Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయి పల్లవి కి నేను కూడా ఫ్యాన్ -అమరన్ తీయాలంటై గట్స్ కావాలి : నాగ్ అశ్విన్

డీవీ
సోమవారం, 28 అక్టోబరు 2024 (09:36 IST)
Amaran team with nag aswin
శివకార్తికేయన్ మల్టీలింగ్వల్ బయోగ్రాఫికల్ యాక్షన్ మూవీ 'అమరన్'. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఉలగనాయగన్ కమల్ హాసన్, R. మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి నిర్మిస్తున్నారు. సాయి పల్లవి ఫిమేల్ లీడ్ గా నటిస్తున్నారు. సుధాకర్ రెడ్డి, సిస్టర్ నిఖిత రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగులో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ ద్వారా గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఈ చిత్రం దీపావళికి అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 
ఈ సందర్భంగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాట్లాడుతూ, రెండు వారాలు ముందు సాయి పల్లవి ఇంట్రో  వీడియో చూశాను. అప్పుడే ఈ సినిమా చూడాలని డిసైడ్ అయ్యాను. ఇది చాలా వండర్ఫుల్ స్టోరీ. ఇలాంటి స్టోరీ చేయాలంటే చాలా ఫ్యాషన్ కావాలి . ఒక రియల్ స్టోరీ తీసినప్పుడు చాలా బాధ్యత ఉంటుంది. కమల్ హాసన్ గారు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయడం వెరీ గ్రేట్.  ప్రొడక్షన్ క్వాలిటీ అద్భుతంగా కనిపిస్తుంది.  సాయి పల్లవి గారికి మీ అందరిలోనే నేను కూడా ఫ్యాన్ ని.  శివ కార్తికేయన్ డాక్టర్ సినిమాకి నేను చాలా పెద్ద ఫ్యాన్ ని.  ఎన్నిసార్లు చూశానో లెక్కలేదు.  చాలా డిఫరెంట్ రోల్స్  చేస్తుంటారు.  ఈ సినిమాకు చాలా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు. 
 
శివకార్తికేయన్, మేజర్ ముకుంద్ వరదరాజన్, ఇందు రెబెకా ట్రూ స్టోరీ. అమరన్  ఒక సోల్జర్.. లవ్ డ్యూటీ ఫ్యామిలీ ఎలా ఉంటుందో డైరెక్టర్ రాజకుమార్ అద్భుతంగా చూపించారు. ఈ సినిమాలో నేను మేజర్ ముకుంద్ రోల్ చేశాను. ఇందుగా సాయి పల్లవి నటించింది. సాయి పల్లవి గారు ఎంత మంచి పెర్ఫార్మర్ అందరికీ తెలుసు. ఇందులో అద్భుతంగా చేశారు ఈ సినిమాలో యాక్షన్ తో పాటు ఈక్వల్య్ లవ్ ఎమోషన్ ఉంది. అక్టోబర్ 31 దీపావళి రోజున అందరూ థియేటర్స్ కి రండి అన్నారు
 
సాయి పల్లవి మాట్లాడుతూ,  అమరన్ సినిమాతో మీ ముందుకు రావడం చాలా గర్వంగా ఉంది.  చాలా మంచి సినిమా.  ఇది రియల్ సోల్జర్ జర్నీ.  రెండు రోజులు ముందు ఆర్మీ వాళ్లకి ఈ సినిమా చూపించినప్పుడు మా లైఫ్ కూడా ఇలాగే ఉందని వారు చెప్పారు. ఈ సినిమాని చాలా రియల్ గా చూపించారు. ఈ సినిమా నాకు చాలా నచ్చింది.  నా క్యారెక్టర్ ని డైరెక్టర్ గారు ఇందులో చాలా అద్భుతంగా చూపించారు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ  తండేల్ సినిమాతో వస్తాను. అప్పుడు మరింత మాట్లాడదాం  అన్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

2024 చివర్లో ఇలా దొరికిపోయారు, స్వంత స్పా సెంటర్లోనే నకిలీ పోలీసులతో రూ. 3 కోట్లు డిమాండ్

మనిషి తరహాలో పనులు చేస్తున్న కోతి..! (Video)

బీచ్‌లో కూరుకున్న లగ్జరీ కారు.. ఎడ్లబండి సాయంతో... (Video)

తీర్పు ఇచ్చేవరకు కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దు : హైకోర్టు

అన్నా వర్శిటీలో విద్యార్థినిపై అత్యాచారం... మదురై నుంచి చెన్నైకు బీజేపీ ర్యాలీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

తర్వాతి కథనం
Show comments