Webdunia - Bharat's app for daily news and videos

Install App

నారా రోహిత్ షాకింగ్ కామెంట్స్... 'గౌతమిపుత్ర'లో మిస్సయ్యాననే బాధ లేదు...

బాలకృష్ణ నటించిన 'గౌతమి పుత్ర శాతకర్ణి'లో నందమూరి వంశీయులు నటించాల్సి వుంది. కొందరు ప్రతిష్టాత్మక సినిమా కనుక అందులో నటిస్తామని అడిగారు. కానీ ఎవరెవరు వున్నారనేది పెద్దగా తెలీదు. అయితే ఇందులో పెద్దగా నందమూరి వంశీయులు లేరని దర్శకుడు చెబుతున్నాడు. కానీ.

Webdunia
బుధవారం, 4 జనవరి 2017 (18:13 IST)
బాలకృష్ణ నటించిన 'గౌతమి పుత్ర శాతకర్ణి'లో నందమూరి వంశీయులు నటించాల్సి వుంది. కొందరు ప్రతిష్టాత్మక సినిమా కనుక అందులో నటిస్తామని అడిగారు. కానీ ఎవరెవరు వున్నారనేది పెద్దగా తెలీదు. అయితే ఇందులో పెద్దగా నందమూరి వంశీయులు లేరని దర్శకుడు చెబుతున్నాడు. కానీ.. నారా రోహిత్‌ ఇందులో ఓ పాత్ర వేయాల్సింది. ఆ పాత్ర కన్నడ రాజ్‌కుమార్‌ తనయుడు పునీత్‌ కుమార్‌కు దక్కింది. ముందుగా రోహిత్‌ను అనుకున్నారు. 
 
కానీ పాత్రలోని ఔచిత్యం దెబ్బతింటుందని పలువురు సూచించడంతో బాలకృష్ణ మనసు మార్చుకున్నారు. అదెలాగంటే... గౌతమిపుత్ర శాతకర్ణి రాజ్యం విస్తారమైంది. కన్నడ రాష్ట్రం కూడా తెలుగులోనిదే. అక్కడి నాయకుడు పాత్ర ఒకటి చేయాలి. దానికి వచ్చీరాని తెలుగులో మాట్లాడాలి.. అందుకు సరైన నటుడు పేరున్న వ్యక్తి పునీత్‌ కనుక.. మార్కెట్‌ పరంగా దాన్ని మరింత వన్నె తెచ్చేందుకు పునీత్‌ను ఎన్నుకున్నట్లు తెలిసింది. అయితే ఈ విషయాన్ని నారా రోహిత్‌ లైట్‌గా తీసుకున్నారు. 
 
సినిమాకు కొన్ని లెక్కలుంటాయి.. వాటిననుసరించే ఆ పాత్ర తనకు దక్కలేదనీ, తనకు ఆ పాత్ర రాలేదనే బాధ లేదని చెప్పాడు. అయితే.. ఎవ్వరికీ దక్కని ఓ అవకాశం నాకు దక్కింది. ఈ సినిమాను చాలావరకు చూసే అవకాశం కల్గింది. చాలా బాగుంది. వార్‌ ఎపిసోడ్‌ అద్భుతంగా వుందని పేర్కొన్నాడు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments