మంచి కథా బలం స్క్రీన్ ప్లే వున్న హారర్ సినిమాలని ఇష్టపడతాను. ఈ జోనర్ లో సినిమాలు చేయడానికి ఇష్టపడతాను. తెలుగు లో ఈ సినిమాని నాని గారికే ఫస్ట్ చూపించాను. హారర్ జానర్ తనకి చాలా ఇష్టం. తనకి చాలా నచ్చింది. హార్ట్ ఫుల్ గా బావుందని చెప్పారు. ఇలాంటి సినిమాలకి నాని గారు లాంటి స్టార్ వర్డ్ చాలా ముఖ్యం. ఆయన ప్రీరిలీజ్ ఈవెంట్ కి రావడం మాకు చాలా హెల్ప్ అయ్యింది అని హీరో ఆది పినిశెట్టి అన్నారు.
'వైశాలి హీరో ఆది పినిశెట్టి, దర్శకుడు అరివళగన్‌లు రెండోసారి మరో ఇంట్రస్టింగ్ సూపర్‌నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ శబ్దం. 7G ఫిల్మ్స్ శివ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సిమ్రాన్, లైలా, లక్ష్మీ మీనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ తో సినిమాపై క్యురియాసిటీ పెంచాయి. ఈ సినిమా ఫిబ్రవరి 28న ఆంధ్రాలో ఎన్ సినిమాస్, నైజాంలో మైత్రి డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో ఆది పినిశెట్టి సినిమా విశేషాల్ని పంచుకున్నారు.
శబ్ధం హారర్ సినిమాల్లో ఎంత డిఫరెంట్ గా వుంటుంది?
- శబ్ధం మంచి కథా బలం ఎమోషన్ వున్న హారర్ జోనర్ సినిమా. రెగ్యులర్ హారర్ సినిమాలకి చాలా భిన్నంగా వుంటుంది. ఆత్మలని ఒక సైంటిఫిక్ మెథడ్ లో అన్వేషించే విధానం చాలా కొత్త అనుభూతిని ఇస్తుంది. స్క్రీన్ ప్లే చాలా ఇంట్రస్టింగ్ గా వుంటుంది. ఇలాంటి సినిమాలు తీయడం కూడా కష్టమే. ఇలాంటి వరల్డ్ ని ఇంతకు ముందు ఎవరూ చూపించలేదు. హారర్ సినిమాల్లో 'వైశాలి' ఎంత డిఫరెంట్ సినిమానో శబ్ధం కూడా అంత డిఫరెంట్ గా స్పెషల్ గా వుంటుంది. టెక్నికల్ గా సినిమా చాలా రిచ్ గా వుంటుంది.
శబ్ధంలో సౌండ్ రోల్ ఏమిటి ?
-ఇందులో నాది పారానార్మల్ ఇన్వెస్టగేటర్ క్యారెక్టర్. తను ఆత్మలని సౌండ్ తోనే పసిగడుతుంటాడు. సౌండ్ అనేది ప్రతి సీన్ లో ఇంపార్ట్టెన్స్ వుంటుంది. నిజానికి నేను ఆత్మలని నమ్మను. కానీ ఈ సినిమా కోసం మెటిరియల్ చదువుతున్నపుడు నిజంగా అలాంటి అదృశ్యశక్తులు ఉంటాయోమో అనిపించింది.
సిమ్రన్, లైలా పాత్రల గురించి ?
-సిమ్రన్, లైలా గారి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. వారి పాత్రలు సినిమాలో చాలా కీలకంగా వుంటాయి. క్యారెక్టర్స్ చాలా ఫ్రెష్ గా అనిపిస్తాయి.
తమన్ గారి మ్యూజిక్ గురించి ?
-ఇలాంటి సినిమాలకి మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. తమన్ గారి మ్యూజిక్ మాకు చాలా ప్లస్ అయ్యింది. ఆయన పెద్ద సినిమాలు చేస్తూ కూడా మా సినిమాకి మ్యూజిక్ చేశారు. సినిమాకి ఎంతకావాలో అంతకంటే అద్భుతంగా చేశారు. సినిమా చూస్తున్నపుడు మ్యూజిక్ ని చాలా ఎంజాయ్ చేస్తారు.
-ఈ సినిమాకి టెక్నికల్ టీం అద్భుతంగా పని చేసింది. సౌండ్ డిజైన్ చాలా అద్భుతంగా వుంది. కెమరామెన్ అరుణ్ అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. ఆర్ట్ వర్క్ కూడా మెస్మరైజింగా అనిపిస్తుంది. ప్రతి క్రాఫ్ట్ చాలా ప్రేమతో సినిమా చేశారు.
ప్రస్తుతం చేస్తున్న సినిమాలు గురించి? ;
-అఖండ 2లో ఓ క్యారెక్టర్ చేస్తున్నాను. దేవాకట్టా గారి దర్శకత్వంలో మయసభ చేస్తున్నాను. అలాగే 'డ్రైవ్' అనే సినిమా చేస్తున్నాను. మరకతమణి 2 షూటింగ్ జరుగుతోంది.