Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజు గారి గది 2.. సమంతకు డబ్బింగ్ చెప్పి ఏడ్చేశాను.. చిన్మయి.. ఎందుకో తెలుసా?

రాజు గారి గది 2 సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ఈ సినిమా ట్రైలర్ అక్కినేని నాగేశ్వర రావు పుట్టిన రోజును పురస్కరించుకుని సినీ యూనిట్ రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్‌కు సోషల్ మీడియాలో మంచి స్పందన రావడంతో పాటు సి

Webdunia
శుక్రవారం, 22 సెప్టెంబరు 2017 (11:49 IST)
రాజు గారి గది 2 సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ఈ సినిమా ట్రైలర్ అక్కినేని నాగేశ్వర రావు పుట్టిన రోజును పురస్కరించుకుని సినీ యూనిట్ రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్‌కు సోషల్ మీడియాలో మంచి స్పందన రావడంతో పాటు సినిమాపై అంచనాలు కూడా పెరిగాయి. 
 
ఈ సినిమాలో సమంత దెయ్యంగా కనిపించిన సంగతి తెలిసిందే. సమంత పాత్రకు చిన్మయి డబ్బింగ్ చెప్పింది. దీనిపై చిన్మయి మాట్లాడుతూ.. సమంతకు మొదటి నుంచి డబ్బింగ్ వాయిస్ ఇస్తూ వస్తున్నానని.. సమంతాకు చిన్మయి డబ్బింగే ప్రాణమని వెల్లడించింది. 
 
'రాజుగారి గది 2' సినిమాలో సమంత తన నటనతో అదరగొట్టిందని ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. సమంత పాత్ర.. ఆ పాత్రలో ఆమె జీవించిన తీరును చూసి.. డబ్బింగ్ చేస్తూ ఏడ్చేశానని చిన్మయి తెలిపింది. చిన్మయి ట్వీట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. రాజు గారి గది 2లో సమంత నటనపై అంచనాలు మరింత పెంచేశాయి. 
 
చిన్మయి చెప్పినదానిని బట్టి చూస్తే, ఈ సినిమాలో సస్పెన్స్, హారర్‌తో పాటు ఎమోషనల్ సీన్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయని సినీ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అక్టోబర్ 13వ తేదీన ఈ సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నాగార్జున మెంటలిస్టుగా, శీరత్ కపూర్ కీలక రోల్‌లో కనిపిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments