువు ఇచ్చే మొక్క‌ల‌ను నాటాల‌ని ముందుకు వ‌చ్చా. ఈరోజు అందుకు శ్రీ‌కారం చుట్టాను.. అని సీజ‌న్‌4 విజేత అభిజిత్ తెలియ‌జేస్తున్నారు. ఇంకా ప‌లు మంచి ప‌నులు చేయ‌డానికి సిద్ధంగా వున్నాన‌నీ, సినిమా రంగంలో కూడా ఎద‌గాల‌నుకుంటున్నాన‌ని తెలిపారు.
 
ఈ సందర్భంగా అభిజిత్ మాట్లాడుతూ.. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది అని బిగ్ బాస్ 4 రియాల్టీ షో విజేతగా నిలిచిన సందర్భంగా ఏదైన మంచి కార్యక్రమం చేయాలి అన్న ఉద్దేశంతో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి ఈరోజు మొక్కలు నాటడం జరిగిందన్నారు.
 
ఇంత మంచి కార్యక్రమం చేపట్టి ముందుకు తీసుకుపోతున్న సంతోష్ గారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యాన్ని మనందరం నియంత్రించాలని, అందుకోసం ప్రతి ఒక్కరి బాధ్యతగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.
 
ఈ సందర్భంగా తనతోపాటు బిగ్ బాస్ షోలో పాల్గొన్న సోహెల్, హారిక, కళ్యాణిలను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో MLC శ్రీనివాస్ రెడ్డి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రాఘవ, కిషోర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments