Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఆస్కార్' కంటే తనకు అదే ఎక్కువ అంటున్న దర్శకుడు రాజమౌళి

ఆస్కార్ అవార్డు అంటే హాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పిచ్చ క్రేజ్. ఆ అవార్డు వస్తే దాన్ని అందుకుని ముద్దులు కురిపిస్తూ స్టేజీపై గుక్కపెట్టి ఏడ్చేస్తుంటారు ఆనందం తట్టుకోలేక. ఇక మన బాలీవుడ్ విషయానికి వస్తే... ఇక్కడ ఫిల్మ్ ఫేర్ అవార్డులు వుండనే వున్నాయి. ఆస్క

Webdunia
సోమవారం, 25 సెప్టెంబరు 2017 (20:07 IST)
ఆస్కార్ అవార్డు అంటే హాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పిచ్చ క్రేజ్. ఆ అవార్డు వస్తే దాన్ని అందుకుని ముద్దులు కురిపిస్తూ స్టేజీపై గుక్కపెట్టి ఏడ్చేస్తుంటారు ఆనందం తట్టుకోలేక. ఇక మన బాలీవుడ్ విషయానికి వస్తే... ఇక్కడ ఫిల్మ్ ఫేర్ అవార్డులు వుండనే వున్నాయి. ఆస్కార్ అవార్డుపై ఒకింత ఉత్సాహం ఇక్కడా వుంటుంది. దక్షిణాది సినీ ఇండస్ట్రీకి వస్తే ఆస్కార్ అవార్డుపై ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కోలా వుంటుంది. 
 
మొన్నీమధ్య ఆస్కార్ అవార్డు ఎంట్రీకి మన దేశం నుంచి బాలీవుడ్ సినిమా న్యూటన్ ఎంపికైనట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐతే కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టిన బాహుబలి ఈ రేసులో నిలవలేకపోయింది. దీనిపై చాలామంది రాజమౌళిని ప్రశ్నిస్తున్నారు. బాహుబలి ఆస్కార్ ఎంట్రీ రేసులో నిలవలేకపోవడం బాధగా లేదా అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నలకు రాజమౌళి స్పందించారు.
 
తనకు అవార్డుల కంటే తన సినిమా ఎంతమంది ప్రజలకు నచ్చుతుందున్నది ముఖ్యమనీ, అలాగే ఆ సినిమా వల్ల ప్రొడ్యూసర్‌కు లాభాలు తెచ్చేట్లు చూడటమే తన లక్ష్యమంటూ చెప్పారు. ముఖ్యంగా తన సినిమా ప్రేక్షకులు బాగా నచ్చిందని చెపుతూ సినిమాను సూపర్ హిట్ చేస్తే అంతకు మించిన అవార్డు తనకు ఏదీ లేదని చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments