Webdunia - Bharat's app for daily news and videos

Install App

Nitin: సక్సెస్ ఇవ్వలేకపోయా : నితిన్; తమ్ముడుతో సక్సెస్ ఇస్తావ్ : దిల్ రాజు

దేవీ
మంగళవారం, 1 జులై 2025 (10:55 IST)
Dil Raju, nitin, laya and others
నితిన్ నటించిన పలు సినిమాలు ఇంతకుముందు పరాజయం పాలయ్యాయి. నన్ను అభిమానించే ఫ్యాన్స్ కు హ్యాపీ చేయలేకపోయా. ఇంతకుముందు కొన్ని సినిమాలతో వారిని హ్యాపీ చేయలేకపోయా. జులై 4న తమ్ముడు విడులవుతుంది. ఇకనుంచి మంచి సినిమాలతో ముందుకు వస్తానని నితిన్ అన్నారు. నిన్న రాత్రి హైదరాబాద్ లో జరిగిన తమ్ముడు ప్రీరిలీజ్ వేడుకలో ఆయన మాట్లాడారు. 
 
జులై 4న వచ్చే తమ్ముడు ఫ్యాన్స్ నూ దర్శక నిర్మాతలను హ్యాపీ చేస్తుందని భావిస్తున్నాను. ఈ సినిమాకోసం ముగ్గురిని ప్రధానంగా పేర్కొనాలి. ముందుగా రెండేళ్ళ కష్టపడ్డ దర్శకుడు వేణు శ్రీరామ్ కు ధన్యవాదాలు. అలాగే ఇందులో నటించిన నటీనటులుకూడా. చిత్ర నిర్మాతకూ థ్యాంక్స్ చెబుతున్నా.
 
80 రోజులపాటు ఫారెస్ట్ లో నాతో పాటు అందరూ నటించి కష్టపడ్డారు. చిన్న పిల్లలు కూడా పారిపోకుండా నిలబడి సినిమా చేశారు. ఫారెస్ట్ లో సరైన ఫుడ్ లేకపోయినా, చెప్పులులేకుండా నటించడంతో ముళ్లు గుచ్చుకున్నా, రాళ్ళు గుచ్చుకున్నా భరించారు. నా సినిమాలను శిరీష్, దిల్ రాజు బాగా ఎంకరేజ్ చేశారు.
 
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ, నితిన్ జయంతో 20  సంవత్సరాలు పూర్తిచేశాడు. దిల్ తో  నేను 22 సంవత్సరాలు అయింది.  ఆర్యతో ఎంటర్ అయిన వేణు 20 సంవత్సరాలు పూర్తి చేశారు. ఇలా 21 సంవత్సరాలు నాతో దర్శకుడు అసిస్టెంట్ గా మొదలై దర్శకుడిగా జర్నీ చేశాడు. ఈ సినిమాకు ప్రతీ టెక్నీషియన్స్ బాగా పనిచేశారు. గుహన్, శేఖర్, వేణు శ్రీరామ్ అందరూ ఫారెస్ట్ లో కష్టపడ్డారు. 2.34 నిముషాల నిడివి వున్న సినిమా ఇది. వెండితెరపై మంచి అద్భుతంగా సినిమా వచ్చింది. జొన్నవిత్తుల గారు అమ్మవారు సాంగ్ రాశారు. దానితోనే కొత్త ఎనర్జీ వచ్చింది. ఇక అజనీష్ సంగీతం కాంతార తర్వాత మంచి సినిమాకు పనిచేశారు.
 
నితిన్ చుట్టూ పంచపాడవుల్లా లయ, వర్ష తోపాటు ఐదుగురు పంచనారులు నటించారు. నితిన్ కు సక్సెస్, ఫెయిల్యూర్ కామన్. తమ్ముడు కమ్ బ్యాక్ ఫిలిం అవుతుంది. ఫెయిల్యూర్ లేకపోతే సక్సెస్ లేదు. అందుకే నితిన్ కు మంచి సక్సెస్ రాబోతుంది అన్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమ్మ మీద ఏదో పోశారు.. చెంప మీద కొట్టారు... ఆపై లైటర్‌తో నిప్పంటించారు..

'సురవరం'కు సీఎం చంద్రబాబు నివాళులు - పోరాట వారసత్వం ఇచ్చి వెళ్లారు...

గర్భవతైన భార్యను చంపి మృతదేహాన్ని ముక్కలు చేసిన కిరాతక భర్త

రైలులో నిద్రిస్తున్న మహిళను అసభ్యంగా తాకిన కానిస్టేబుల్

బాలికను ఆటోలో తీసుకెళ్లి అత్యాచారం... ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments