Webdunia - Bharat's app for daily news and videos

Install App

'కోడి పందెం'కి సై... డియ‌ర్ కామ్రేడ్...

Webdunia
శనివారం, 29 డిశెంబరు 2018 (13:45 IST)
వరస విజయాలతో దూసుకుపోతున్న సంచలన హీరో విజయ్ దేవరకొండ కొత్త సినిమా డియర్ కామ్రేడ్ చిత్రం కాకినాడ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. భరత్ కమ్మ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రష్మిక మందన్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండతో జోడీ కడుతున్నారు. గీత గోవిందం తర్వాత వీళ్ళు నటిస్తున్న రెండో సినిమా ఇది. కాకినాడలోని అందమైన లోకేషన్స్‌లో ఈ చిత్ర షూటింగ్ జరిగింది. చాలామంది విద్యార్థులు ఈ షూటింగ్‌లో పాల్గొన్నారు. సినిమాలో అతిపెద్ద షెడ్యూల్ ఇదే. 
 
ఇప్పటికే నాలుగు షెడ్యూల్స్ పూర్తిచేసుకుంది డియర్ కామ్రేడ్ చిత్రం. మీరు ప్రేమించే దానికోసం యుద్ధం చేయండి.. ఫైట్ ఫ‌ర్ వాట్ యు ల‌వ్.. అనే ట్యాగ్ లైన్‌తో డియర్ కామ్రేడ్ సినిమా వస్తుంది. స్టూడెంట్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఎమోషనల్ డ్రామా ఈ చిత్రం. ఇందులో విజయ్ దేవరకొండ సామాజిక బాధ్యత కలిగిన యువకుడిగా ఒక పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ డియర్ కామ్రేడ్ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మే ప్రథమార్థంలో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
 
కాగా ఈ చిత్రం గురించి విజయ్ దేవరకొండ మాట్లాడుతూ... నన్ను డిఫరెంట్ రోల్‌లో చూస్తారు. కాకినాడలో షూటింగ్ ఆహ్లాదకరంగా జరుగుతోంది. అవకాశం వస్తే కోడి పందేలను చూసేందుకు సంక్రాంతికి వస్తా అంటూ చెప్పుకొచ్చాడు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తదితరులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: భరత్ కమ్మ, నిర్మాణ సంస్థలు: మైత్రి మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్, నిర్మాతలు: నవీన్ యేర్నేని, రవిశంకర్ ఎలమంచిలి, మోహన్ చెరుకూరి(సివిఎం), య‌శ్ రంగినేని, సీఈవో: చెర్రీ, సంగీతం: జస్టిన్ ప్రభాకరన్, సినిమాటోగ్ర‌ఫీ: సుజిత్ సారంగ్, ఎడిటర్ అండ్ డిఐ కలరిస్ట్: శ్రీజిత్ సారంగ్, డైలాగ్స్: జై కృష్ణ, ఆర్ట్ డైరెక్టర్: రామాంజనేయులు, లిరిక్స్: చైతన్య ప్రసాద్, రెహమాన్, కృష్ణకాంత్, కొరియోగ్రాఫర్: దినేష్ మాస్టర్, కాస్ట్యూమ్ డిజైనర్: యశ్వంత్ బైరి, రజిని, యాక్షన్ డైరెక్టర్: జి మురళి, పబ్లిసిటీ డిజైన్: అనిల్ భాను, పిఆర్ఓ: వంశీ శేఖర్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Baby Gorilla: ఇస్తాంబుల్ విమానాశ్రయంలో బేబీ గొరిల్లా.. ఎలా పట్టుబడిందంటే? (viral video)

అల్లు అర్జున్ వ్యవహారం.. నోరెత్తకండి.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

తెలుగు రాష్ట్రాల్లో హడలెత్తిస్తోన్న అఘోరీ.. కేసులు నమోదు.. ఏం జరిగిందంటే?

Chandrababu: అమరావతి నిర్మాణ పనులకు రూ.2,723 కోట్లు ఆమోదం..

ఐకాన్ స్టార్ అయితే ప్రత్యేక రాజ్యాంగం ఉంటుందా?: మంత్రి కోమటిరెడ్డి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments