Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదృష్టంతో పాటు హార్డ్ వర్క్‌ని నమ్ముతాను - రష్మిక మందన

Webdunia
సోమవారం, 8 ఆగస్టు 2022 (17:50 IST)
Rashmika Mandana
దుల్కర్ సల్మాన్ - మృణాల్ ఠాకూర్ జంటగా, రష్మిక మందన కీలక పాత్రలో వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మించిన ప్రతిష్టాత్మక చిత్రం 'సీతారామం'.  హను రాఘవపూడి దర్శకత్వంలో ఆగస్ట్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించిన క్లాసిక్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలో అఫ్రిన్ గా కనిపించిన రష్మిక పాత్రకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వస్తోంది. తాజాగా సీతారామం క్లాసిక్ విజయంపై విలేఖరుల సమావేశంలో మాట్లాడారు రష్మిక.  
 
అఫ్రిన్ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఎలా ఫీలౌతున్నారు?
 'సీతారామం' విజయం చాలా ఆనందాన్ని ఇచ్చింది. 'సీతారామం' కోసం టీమ్ అంతా దాదాపు రెండేళ్ళ పాటు చాలా హార్డ్ వర్క్ చేసింది. కష్టానికి తగ్గ ఫలితం ప్రేక్షకులు క్లాసిక్ బ్లాక్ బస్టర్ రూపంలో ఇచ్చారు. దర్శకుడు హను గారు అఫ్రిన్ పాత్రని గురించి చెప్పినపుడు ఆ పాత్రలో గ్రేట్ ఆర్క్ వుందని అన్నారు. నేను కూడా దాన్ని బలంగా నమ్మాను. మా నమ్మకం నిజమైయింది.  
 
అఫ్రిన్ పాత్ర మీకు ఎంతవరకు సవాల్‌గా అనిపించింది ?
అఫ్రిన్ లాంటి వైలెంట్ పాత్ర ఇంతవరకూ చేయలేదు(నవ్వుతూ). ఇది ఛాలెంజ్ గా అనిపించింది. చాలా కొత్తగా అనిపించింది.
 
సీతారామం కథ మీ దగ్గరికి వచ్చినపుడు ఎలా అనిపించింది?
సీతారామం నాకు ఖచ్చితంగా డిఫరెంట్ మూవీ. నేను ఇప్పటి వరకూ హీరోయిన్ గానే చేశాను. అయితే ఒక నటిగా విభిన్నమైన పాత్రలు చేయాలని వుంటుంది. సీతారామంలో నా పాత్ర చాలా యునిక్ గా అనిపించింది. ఒక గొప్ప కథని చెప్పే పాత్ర కావడం నాకు చాలా నచ్చింది. రాబోతున్న సినిమాల్లో కూడా కొన్ని డిఫరెంట్ రోల్స్ చేస్తున్నా.
 
కెరీర్ పీక్ స్టేజ్ లో వున్నపుడు ప్రయోగాత్మక చిత్రాలు చేయడంలో  రిస్క్ ఉంటుందా?
ప్రయోగాత్మక చిత్రాలు చేయడం కూడా చాలా ముఖ్యం. కంఫర్ట్ జోన్ లో వుండటం బాగానే వుంటుంది. అయితే ఒక నటిగా అన్ని డిఫరెంట్ పాత్రలు చేయాలని వుంది. ఇప్పుడు నా కంఫర్ట్ జోన్ దాటి కొన్ని సినిమాలు చేస్తున్నా.
 
హను రాఘవపుడి గారితో పని చేయడం ఎలా అనిపించింది ?
హను గారు గ్రేట్ ప్యాషన్ వున్న దర్శకుడు. ఆయనకి మరిన్ని గొప్ప విజయాలు రావాలని కోరుకుంటున్నాను. సినిమా కోసం చాలా కష్టపడతారాయన. ఆయన పడ్డ కష్టానికి ఫలితం దక్కింది. చాలా ఆనందంగా వుంది.
 
డ్రీమ్ రోల్స్ ఏమైనా ఉన్నాయా ?
పిరియాడికల్ మూవీ చేయాలనీ వుంది. అలాగే స్పోర్ట్స్, యాక్షన్, బయోపిక్.. ఇలా డిఫరెంట్ మూవీస్ చేయాలనీ వుంటుంది. ఇప్పుడే మొదలుపెట్టాం కదా.. ఇంకా చాలా చేయాలి.
 
హిందీలో ఒక్క సినిమా విడుదల కాకముందే మూడు అవకాశాలు వచ్చాయి కదా? మీరు లక్కీ అని భావిస్తున్నారా ?
 హిందీలోనే కాదు .. తెలుగులోనూ ఇలా జరిగింది. ఛలో షూటింగ్ లోనే వుండగా గీతగోవిందం, దేవదాస్ చిత్రాల అవకాశాలు వచ్చాయి. సరైన కథలు వస్తున్నపుడు అలా జరిగిపోతాయి. అదృష్టంతో పాటు హార్డ్ వర్క్ ని నమ్ముతాను.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kishan Reddy: హైదరాబాద్ నగరానికి రెండు ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

kadapa: అరటిపండు ఇస్తానని ఆశ చూపి మూడేళ్ల బాలికపై అత్యాచారం.. ఎక్కడ? (video)

Kerala Woman: నాలుగేళ్ల కుమార్తెను నదిలో పారేసిన తల్లి.. పిచ్చి పట్టేసిందా?

ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన టీడీపీ కూటమి ప్రభుత్వం!

ఆపరేషన్ సిందూర‌తో పాకిస్థాన్ వైమానిక దళానికి అపార నష్టం!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments